S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/12/2016 - 00:49

మాస్కో, జూలై 11: రష్యా లాంగ్ జంపర్ దర్యా క్లిషినాకు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లభించడం దాదాపుగా ఖాయమైంది. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్న కారణంగా రష్యా అథ్లెట్ల బృందాన్ని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ఒలింపిక్స్ నుంచి నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, క్లిషినా వ్యక్తిగతంగా చేసుకున్న అభ్యర్థను పరిశీలించిన ఐఎఎఎఫ్ సానుకూలంగా స్పందించింది.

07/12/2016 - 00:47

ముంబయి, జూలై 11: మోకాలి నొప్పి కారణంగా నిరుడు ఐపిల్‌లో ఆడలేకపోయిన భారత పేసర్ మహమ్మద్ షమీకి నష్టపరిహారం కింద 2.2 కోట్ల రూపాయలు చెల్లించినట్టు బిసిసిఐ వెల్లడించింది. 25 లక్షలు లేదా అంతకు మించి జరిపిన చెల్లింపుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతామని ఇది వరకే ప్రకటించిన బిసిసిఐ జూన్ మాసపు లెక్కలను వెల్లడించింది.

07/12/2016 - 00:45

లాసనే్న, జూలై 11: మాల్డోనియం ఉత్ప్రేరకాన్ని వినియోగించినట్టు అంగీకరించి, రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైన రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగానే ఉంది. తనపై విధించిన సస్పెన్షన్ కేసును రద్దు చేయాలంటూ అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)ను షరపోవా ఆశ్రయించిన విషయం తెలిసిందే.

07/11/2016 - 00:39

బ్రిటిష్ టెన్నిస్ సూపర్ స్టార్స్‌లో ఒకడిగా వెలిగిపోతున్న ముర్రే 2013లో తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించాడు. అంతకు ముందు 2012లో యుఎస్ ఓపెన్ టైటిల్‌ను అందుకున్నాడు. 1936లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత బ్రిటన్‌కు ఒక గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు.

07/11/2016 - 00:17

లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సెరెనా డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచింది. తన సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సెరెనా ఫైనల్‌లో టిమియా బబోస్ (హంగరీ), యారొస్లావ ష్వెడోవా (కజకస్థాన్) జోడీని 6-3, 6-4 తేడాతో చిత్తుచేసింది. సెరెనా, వీనస్ జోడీకి వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలో ఇది ఆరో టైటిల్.

07/11/2016 - 00:16

సిల్వర్‌స్టోన్, జూలై 10: బ్రిటిష్ ఫార్ములా వన్ రేస్‌ను లూయిస్ హామిల్టన్ గెల్చుకున్నాడు. అతను ఈరేస్‌ను గెల్చుకోవడం ఇది నాలుగోసారి. గతంలో నాలుగు పర్యాయాలు టైటిల్ సాధించిన బ్రిటిషర్‌గా నిజెల్ మానె్సల్ నెలకొల్పిన రికార్డును హామిల్టన్ సమం చేశాడు. మొత్తం మీద సిల్వర్‌స్టోన్‌లో జిమ్ క్లార్క్ ఐదు సార్లు గెలిచాడు. ఆ రికార్డుకు హామిల్టన్ మరో విజయం దూరంలో ఉన్నాడు.

07/11/2016 - 00:15

న్యూఢిల్లీ, జూలై 10: క్రికెట్ రంగాన్ని సినిమాతో పోలిస్తే, అందులో కలికితురాయిగా నిలిచిపోయే షోలే ఎవరు? మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ను తప్ప ఎవరినీ ఈ స్థాయిలో ఊహించలేమని మరో మాజీ ఆటగాడు వీరేంద్ర సెవాగ్ వ్యాఖ్యానించాడు. గవాస్కర్ 66వ జన్మదినోత్సవం సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలిపిన అతను గవాస్కర్‌లో క్రికెట్ సినిమాలో షోలే లాంటి వాడని ప్రశంసించాడు.

07/11/2016 - 00:14

న్యూఢిల్లీ, జూలై 10: రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడంలో భారత డిస్కస్ త్రోయర్ కృష్ణ పునియా విఫలమైంది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన క్వాలిఫయర్స్‌లో పోడీపడిన ఆమె డిస్కస్‌ను 59.49 మీటర్ల దూరానికి విసరగలిగింది. ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు కనీస ప్రమాణం 61 మీటర్లు.

07/11/2016 - 00:11

యుగెన్ (అమెరికా), జూలై 10: అమెరికా రన్నర్ జస్టిన్ గాట్లిన్ పురుషుల 200 మీటర్ల విభాగంలో రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. యుఎస్ ఒలింపిక్ ట్రయల్స్‌లో భాగంగా జరిగిన ఈ పోటీలో అతను లక్ష్యాన్ని 19.75 సెకెన్లలో పూర్తి చేసి, రియోలో గట్టిపోటీదారుడిని అవుతానని నిరూపించుకున్నాడు. అతనితో చివరి వరకూ తీవ్ర స్థాయిలో పోటీపడిన లాష్వాన్ మెరి 19.79 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు.

07/11/2016 - 00:11

పాట్నా, జూలై 10: ప్రో కబడ్డీ టో ర్నమెంట్‌లో భాగంగా ఆదివారం ఢి ల్లీ దబాంగ్‌తో జరిగిన మ్యాచ్‌ని తె లుగు టైటాన్స్ ఐదు పాయంట్ల తే డాతో గెల్చుకుంది. టైటాన్స్ 28 పా యంట్లు సాధించగా, ఢిల్లీ 23 పా యంట్లకు పరిమితమైంది. శనివారం పాట్నా పైరేట్స్‌ను 18 పాయంట్ల తే డాతో చిత్తుచేసిన ఢిల్లీ ఆదివారం టై టాన్స్‌ను ఓడించలేకపోయంది.

Pages