• ధర్మశాల, సెప్టెంబర్ 14: ఆస్ట్రేలియాతో 2016లో జరిగిన టీ20 సూపర్ 10 మ్యాచ్‌ను గ

  • కొలంబో, సెప్టెంబర్ 14: అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా శనివారం స్థానిక ప్రేమదాస

  • ధర్మశాల: కరేబియన్ పర్యటనను విజయవంతంగా ముగించిన కోహ్లీ సేన నేటి నుంచి స్వదేశంల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/10/2016 - 06:41

ముంబయి: టి-20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకునే సత్తా భారత్‌కే ఎక్కువగా ఉందని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్, స్పిన్నర్ మొయిన్ అలీ జోస్యం చెప్పారు. బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందని అన్నారు. స్వదేశంలో టోర్నీ జరగడం కూడా ఆ జట్టుకు లాభించే అంశమని పేర్కొన్నారు.

03/10/2016 - 06:39

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ని ధర్మశాల నుంచి కోల్‌కతాకు మార్చినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశాడు. బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో అతను మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మ్యాచ్‌ని మరో వేదికకు మార్చేందుకు అంగీకరించామని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆటగాళ్లందరిపైనా నిఘా ఉంటుందన్నాడు.

03/09/2016 - 07:09

క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి

03/09/2016 - 06:37

న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు కెప్టెన్, యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై ‘ఆజ్ తక్ సలాం క్రికెట్’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఒకరు అతనిని జావేద్ మియందాద్, టెన్నిస్ మాజీ సూపర్ స్టార్ జాన్ మెకెన్రోతో పోలిస్తే మరొకరు టీమిండియాలో మిగతా ఆటగాళ్లు ఎవరికీ లేని ప్రత్యేక, గౌరవం, ప్రధాన్యం కోహ్లీకి మాత్రమే ఉన్నాయని అన్నాడు.

03/09/2016 - 06:36

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ తనకు టెన్నిస్ మాజీ సూపర్ స్టార్ జాన్ మెకెన్రోను గుర్తుతెస్తున్నాడని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. మెకెన్రో తరచు ప్రత్యర్థి ఆటగాళ్లతో, అంపైర్లతో ఘర్షణకు దిగేవాడని అన్నాడు. ఈ విధంగా సవాళ్లు విసురుతూ, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు దూసుకెళ్లడం వల్ల ఆట కొత్తపుంతలు తొక్కుతుందని అన్నాడు.

03/09/2016 - 06:35

నాగపూర్: టి-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ గ్రూప్ ‘బి’లో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. హాంకాంగ్‌ను ఢీకొన్న ఈ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు సాధించింది.

03/09/2016 - 06:33

ముంబయి: టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య దేశం భారత్ గెలుస్తుందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ జోస్యం చెప్పాడు. కానీ, పోటీలో ఉన్న అన్ని జట్లూ విజయాలు సాధించాలన్న పట్టుదతోనే బరిలోకి దిగుతున్నాయని, కాబట్టి పోరు తీవ్రంగా ఉంటుందని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డాడు. ఫేవరిట్ అంటే తన ఉద్దేశంతో బలమైన జట్టని చెప్పాడు.

03/09/2016 - 06:32

కొలంబో: శ్రీలంక సెలక్టర్లపై వేటు పడింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో లంక జట్టు దారుణంగా విఫలమైన కారణంగా కపిల విజెగుణవర్దన నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ఆగ్రహంతో ఉంది. అందుకే కమిటీని రద్దు చేసి, మాజీ బ్యాట్స్‌మన్ అరవింద డిసిల్వ నాయకత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.

03/08/2016 - 07:34

మహిళల టి-20 వరల్డ్ కప్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ గ్రూపుల్లో మొదటి రెండు స్థానాలను సంపాదించిన జట్లు సెమీ ఫైనల్స్ చేరుతాయి.

03/08/2016 - 07:31

కోల్‌కతా: భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి విమర్శించడం చాలా సులభమని భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. క్రికెట్‌పై ప్రతి ఒక్కరికీ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని, వాటిని వ్యక్తీకరించడమేగాక, సలహాలు కూడా ఇస్తుంటారని బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకొని, సహచరులతో కలిసి ఇక్కడికి చేరుకున్న ధోనీ అన్నాడు.

Pages