S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/29/2016 - 05:28

బులవాయో, జూలై 28: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నిం గ్స్‌లో జింబాబ్వే కేవలం 164 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 32 పరుగులు చేసింది. మార్టిన్ గుప్టిల్ (10), టామ్ లాథమ్ (16) నాటౌట్‌గా ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచిన జిం బాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది.

07/29/2016 - 05:27

హైదరాబాద్, జూలై 28: ప్రో కబడ్డీ టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. శుక్రవారం జరిగే రెండు సెమీ ఫైనల్స్‌లో పోరాడే నాలుగు జట్లు తుది పోరు అవకాశం కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే సెమీస్‌ను గెలిచి, ఫైనల్‌లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా తెలుగు టైటాన్స్ బరిలోకి దిగనుంది.

07/29/2016 - 05:26

పల్లేకల్, జూలై 28: కుశాల్ మెండిస్ అజేయ శతకంతో రాణించడంతో, ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక కోలుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు వెనుకంజలో ఉన్న లంక బుధవారం ఆటను వర్షం కారణంగా నిలిపివేసే సమయానికి తన రెండో ఇన్నింగ్స్‌లో కుశాల్ పెరెరా (4)ను కోల్పోయి ఆరు పరుగులు చేసిన విషయం తెలిసిందే.

07/28/2016 - 04:38

నర్సింగ్ యాదవ్‌కు ఒలింపిక్స్‌కు వెళ్లే దారులు దాదాపుగా అన్నీ మూసుకుపోగా, చివరి ఆశగా జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ విచారణ మిగిలింది. తాను నిర్దోషినని, తనకు సరఫరా చేసిన ఆహారంలో ఎవరో ఉద్దేశపూర్వకంగా మాదక ద్రవ్యాలను కలిపి ఉంటారని నర్సింగ్ వాదిస్తున్న విషయం తెలిసిందే. నాడా క్రమశిక్షణ కమిటీ బుధవారం సమాశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది.

07/28/2016 - 04:36

న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ పంచయ్ యాదవ్ స్థానంలో ప్రవీణ్ రాణాను ఎంపిక చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) తీసుకున్న నిర్ణయానికి అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (యుడబ్ల్యుడబ్ల్యు) సానుకూలంగా స్పందించింది. అతని ఎంపిక పట్ల ఎలాంటి అభ్యంతరం లేదంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యుడబ్ల్యుడబ్ల్యు ఆమోద ముద్ర పడడంతో రియో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ పాల్గొనడం దాదాపుగా ఖాయమైంది.

07/28/2016 - 04:35

న్యూఢిల్లీ, జూలై 27: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయ. ఆగ స్టు ఐదో తేదీన ముంబయలో వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) జరుగుతుందని తొలుత ప్రకటించారు. అయతే, సమావే శానికి నిర్దేశించిన అంశాల్లో ఎక్కడా లోధా కమిటీ సిఫార్సులు, వాటి అమలుకు సంబంధించిన ప్రస్తావనే లేదు.

07/28/2016 - 04:33

కింగ్‌స్టన్, జూలై 27: వెస్టిండీస్ టూర్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు బుధవారం వీడియో గేమ్స్‌లో బిజీబిజీగా గడిపింది. కింగ్‌స్టన్ చేరుకున్న భారత క్రికెటర్లు ఆటవిడుపుగా వీడియో గేమ్స్ ఆడుతూ టైమ్‌పాస్ చేశారు. విండీస్‌ను మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 92 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా అదే ఉత్సాహంతో రెండో టెస్టు కోసం ఎదురుచూస్తున్నది.

07/28/2016 - 04:33

న్యూఢిల్లీ, జూలై 27: బెంగళూరు బుల్స్‌తో బుధవారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్ లీగ్ మ్యాచ్‌లో పుణెరీ పల్టన్ మూడు పాయంట్ల తేడాతో గెలిచింది. ఈ జట్టు 36 పాయంట్లు సాధించగా, గట్టిపోటీనిచ్చిన బెంగళూరు 33 పాయంట్లు చేసింది. పుణెరీ కెప్టెన్ మన్జీత్ చిల్లార్ 11 పాయంట్ల తో రాణించి, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీపక్ నివాస్ హూడా తొమ్మిది పాయంట్లు చే శాడు.

07/28/2016 - 04:35

లాసనే్న, జూలై 27: రష్యా అథ్లెట్లు నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించడాన్ని మానుకోవడం లేదు. దీనితో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే బృందం నుంచి భారీ సంఖ్యలో అథ్లెట్లు నిషేధానికి గురవుతున్నారు. తాజాగా 19 మంది రోయర్లు డోప్ పరీక్షలో విఫలమైనట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ప్రకటించింది. డోప్ దోషుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా, రియోకు వెళ్లే వారి సంఖ్య పలచబడుతున్నది.

07/27/2016 - 06:07

నిన్న రెజ్లర్లు నర్సింగ్, సందీప్.. నేడు షాట్‌పుటర్ ఇందర్‌జీత్
డోపింగ్‌లో పట్టుబడుతున్న భారత అథ్లెట్లు

Pages