S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/14/2016 - 05:53

చెంగ్డూ (చైనా), జూలై 13: గుంటూరుకు చెందిన భారత యువ గ్రాండ్ మాస్టర్ ద్రోణంవల్లి హారిక ఫైడ్ మహిళల గ్రాండ్ ప్రీ చెస్‌లో తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. చైనాలో జరుగుతున్న చెంగ్డూ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్‌లో బుధవారం పదో రౌండ్ గేమ్‌ను డ్రాగా ముగించి కీలకమైన అర పాయింట్‌ను సాధించిన హారిక స్కోరుబోర్డులో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

07/13/2016 - 17:08

సిడ్ని:క్రికెటర్లు వినియోగించే స్పోర్ట్స్ పరికరాలు, వస్తువుల ఉత్పత్తి వ్యాపారంలో భారత క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్ అడుగుపెట్టాడు. ప్రపంచ ప్రఖ్యాత స్పార్టాన్ ఇంటర్నేషనల్ సంస్థలో పెట్టుబడులు పెట్టి భాగస్వామ్యం పొందాడు. బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌గా నియమితుడయ్యాడు. ఆస్ట్రేలియా కేంద్రంగా వాణిజ్యం నిర్వహించే ఈ సంస్థలో భాగస్వామి అయిన సందర్భంగా సచిన్ మాట్లాడారు.

07/13/2016 - 07:22

న్యూఢిల్లీ, జూలై 12: హాకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ హాకీ జట్టుకు చాలా కాలం పాటు కెప్టెన్‌గా సేవలందించిన సర్దార్ సింగ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తొలగించి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టుకు సీనియర్ గోల్‌కీపర్ పిఆర్.శ్రీజేష్‌ను కెప్టెన్‌గా నియమించింది. ప్రపంచ హాకీలో ప్రస్తుతం అత్యంత సమర్థులైన గోల్‌కీపర్లలో శ్రీజేష్ ఒకడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

07/13/2016 - 07:19

బెంగళూరు, జూలై 12: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్) నాలుగో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు బుల్స్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి పాయంట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టైటాన్స్ జట్టుకు 9 రైడ్ పాయంట్లతో రాహుల్ చౌదరి, 5 టాకిల్ పాయంట్లతో సందీప్ నర్వాల్ గట్టి పునాది వేశారు.

07/13/2016 - 07:19

బెసెటెరి (సెయింట్ కిట్స్), జూలై 12: టీమిండియాతో త్వరలో జరుగనున్న నాలుగు టెస్టుల సిరీస్ కోసం వెస్టిండీస్ సెలెక్టర్లు 12 మంది సభ్యులతో తమ జట్టును ఎంపిక చేశారు. సీనియర్ వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ దినేష్ రామ్‌దిన్‌కు ఈ సిరీస్ నుంచి ఉద్వాసన పలికి అన్‌క్యాప్డ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోస్టన్ చేస్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు.

07/13/2016 - 07:18

చండీగఢ్, జూలై 12: ఆరవ ఎడిషన్ ప్రపంచ కప్ కబడ్డీ (డబ్ల్యుసికె-2016) టోర్నమెంట్ నవంబర్ 3 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రంలోని 14 వేదికల్లో జరుగుతుందని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మంగళవారం ప్రకటించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం రూప్‌నగర్‌లోనూ, ముగింపు ఉత్సవం జలాలాబాద్ (్ఫజిల్కా)లోనూ జరుగుతుందని ఆయన తెలిపారు.

07/13/2016 - 07:17

బెసెటెరి (సెయింట్ కిట్స్), జూలై 12: అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని యువ ఆటగాళ్లతో కూడిన తమ జట్టుకు భారత్‌తో టెస్టు సిరీస్ ఒక సవాలేనని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అభిప్రాయ పడ్డాడు. ‘ఇది చాలా క్లిష్టమైన సిరీస్. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో భారత్ నంబర్ టూ స్థానంలో ఉంది. ఆ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్‌తో పాటుగా, మంచి బౌలింగ్ లైనప్ కూడా ఉంది.

07/13/2016 - 07:15

కింగ్‌స్టన్, జూలై 12: వెస్టిండీస్ పేస్ బౌలర్ జెరోమ్ టేలర్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 13 ఏళ్ల నుంచి కెరీర్ కొనసాగిస్తున్న అతను ఇకమీదట పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే అందుబాటులో ఉంటానని ప్రకటించాడు.

07/13/2016 - 07:15

న్యూఢిల్లీ, జూలై 12: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఒలింపిక్ క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టుకు డిఫెండర్ సుశీలా చానూ సారథ్యం వహించనుంది.

07/13/2016 - 07:14

హైదరాబాద్, జూలై 12: హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా తన జీవితంపై ‘ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ పేరుతో రాసిన పుస్తకాన్ని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ బుధవారం ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. వాస్తవానికి వారం రోజుల క్రితమే మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకంలో సానియా జీవితానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలు, ఆమె సాధించిన విజయాలు ఉన్నాయని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా చెప్పారు.

Pages