S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/11/2016 - 00:10

లండన్: ముర్రే తల్లిపేరు జూడిత్. తండ్రి విలియమ్ ముర్రే. స్కాట్‌లాండ్‌లో జన్మించిన అతను డుబ్లేన్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అదే సమయంలో తన అన్న జమీ ముర్రేతో కలిసి టెన్నిస్ ఆడడం మొదలు పెట్టాడు. జూడిత్ స్వయంగా టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె తండ్రి రాయ్ ఎర్స్‌కిన్ 1950 దశంలో ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా పేరుతెచ్చుకున్నాడు. దీనితో ముర్రేకు ఫుట్‌బాల్, టెన్నిస్‌లో ఏదో ఒక ఆటను ఎంచుకోవాల్సి వచ్చింది.

07/11/2016 - 00:10

సావో పౌలో, జూలై 10: ‘సాకర్ లెజెండ్’ పీలే మళ్లీ పెళ్లికొడుకు కానున్నాడు. 75 ఏళ్ల పీలే ఆరేళ్లుగా తనకు సన్నిహితంగా ఉంటున్న మార్సియా సిబెల్ ఆకోని వివాహం చేసుకోనున్నట్టు స్థానిక పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. 1980 దశకం ఆరంభంలో న్యూయార్క్‌లో అకోను పీలే చూశాడు. అయితే, వీరిద్దరూ 2010 వరకు మళ్లీ కలుసుకోలేదు.

07/10/2016 - 04:25

ప్రతిష్ఠాత్మక వింబుల్టన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఏంజెలిక్ కెర్బర్‌ను ఓడించిన ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరింది. టెన్నిస్ ఓపెన్ ఎరాలో అత్యధికంగా 22 టైటిళ్లు సాధించిన స్ట్ఫె గ్రాఫ్ సరసన స్థానం సంపాదించింది. వింబుల్డన్‌లో సెరెనా విజేతగా నిలవడం ఇది ఏడోసారి.

07/10/2016 - 04:24

సెరెనా: మొదటి రౌండ్‌లో అమ్రా సాడికొవిచ్‌పై (6-2, 6-4), రెండో రౌండ్‌లో క్రిస్టినా మెక్‌హాలెపై 7-6, 6-2, 6-4, మూడో రౌండ్‌లో అనికా బెక్‌పై 6-3, 6-0, నాలుగో రౌండ్‌లో స్వెత్లానా కుజ్సెత్సొవాపై 7-5, 6-0 తేడాతో విజయాలను నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో అనస్తాసియా పవ్లిచెన్కొవాను 6-4, 6-4 ఆధిక్యంతో ఓడించింది. సెమీఫైనల్‌లో ఎలెవెనా వెస్నినాపై 6-2, 6-0 తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది.

07/10/2016 - 04:22

లండన్, జూలై 9: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్‌లో ఏంజెలిక్ కెర్బర్‌ను ఓడించి, కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను గెల్చుకొని, అత్యధిక విజయాల జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్న స్ట్ఫె గ్రాఫ్ సరసన చేరాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన సెరెనా తన లక్ష్య సాధనకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయింది.

07/10/2016 - 04:12

కింగ్‌స్టన్, జూలై 9: ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌లో 100, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలే టైటిల్‌ను కూడా సాధించాలన్న ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమైకా నిబంధనల ప్రకారం ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొని అతను అర్హత సంపాదించాలి. కానీ, 100 మీటర్ల స్ప్రింట్‌లో పరిగెడుతున్నప్పుడు కాలి కండరాలు బెణకడంతో అతను క్వాలిఫయర్స్ నుంచి వైదొలిగాడు.

07/10/2016 - 04:10

లండన్, జూలై 9: పురుషుల సింగిల్స్‌లో విజేత ఎవరన్నది ఆసక్తిని రేపుతోంది. బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే, కెనడాకు చెందిన మిలోస్ రవోనిక్ ఫైనల్ చేరడంతో, ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కెనడా తరఫున ఒక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీలో మొట్టమొదటిసారి ఫైనల్ చేరిన రవోనిక్ సెమీఫైనల్‌లో సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌ను 6-3, 6-7, 4-6, 7-5, 6-3 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు.

07/10/2016 - 04:07

పాట్నా, జూలై 9: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం ఏకపక్షంగా జరి గిన మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు పటిష్టమైన పాట్నా పైరేట్స్‌ను 18 పాయంట్ల తే డాతో చిత్తుచేసింది. ఢిల్లీ 33 పాయంట్లు సంపాదించగా, పాట్నా అనూహ్యంగా 15 పాయంట్లకే పరిమితమైంది. ఢిల్లీకి నాయకత్వం వహించిన మిరాజ్ షేక్ ఆరు పా యంట్లు చేయగా, సచిన్ షింగాడే నాలుగు పాయంట్లు సాధించాడు.

07/10/2016 - 04:05

న్యూఢిల్లీ, జూలై 9: క్రికెట్ అంటేనే కాదు.. బైకులన్నా, సైనిక దుస్తులన్నా ధోనీకి చాలా ఇష్టం. అయితే, ధోనీ ఫ్లూటు వాయిస్తాడని చాలా మందికి తెలియదు. ఈ విషయం అతని సన్నిహితుడు, టీమిండియా సభ్యుడు సురేష్ రైనా ద్వారా ప్రపంచానికి తెలిసింది. ధోనీ ఫ్లూటు వాయిస్తున్న ఫొటోను రైనా ట్వీట్ చేశాడు. ఇటీవలే 35వ జన్మదినోత్సవాన్ని జరుపుకొన్న ధోనీని ఫ్లూటిస్టుగా పరిచయం చేశాడు.

07/10/2016 - 04:03

న్యూఢిల్లీ, జూలై 9: భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రితూ రాణిపై వేటు పడింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టులో సెలక్టర్లు ఆమెకు స్థానం కల్పించలేదు. భారత మహిళలు 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత రితూ నాయకత్వంలోనే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. జట్టుకు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాన్నిచ్చిన రితూను జట్టు నుంచి తొలగిస్తారని ఎవరూ ఊహించలేదు.

Pages