S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/04/2016 - 06:52

లండన్, జూలై 3: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, వింబుల్డన్ మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ అరుదైన మైలు రాయిని చేరింది. కెరీర్‌లో ఆమె 300వ విజయాన్ని నమోదు చేసి, మార్టినా నవ్రతిలోవా తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లో చేరింది.

07/04/2016 - 06:39

లండన్, జూలై 3: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరకుండానే నిష్క్రమించినందుకు తానేమీ కుంగిపోవడం లేదని ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ స్పష్టం చేశాడు. రెట్టించిన ఉత్సాహంతో దూసుకొస్తానని, భవిష్యత్తులో మళ్లీ విజయాల బాట పడతానని విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. మూడో రౌండ్‌లో అతను 6-7, 1-6, 6-3, 6-7 తేడాతో శామ్ క్వెర్రీ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.

07/04/2016 - 06:37

బోర్డాక్స్, జూలై 3: యూరో 2016లో పెనాల్టీ షూటౌట్ల పర్వం కొనసాగుతున్నది. క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీ, ఇటలీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ షూటౌట్ అనివార్యమైంది. జొనాస్ హెక్టర్ చేసిన కీలక గోల్‌తో జర్మనీ 6-5 తేడాతో గెలుపొందగా, ఇటలీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి టోర్నీలో జరిగిన చాలా మ్యాచ్‌ల మాదిరిగానే జర్మనీ, ఇటలీ మధ్య క్వార్టర్ ఫైనల్ పోరు ఏ మాత్రం ఆసక్తిని రేపలేకపోయింది.

07/04/2016 - 06:36

బెంగళూరు, జూలై 3: భారత క్రికెట్ జట్టు పాల్గొనే వివిధ సిరీస్‌లలో అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించిన రోడ్‌మ్యాచ్‌పై ఆదివారం సుదీర్ఘ చర్చ జరిగింది.

07/04/2016 - 06:33

హైదరాబాద్, జూలై 3: ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమిపాలైంది. ఒక్క మ్యాచ్‌ని కూడా గెల్చుకోలేక అభిమానులను నిరాశ పరచిన టైటాన్స్ సొంత గడ్డపై ఆదివారం పాట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందరి అంచనాల మేరకే ఆటగాళ్లు చివరి వరకూ పోరాడారు. కానీ, అంతకు ముందు మ్యాచ్‌ల మాదిరిగానే చివర్లో తీవ్రమైన ఒత్తిడికి గురై, మ్యాచ్‌ని 33-35 తేడాతో చేజార్చుకున్నారు.

07/04/2016 - 06:31

బ్యూనస్ ఎయిర్స్, జూలై 3: అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వేలాది మంది అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించి, ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా నినాదాలు చేశారు. అర్జెంటీనా తరఫున మెస్సీ మ్యాచ్‌లు ఆడాలని, మరికొంత కాలం అతను కెరీర్‌ను కొనసాగించాలని కోరారు. మెస్సీకి అనుకూలంగా ప్లకార్డులను ప్రదర్శించారు.

07/04/2016 - 06:30

న్యూఢిల్లీ, జూలై 3: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్ల బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కలుస్తారు. న్యూఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో రియో ఒలింపిక్ బృందంతో మోదీ భేటీ అవుతారని ప్రధాని కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకూ సుమారు వంద మంది క్రీడాకారులు వివిధ ఈవెంట్స్‌లో పోటీపడేందుకు అర్హత సంపాదించారు.

07/03/2016 - 16:32

ముంబై:్భరత్‌లో క్రికెట్‌కోసం పనిచేస్తున్న సంస్థలన్నీ సాఫీగా, క్రమబద్ధంగా పనిచేసేలా చూడాలని భారత క్రికెట్ జట్టు నూతన కోచ్ అనిల్‌కుంబ్లే భావిస్తున్నారు. ఆ దిశగా తొలి అడుగు వేశారు.

07/03/2016 - 04:56

కింగ్‌స్టన్, జూలై 2: జమైకా స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్‌ను ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా కాలి కండరాలు బెణకడంతో అతను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బోల్ట్ జమైకా నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు జరుగుతున్న ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. ఈ రెండు విభాగాల్లోనూ ఫైనల్ చేరాడు.

07/03/2016 - 04:54

బెంగళూరు, జూలై 2: భారత క్రికెటర్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే భారత జట్టు ఇక్కడ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాడు. తాను స్వయంగా నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ, యువ బౌలర్లకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నాడు.

Pages