S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/30/2016 - 08:10

రియో డి జెనీరో, జూలై 29: రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న కొద్దీ బ్రెజిల్‌లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఒలింపిక్స్‌ను వేదికగా చేసుకొని తమ సమస్యలను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడానికి, బ్రెజిల్ సర్కారు మెడలు వంచి డిమాండ్లను సాధించుకోవడా నికి వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికుల తోపాటు వైద్యులు, ఉపాధ్యాయులు, కర్షకులు, చివరికి పోలీసులు కూడా నిరసనలకు దిగారు.

07/30/2016 - 08:09

రియో డి జెనీరో, జూలై 29: రియోలో వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, వివిధ శాఖల ఉద్యోగులు, చివరికి పోలీసులు నిరసన ప్రదర్శనలకు దిగినప్పటికీ భయపడని అధికారులకు కార్మికుల ఆందోళనలు వణుకుపుట్టిస్తున్నాయి. ఇతరత్రా శాఖల వారి గురించి పెద్దగా పట్టించుకోని ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ సభ్యులు, రియో నగర పాలక సంస్థ అధికారులు చివరికి పోలీసుల ప్రదర్శనలను కూడా తేలిగ్గా తీసుకున్నారు.

07/30/2016 - 08:07

రియో డి జెనీరో, జూలై 29: అనుకున్న సమయంలో పనులు పూర్తికాకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయని రియో డి జెనీరో మేయర్ ఎడ్యుయార్డో పేస్ అంగీకరించాడు. అసౌకర్యానికి క్షమించాలని వివిధ దేశాల నుంచి ఇప్పటికే ఒలింపిక్ క్రీడాగ్రామానికి చేరుకున్న అథ్లెట్లకు విజ్ఞప్తి చేశాడు. ఆర్థిక మాంద్యం, రాజకీయ అనిశ్చితి వంటి పలు కారణాలతో రియో ఒలింపిక్స్ కేంద్రాల్లో చేపట్టిన పలు పనుల్లో జాప్యం జరుగుతోంది.

07/30/2016 - 08:06

హైదరాబాద్, జూలై 29: ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో ఫేవరిట్ తెలుగు టైటాన్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. కాగా, పాట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. శుక్రవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో పాట్నా పైరేట్స్ 37-33 పాయింట్ల తేడాతో పుణెరీ పల్టన్‌ను ఓడించింది. ప్రదీప్ నర్వాల్ 10 పాయింట్లతో రాణించగా, రాజేష్ మోండల్ ఆరు పాయింట్లు చేశారు.

07/30/2016 - 08:05

సిడ్నీ, జూలై 29: ప్రపంచ మహిళల అథ్లెటిక్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన ఆస్ట్రేలియా మేటి హర్డిల్స్ రన్నర్ శాలీ పియర్స్ రియో ఒలింపిక్స్‌కు దూరమైంది. చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న ఆమె పూర్తిగా కోలుకోక ముందే కండరాలు చిట్లడంతో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని ప్రకటించింది.

07/30/2016 - 08:05

బెర్లిన్, జూలై 29: జర్మనీకి సాకర్ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ట్రోఫీని సాధించిపెట్టిన కెప్టెన్ బాస్టియన్ స్వాస్టెజర్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇటీవల జరిగిన యూరో-2016లో జర్మనీ ఫైనల్ చేరుకోలేకపోయింది. సెమీ ఫైనల్‌లో ఫ్రాన్స్ చేతిలో అనూహ్యంగా 0-2 తేడాతో పరాజయాన్ని

07/30/2016 - 08:04

కింగ్‌స్టన్, జూలై 29: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసిన భారత క్రికెట్ జట్టులో శనివారం నుంచి మొదలయ్యే రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అన్ని విభాగాల్లోనూ భారత జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది. విండీస్ అందుకు భిన్నంగా దారుణంగా విఫలమవుతున్నది. అటు బౌలింగ్‌లోగానీ, ఇటు బ్యాటింగ్‌లోగానీ ఆ జట్టు రాణించలేకపోతున్నది.

,
07/29/2016 - 05:36

జమైకా, జూలై 28: వెస్టిండీస్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భారత క్రికెటర్లు నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఇక్కడి సబీనా పార్క్‌లో గురువారం ఉదయం నెట్స్‌కు హాజరైన టీమిండియా సభ్యులు అవిశ్రాంతంగా శ్రమించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

07/29/2016 - 05:31

న్యూఢిల్లీ, జూలై 28: డోపింగ్ పరీక్షలో విఫలమైన రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) క్రమశిక్షణ కమిటీ తన తీర్పును వాయిదా వేసింది. శనివారం లేదా సోమవారం తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 74 కిలోల విభాగంలో భారత్ నుంచి ఒకరికి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

07/29/2016 - 05:29

న్యూఢిల్లీ, జూలై 28: నర్సింగ్ యాదవ్ మాదిరిగానే డోపింగ్ పరీక్షలో విఫలమైన షాట్‌పుటర్ ఇందర్‌జిత్ సింగ్ రెండో పరీక్షలోనూ దోషిగానే తేలాడు. ‘బి’ శాంపిల్‌లోనూ అతను నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వాడినట్టు రుజువైంది. దీనితో రియో ఒలింపిక్స్‌లో అతను పాల్గొనే అవకాశాలకు గండిపడింది.

చిత్రం.. ఇందర్‌జీత్ సింగ్

Pages