S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/16/2016 - 07:55

ముంబయి, జూన్ 15: టీమిండియా కోచ్ పదవికి 57 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, క్రికెట్ సలహా మండలి ఆ జాబితాను 21కి కుదించింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ కార్యదర్శి, జాతీయ సెలక్టర్ సంజయ్ దగ్దాలే సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ మండలిలో మాజీ క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ సభ్యులుగా ఉన్నారు. బోర్డుకు అందిన దరఖాస్తులను వీరు క్షుణ్ణంగా పరిశీలించారు.

06/16/2016 - 07:55

లండన్, జూన్ 15: చాంపియన్స్ ట్రోఫీ హాకీలో మొదటిసారి ఫైనల్ చేరాలన్న ఆశతో, గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో పోరాటానికి సిద్ధమవుతున్నది. రెండు నెలల క్రితం ఇపోలో జరిగిన అజ్లాన్ షా హాకీ టోర్నీలో ఆసీస్ చేతిలో భారత్ రెండు మ్యాచ్‌ల్లో పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, ఇప్పుడు ప్రపంచ చాంపియన్ జట్టుకు షాకివ్వాలన్న పట్టుదలతో ఉంది.

06/16/2016 - 07:54

ఫిలడేల్ఫియా, జూన్ 15: అలెక్సిస్ సాంచెజ్ కీలక సమయంలో రెండో గోల్స్‌తో రాణించడంతో కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో చిలీ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. సాంచెజ్‌తోపాటు ఎడ్యుయార్డో వర్గాస్ కూడా ‘డబుల్’తో రాణించాడు. వీరిరువురి ప్రతిభ పనామతో జరిగిన మ్యాచ్‌లో చిలీకి 4-2 తేడాతో విజయాన్ని అందించింది. మ్యాచ్ ఐదో నిమిషంలోనే పనామాకు మిగుల్ కామర్గో తొలి గోల్‌ను అందించాడు.

06/16/2016 - 07:53

హరారే: జింబాబ్వేతో బుధవారం జరిగిన మూడో వనే్డలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక అరుదైన మైలురాయిని చేరాడు. వనే్డల్లో అత్యధిక డిస్మిసల్స్ సాధించిన వికెట్‌కీపర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని సంపాదించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 482 డిస్మిసల్స్‌తో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, ఆడం గిల్‌క్రిస్ట్ 472, మార్క్ బౌచర్ 424 వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

06/15/2016 - 17:40

హరారే: వన్డేల్లో అత్యధిక మందిని ఔట్‌ చేసిన నాలుగో వికెట్‌ కీపర్‌గా భారత వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. హరారేలో జింబాబ్వేతో బుధవారం జరిగిన వన్డేలో బుమ్రా బౌలింగ్‌లో చిగుంబర క్యాచ్‌ పట్టడం ద్వారా ధోని ఈ రికార్డు అందుకున్నాడు. ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లాడిన ధోని 274 ఇన్నింగ్స్‌ల్లో 350 మందిని ఔట్‌ చేశాడు.

06/15/2016 - 07:37

హరారే, జూన్ 14: మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు బుధవారం నాటి చివరి, మూడో వనే్డలోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో జింబాబ్వే టూర్‌లో ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది.

06/15/2016 - 07:33

ముంబయి, జూన్ 14: అంతటా ఉత్కంఠ రేపుతున్న భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక ఈనెల 24న జరిగే అవకాశం ఉంది. భారత క్రికెట్ మండలి (బిసిసిఐ) పాలక మండలి కీలక సమావేశం ధర్మశాలలో ఆరోజున జరగనుంది. డంకన్ ఫ్లెచర్‌తో కాంట్రాక్టు ముగిసిన తర్వాత, జట్టు డైరెక్టర్ రవి శాస్ర్తీకే కోచ్‌గా అదనపు బాధ్యతలను అప్పగించిన బిసిసిఐ చాలాకాలం నెట్టుకొచ్చింది.

06/15/2016 - 07:31

న్యూఢిల్లీ, జూన్ 14: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను సంపాదించే అవకాశాలను భారత మహిళల రిలే జట్టు సజీవంగా నిలబెట్టుకుంది. ఇటీవల స్లొవేకియాలోని సామోరిన్‌లో జరిగిన పిటిఎస్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో జౌనా ముర్ము, అశ్వినీ అక్కున్జీ, అనిల్డా థామస్, ఎంఆర్ పూవమ్మ సభ్యులుగా ఉన్న భారత జట్టు 3:31.39 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

06/15/2016 - 07:31

లియాన్, జూన్ 14: యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇటలీ శుభారంభం చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బెల్జియంతో జరిగిన తొలి మ్యాచ్‌ని 2-0 తేడాతో గెల్చుకుంది. వ్యూహాత్మకంగా ఆడిన ఇటలీ ఎక్కువ సమయాన్ని డిఫెన్స్‌కు కేటాయించి, అవకాశం దొరికినప్పుడు దాడులకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే 32వ నిమిషంలో ఇమాన్యుయెల్ గియాచెరినీ ఇటలీకి తొలి గోల్‌ను అందించాడు.

06/15/2016 - 07:29

లండన్, జూన్ 14: శ్రీలంకతో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు ఇంగ్లాండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. లంకతో ఐదు వనే్డలతోపాటు, ఒక టి-20 మ్యాచ్ ఆడనున్న ఇంగ్లాండ్ జట్టులో జానీ బెయిర్‌స్టోకు కూడా అవకాశం దక్కింది. లంకతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును స్వీకరించాడు. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం ఏర్పడిన చివరి, మూడో టెస్టు డ్రాగా ముగిసింది.

Pages