S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/12/2016 - 18:25

కింగ్‌స్టన్:వెస్టిండీస్ పేస్ బౌలర్ జెరోమ్ టేలర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతడి రిటైర్మెంట్‌ను వెస్టిండీస్ క్రికెట్‌బోర్డు థ్రువీకరించింది. 2003లో శ్రీలంక సిరీస్‌తో టెస్టుల్లోకి అడుగుపెట్టిన టేలర్ 46 టెస్టుల్లో ఆడి 130 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో ఓ శతకం నమోదు చేశాడు.

07/12/2016 - 15:08

న్యూఢిల్లి:బ్రెజిల్‌లో నిర్వహించే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఇండియా హాకీ జట్టుకు కెప్టెన్‌గా గోల్‌కీపర్ పి.ఆర్.శ్రీజేష్‌ను నియమించారు. నిజానికి సుదీర్ఘకాలంగా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సర్దార్‌సింగ్‌పై వివాదం రేగడంతో ఆయనను ఆ బాధ్యతలనుంచి తప్పించారు. హేమాహేమీలు హాజరైన సమావేశంలో కొత్త కెప్టెన్ పేరును ప్రకటించారు.

07/12/2016 - 02:27

లండన్‌లోని ఓ నైట్ క్లబ్ నుంచి సోమవారం తెల్లవారు జామున బయటకు వస్తున్న వింబుల్డన్ చాంపియన్ ఆండీ ముర్రే.. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను మిలోస్ రవోనిక్‌ను ఓడించి వింబుల్డన్‌లో రెండోసారి టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. యువరాజు విలియమ్స్, ఆయన భార్య కాటే స్వయంగా ముర్రేను అభినందించారు. అనంతరం ముర్రే తన భార్య కిమ్‌తో కలిసి చాంపియన్స్ డిన్నర్‌కు వెళ్లాడు.

07/12/2016 - 01:06

పారిస్: పోర్చుగల్‌తో జరిగిన యూరో సాకర్ 2016 ఫైనల్‌లో ఫ్రాన్స్ ఓడిన తర్వాత తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఐఫెల్ టవర్‌ను మూసేశారు. ఒక రోజు సందర్శకులు ఎవరినీ అనుమతించలేదు. ఫ్రాన్స్ ఓడిన వెంటనే అల్లరి మూకలు స్టేడియంలోనూ, వెలుపలా గలభా సృష్టించాయ.

07/12/2016 - 01:54

పారిస్, జూలై 11: పోర్చుగల్ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కల నెరవేరింది. రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత పోర్చుగల్ మొట్టమొదటి మేజర్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫ్రాన్స్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక యూరో 2016 ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్ అనివార్యమయ్యే పరిస్థితులు నెలకొనగా, చివరి క్షణాల్లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఎడర్ చేసిన కీలక గోల్ పోర్చుగల్‌ను చాంపియన్‌గా నిలబెట్టింది.

07/12/2016 - 01:02

పారిస్: ఫ్రాన్స్ హీరో ఆంటోనీ గ్రీజ్మన్ ఈ టోర్నీలో మొత్తం ఆరు గోల్స్ సాధించి ‘గోల్డెన్ బూట్’ను స్వీకరించాడు. ఎక్కువ సమయం స్పెయిన్‌లోనే గడుపుతున్న అతను ఫ్రెంచ్ లీగ్‌లో ఇప్పటి వరకూ పాల్గొనలేదు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాల్సి వచ్చినప్పుడు మాత్రం స్పెయిన్ నుంచి వస్తాడు. యూరో 2016లో జర్మనీ అభిమానులు అతని సామర్థ్యంపైనే నమ్మకం ఉంచారు. వారి అంచనాలకు తగ్గట్టే గ్రీజ్మన్ ఆరు గోల్స్ చేశాడు.

07/12/2016 - 01:00

పారిస్: ఈసారి యూరో సాకర్ చాంపియన్‌షిప్ అభిమానులను నిరాశ పరిచాయి. అదీ ఇదీ అన్న తేడా లేకుండా అన్ని జట్లూ మితిమీరిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. ఈ కారణంగానే కొన్ని మ్యాచ్‌లు డ్రాకాగా, మరికొన్ని మ్యాచ్‌ల్లో ఫలితం తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఫైనల్ కూడా దాదాపుగా పెనాల్టీ షూటౌట్ దశ వరకూ చేరింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఎడర్ గోల్ చేయడంతో ఆ ప్రమాదం తప్పింది.

07/12/2016 - 00:57

పారిస్: యూరో 2016 సాకర్ ఫైనల్‌లో పోర్చుగల్‌ను గెలిపించాలన్న ఉద్దేశంతో బరిలోకి దిగిన క్రిస్టియానో రొనాల్డో రెండుసార్లు బిగ్గరగా రోదించారు. గాయపడినప్పుడు బాధతో ఒకసారికాగా, టైటిల్ సాధించిన తర్వాత కప్‌ను తీసుకున్నప్పుడు మరోసారి. కాలి నొప్పితోనే మ్యాచ్ ఆడిన రొనాల్డో కొద్ది సేపట్లోనే నొప్పి పెరగడంతో మైదానాన్ని విడిచి వెళ్లాడు. ప్రాథమిక చికిత్స పొందిన తర్వాత మళ్లీ ఆడేందుకు వచ్చాడు.

07/12/2016 - 00:55

లండన్, జూలై 11: స్పిన్నర్ అమిత్ మిశ్రా నాలుగు వికెట్లు కూల్చడం, అంతకు ముందు ఓపెనర్లు అర్ధ శతకాలను సాధించడం మినహా ఎలాంటి మినహా భారత్‌కు ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వని తొలి వామప్ మ్యాచ్‌ని డ్రాగా ముగిసింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఎక్కువ సమయాన్ని బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ఉపయోగించుకుంది.

07/12/2016 - 00:53

న్యూఢిల్లీ, జూలై 11: మరో ముగ్గురు భారత అథ్లెట్లు రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. ఇక్కడికి అందిన సమాచారం మేరకు అజర్‌బైజాన్‌లో జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్ పురుషుల ట్రిపుల్ జంప్‌లో రెంజిత్ మహేశ్వరి, 200 మీటర్ల పరుగులో ధరమ్‌వీర్ సింగ్, 800 మీటర్ల పరుగులో జిన్సన్ జాన్సన్ రియో కనీస ప్రమాణాలను సాధించారు.

Pages