• లండన్ : ఒక యాషెస్ సిరీస్‌లో నమోదైన ‘టాప్-5’ అత్యధిక స్కోరర్ల జాబితాలో స్టీవ్

  • మండాలే (మైన్మార్), సెప్టెంబర్ 15: భారత బిలియర్డ్స్, స్నూకర్స్ సూపర్ స్టార్ పం

  • ధర్మశాలలో ఆదివారం దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ-20 వర్షం

  • ఢాకా, సెప్టెంబర్ 15: ముక్కోణపు వనే్డ సిరీస్‌లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/22/2016 - 04:31

రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టైటిల్‌ను జేపీ పంజాబ్ వారియర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో కళింగ లాన్సర్స్‌ను ఢీకొన్న ఈ జట్టు 6-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. లీగ్ దశ ముగిసే సమయానికి 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించిన హాట్ ఫేవరిట్ రాంచీ రేస్‌ను ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఓడించిన ఢిల్లీ వేవ్‌రైడర్స్ మూడో స్థానాన్ని ఆక్రమించింది.

02/22/2016 - 04:29

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సాకేత్ మైనేని రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్నాడు. ఫైనల్‌లో ఫ్రాన్స్‌కుచెందిన స్ట్ఫిన్ రాబర్ట్‌ను ఢీకొన్న అతను 3-6, 0-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. మొదటి సెట్‌లో సాకేత్ నుంచి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైనప్పటికీ దానిని సమర్థంగా అధిగమించిన రాబర్ట్ రెండో సెట్‌లో చెలరేగిపోయాడు.

02/22/2016 - 04:27

కోల్‌కతా: ఒకే ప్రశ్నను ఎన్నిసార్లు మార్చిమార్చి అడిగినా తన సమాధానంలో మార్పు ఉండదని రిటైర్మెంట్‌పై భారత పరిమిత ఓవర్ల జట్ల కె ప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ధోనీపై విలేఖరులు రిటైర్మెంట్ గురించి పదేపదే ప్రశ్నించడంతో అతను స్పందిస్తూ, ఎన్నిసార్లు అడిగినా తన సమాధానం ఒకటేనని వ్యాఖ్యానించాడు.

02/22/2016 - 04:26

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్, జో బర్న్స్ శతకాలతో రాణించడంతో, మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లకు 363 పరుగులు చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 370 పరుగులు చేయగా, ఏడు పరుగులు వెనుకంజలో ఉన్న ఆసీస్ చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి.

02/22/2016 - 04:25

హైదరాబాద్: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో చైనా టైటిల్ సాధించింది. ఫైనల్ పోరులో ఈ జట్టు 3-2 తేడాతో జపాన్‌ను ఓడించింది. ఆరంభంలో ఆధిపత్యాన్ని కనబరచిన జపాన్ ఆతర్వాత చైనా ధాటిని ఎదురునిలవలేకపోయింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో షిజియాన్ వాంగ్‌ను ఒకుహరా నొజొమీ 17-21, 21-16, 21-15 తేడాతో ఓడించింది.

02/22/2016 - 04:24

కోల్‌కతా: రోహిత్ శర్మతో కలిసి తన ప్రయాణం సుదీర్ఘకాలం సాగుతుందని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు.

02/22/2016 - 04:23

మాడ్రిడ్: స్పానిష్ సుకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో బార్సిలోనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. లాస్ పల్మాస్‌తో జరిగిన మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకొని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ జట్టు ఖాతాలో మొత్తం 63 పాయింట్లు ఉండగా, రెండో స్థానంలో నిలిచిన అట్లెటికో మాడ్రిడ్ ఏకంగా తొమ్మిది పాయింట్లు వెనుకంజలో ఉంది. రియల్ మాడ్రిడ్ 53 పాయింట్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది.

02/21/2016 - 08:19

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ కెరీర్‌లో తన చివరి టెస్టును చిరస్మరణీయమైనదిగా మార్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి, రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను కేవలం 54 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా శతకాన్ని చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు.

02/21/2016 - 08:20

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ చరిత్రలో తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ నెలకొల్పిన రికార్డును భారతీయుడే బద్దలు కొడతాడని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా జోస్యం చెప్పాడు. గుజరాత్ లయన్స్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ మెక్‌కలమ్ అద్వితీయ ప్రతిభావంతుడని, అతను రికార్డు నెలకొల్పడంలో వింత ఏమీ లేదని అన్నాడు.

02/21/2016 - 08:15

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో మహేష్ భూపతి టైటిల్ సాధించాడు. యుకీ భంబ్రీతో కలిసి బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో 6-3, 4-6, 10-5 తేడాతో సకేత్ మైనేని, సనమ్ సింగ్ జోడీని ఓడించాడు. మూడేళ్ల కాలంలో భూపతికి ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. కాగా, అందుకు ముందు పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో నెగ్గిన సాకేత్ ఫైనల్‌లో స్థానం సంపాదించాడు.

Pages