S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/07/2016 - 00:41

చిత్రం.. క్రీడా జ్యోతిని వెలిగించిన బ్రెజిల్ మాజీ అథ్లెట్ వాండెర్లీ డి లిమా

08/07/2016 - 00:38

టోంగా ఫ్లాగ్ బేరర్ పిటా టౌఫాటొఫా ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఒంటికి బేబీ ఆయిల్ రాసుకొని మార్చ్‌పాస్ట్‌లో పాల్గొనడమే అందుకు కారణం. షర్టు వేసుకోకుండా, ఒంటి నిండా నూనెతో విచిత్రంగా కనిపించిన ఈ తైక్వాండో వీరుడ్ని ప్రేక్షకులతోపాటు వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు కూడా ఆసక్తిగా గమనించడం కనిపించింది

08/07/2016 - 00:37

రియో డి జెనీరో, ఆగస్టు 6: రియోలో భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన స్టార్ షూటర్ అభినవ్ బింద్రా త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ముందు నడవగా, భారత బృందం అతనిని అనుసరించింది. అల్ఫాబెటికల్ ఆర్డర్‌ను అనుసరించి భారత్ 95వ దేశంగా స్టేడియంలోకి అడుగుపెట్టింది. ఒలింపిక్స్ కోసం ఇక్కడికి చేరుకున్న 118 మంది అథ్లెట్లలో 70 మంది మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు.

08/07/2016 - 00:35

రియో డి జెనీరో, ఆగస్టు 6: రియో ఒలింపిక్స్ ప్రారంభోత్స కార్యక్రమం అట్టహాసంగా జరిగినప్పటికీ, మరకానా స్టేడియంలో ఎక్కువ భాగం సీట్లు ఖాళీగా కనిపించాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైన దశలో ఒలింపిక్స్ నిర్వాహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడాన్ని స్థానిక ప్రజలు నిరసిస్తున్న విషయం తెలిసిందే. వివిధ శాఖల ఉద్యోగులు, కార్మికుల ప్రదర్శనలతో రియో అట్టుడికిపోతున్నది.

08/07/2016 - 00:32

రియో డి జెనీరో, ఆగస్టు 6: రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం చివరిలో ‘లారెల్ ట్రోఫీ’ని స్వీకరించే అవకాశం కెన్యా ఒలింపిక్ కమిటీ చైర్మన్ కిప్చోగ్ కెనోకు దక్కింది. కెన్యా రన్నింగ్ లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న 76 ఏళ్ల కెనో 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో 1,500 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 1972 మ్యూనిచ్ గేమ్స్‌లో 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో విజేతగా నిలిచాడు.

08/07/2016 - 00:31

రియో డి జెనీరో, ఆగస్టు 6: ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారి శరణార్థుల జట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) పతాకం కింద పోటీపడుతున్నది. వివిధ కారణాలతో స్వదేశాలను విడిచి, ఇతర దేశాల్లో తలదాచుకునే వారికి ఇన్నాళ్లూ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. కొంత మందికి అవకాశం దొరికినా, వారు తమ సొంత దేశం తరఫున కాకుండా, శరణార్థిగా ఉన్న దేశం తరఫున బరిలోకి దిగారు.

08/07/2016 - 00:29

రియో డి జెనీరో, ఆగస్టు 6: ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ మార్చ్‌పాస్ట్‌లో ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. స్పెయిన్ జాతీయ పతాకాన్ని ధరించి, తన బృందానికి నాయకత్వం వహించిన ఈ టెన్నిస్ స్టార్ స్టేడియంలోకి ప్రవేశించిన వెంటనే ప్రేక్షకులు పెద్దగా చప్పట్లు కొడుతూ అతనికి ఘనంగా స్వాగతం పలికారు. అతను గాయాల సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నట్టు కనిపించాడు.

08/06/2016 - 11:23

రియో డి జనీరో : భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మారకానా స్టేడియంలో 31వ ఒలింపిక్స్‌ క్రీడా వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 6 వేల మంది కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అభినవ్‌ బింద్రా ఆరంభోత్సవంలో జాతీయ జెండాతో భారత బృందానికి నాయకత్వం వహించాడు. ఈసారి భారత్‌ నుంచి రికార్డు స్థాయిలో 118 మంది ఒలింపిక్స్‌ బరిలోకి దిగుతున్నారు.

08/06/2016 - 11:17

రియో డి జెనీరో: ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలనతో రియోలోని మారకానా స్టేడియంలో విశ్వ క్రీడా పోటీలకు అంకురార్పణ జరిగింది. దాదాపు 12,000 మంది క్రీడాకారుల చేతులు మారి వచ్చిన టార్చ్‌ను మారథాన్‌ రన్నర్‌ వాన్డెర్లీ కార్డిరో డి లిమా చేతికి అందించారు. జ్యోతిని వెలిగించారు. అనంతరం అథ్లెట్లు ఒలింపిక్‌ గ్రామానికి చేరుకున్నారు.

08/06/2016 - 08:25

రియో డి జెనీరో, ఆగస్టు 5: గతంలో ఎన్నడూ లేని విధంగా వందకుపైగా సభ్యులతో కూడిన భారత బృందం పతకాలపై భారీ అంచనాతో రియో ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నది. స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు ఇవే చివరి ఒలింపిక్స్ కావడంతో అందరి దృష్టి అతనిపై కేంద్రీకృతమైంది. ప్రారంభ వేడుకల కవాతులో భారత బృందానికి నాయకత్వం వహించిన 38 ఏళ్ల బింద్రా రియో ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్తున్నట్టు ఇది వరకే ప్రకటించాడు.

Pages