S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/19/2016 - 07:34

లండన్, జూన్ 18: వివాదాస్పదంగా మారిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్‌లో ఓడిన భారత్ రజత పతకంతో సంతృప్తి చెందింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ టైటిల్ పోరులో భారత ఆటగాళ్లు అసాధారణ స్థాయిలో రాణించారు. గోల్స్ చేసే అవకాశాలను చేజార్చుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా దూకుడుకు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగారు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.

06/19/2016 - 07:28

హరారే, జూన్ 18: భారత్ చేతిలో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను కోల్పోయిన జింబాబ్వే ఎదురుదాడి చేసి, టి-20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. రెండు పరుగుల తేడాతో విజయం సాధించి ధోనీ సేనకు షాకిచ్చింది. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 168 పరుగులు చేయగలిగింది.

06/19/2016 - 07:25

లండన్, జూన్ 18: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్ సందర్భంగా వివాదం తలెత్తింది. డానియెల్ బీయెల్ కొట్టిన బంతిని భారత గోల్‌కీపర్ శ్రీజేష్ సమర్థంగా అడ్డుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా ఆటగాళ్లు రీ ప్లేకు డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

06/19/2016 - 07:24

సీటిల్ (అమెరికా), జూన్ 18: కోపా అమెరికా సాకర్ టోర్నీలో అమెరికా జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈక్వెడార్‌తో జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో ఆ జట్టు 2-1 తేడాతో విజయభేరి మోగించింది. మ్యాచ్ 22వ నిమిషంలో అమెరికాకు క్లింట్ డెంప్సీ ద్వారా తొలి గోల్ లభించింది. ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు.

06/19/2016 - 07:22

నైస్ (ఫ్రాన్స్), జూన్ 18: యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్పెయిన్ ప్రీ క్వార్టర్స్‌లో స్థానం సంపాదించింది. టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 3-0 తేడాతో విజయం సాధించి, ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్ 34వ నిమిషంలో అల్వరో మోరాటా స్పెయిన్‌కు తొలిగోల్‌ను అందించాడు. మరో మూడు నిమిషాల్లోనే థామస్ ఏవలిటో చేసిన గోల్‌తో స్పెయిన్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

06/19/2016 - 07:21

సావో పౌలో, జూన్ 18: మాజీ క్రీడాకారుడు టిటెను బ్రెజిల్ సాకర్ కోచ్ పదవి వరించిందని సమాచారం. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్ నుంచి బ్రెజిల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో, కోచ్ దుంగాపై సాకర్ అధికారులు వేటు వేసిన విషయం తెలిసిందే. అతని స్తానంలో టిటెను నిమయించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతను ప్రస్తుతం సేవలు అందిస్తున్న కొరంథియాస్ జట్టు మేనేజ్‌మెంట్ ధ్రువీకరించింది.

06/19/2016 - 07:20

వియన్నా, జూన్ 18: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనరాదని రష్యాపై వేసిన సస్పెన్షన్ వేటులో ఎలాంటి పొరపాటు లేదని, అది సరైన నిర్ణయమేనని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘం (ఐఎఎఎఫ్) తేల్చిచెప్పింది. వియన్నాలో సమావేశమైన ఐఎఎఎఫ్ పాలక మండలి రష్యాను ఒలింపిక్స్‌కు అనుమతించాలా లేదా అన్న విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది.

06/18/2016 - 06:13

బాకు (అజర్‌బైజాన్), జూన్ 17: అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) ఆధ్వర్యాన అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ మనోజ్ కుమార్ శుభారంభాన్ని సాధించాడు.

06/18/2016 - 06:04

సియాటిల్, జూన్ 17: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అమెరికా జట్టు సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి సియాటిల్‌లోని సెంచరీ లింక్ ఫీల్డ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జుర్గెన్ క్లిన్స్‌మన్ నేతృత్వంలోని అమెరికా జట్టు 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్‌ను మట్టికరిపించి టైటిల్ సాధన దిశగా మరో అడుగు ముందుకు వేసింది.

06/18/2016 - 06:03

లండన్, జూన్ 17: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టును అదృష్టం వరించింది. గురువారం అర్థరాత్రి (్భరత కాలమానం ప్రకారం) ఆతిథ్య బ్రిటన్-బెల్జియం జట్ల మధ్య జరిగిన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్ 3-3 గోల్స్‌తో డ్రాగా ముగియడంతో భారత జట్టు 36 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. 1978లో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఆవిర్భవించినప్పటి నుంచి భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.

Pages