S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/18/2016 - 03:20

న్యూఢిల్లీ, జూలై 17: దేశంలో తొలిసారి వివిధ నగరాల మీదుగా నిర్వహిస్తున్న మల్టీ సిటీ మారథాన్ ‘గ్రేట్ ఇండియా రన్’ ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి (ఇండియా గేట్) వద్ద కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, ‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీత అంజూ బాబీ జార్జ్ ఆదివారం జెండా ఊపి లాంఛనంగా ఈ మారథాన్‌ను ప్రారంభించారు.

07/18/2016 - 03:18

చండీగఢ్, జూలై 17: డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఇప్పటికే వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ దశకు దూసుకెళ్లిన భారత్ మరో విజయాన్ని సాధించింది. ఆసియా/ఓషియానియా గ్రూప్-1లో ఆదివారం ఇక్కడ జరిగిన రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లో భారత్ ఈ విజయాన్ని అందుకుంది. కెరీర్‌లో సింగిల్స్ మ్యాచ్‌లు పెద్దగా ఆడని రోహన్ బొపన్న ఆదివారం దక్షిణ కొరియా ఆటగాడు హాంగ్ చుంగ్‌ను ఓడించి భారత్‌కు ఈ విజయాన్ని అందించాడు.

07/18/2016 - 03:16

లండన్, జూలై 17: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్ బోణీ చేసింది. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో పాక్ ఆదివారం 75 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 8 వికెట్ల నష్టానికి 214 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ మరో పరుగుకే ఆలౌటైంది.

07/18/2016 - 03:15

కోల్‌కతా, జూలై 17: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్) నాలుగో ఎడిషన్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ మళ్లీ విజయాల బాటపట్టింది. ఆదివారం కోల్‌కతాలో ఆసక్తికరంగా జరిగిన పోరులో ఆ జట్టు 33-27 పాయింట్ల తేడాతో పునేరీ పల్టన్‌ను మట్టికరిపించి ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది.

07/18/2016 - 03:13

న్యూఢిల్లీ, జూలై 17: డబ్ల్యుబిఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌పై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

,
07/17/2016 - 05:43

చండీగఢ్, జూలై 16: డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ దశకు దూసుకెళ్లింది. ఆసియా/ఓషియానియా గ్రూప్-1లో శనివారం ఇక్కడ జరిగిన డబుల్స్ పోరులో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి రోహన్ బొపన్న దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ చాన్ హాంగ్, హాంగ్ చుంగ్ జోడీని వరుస సెట్ల తేడాతో మట్టికరిపించి 3-0 తేడాతో భారత్‌ను ప్లే-ఆఫ్ దశకు చేర్చారు.

07/17/2016 - 05:41

చండీగఢ్, జూలై 16: లియాండర్ పేస్, తనకు మధ్య కోర్టులో చాలా గొప్పగా సమన్వయం ఉండిందని, అందుకే కొరియా జోడీపై సునాయాసంగా విజయం సాధించగలిగామని రోహన్ బోపన్న చెప్పాడు. డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం పేస్, బోపన్న జోడీ కొరియాకు చెందిన హోంగ్‌చుంగ్- సెయోన్ చాన్‌హాంగ్ జోడీపై 6-3, 6-4, 6-4 స్కోరుతో వరస సెట్లలో విజయం సాధించడం తెలిసిందే.

07/17/2016 - 05:38

కోల్‌కతా, జూలై 16: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం ఇక్కడ వరస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న బెంగాల్ వారియర్స్ జట్టు బలీయమైన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై 32- 25 పాయింట్ల తేడాతో అనూహ్య విజయం సాధించి తన ఆశలను సజీవంగా నిలుపుకోగలిగింది.

07/17/2016 - 05:37

కాన్పూర్, జూలై 16: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్ ఉత్తరప్రదేశ్ రంజీ జట్టుకు కొత్త కోచ్‌గా నియమితుడయ్యాడు. ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ జట్టుకు కోచ్‌గా సేవలందించిన రిజ్వాన్ శంషాద్ ప్రస్తుతం సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నాడు.

07/17/2016 - 05:36

న్యూఢిల్లీ, జూలై 16: ‘గ్రేట్ ఇండియా రన్’ పేరుతో దేశంలో తొలిసారి నిర్వహిస్తున్న మల్టీ సిటీ మారథాన్ ఆదివారం ప్రారంభం కానుంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన ప్రముఖ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌తో కలసి కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈ పరుగును ప్రారంభించనున్నారు.

Pages