S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/29/2016 - 01:16

లండన్, జూన్ 28: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అమెరికా ‘నల్ల కలువ’ సెరెనా విలియమ్స్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న సెరెనా (34) మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన క్వాలిఫయర్ అమ్రా సాదికోవిచ్‌ను వరుస సెట్ల తేడాతో మట్టికరిపించి శుభారంభం సాధించింది.

06/29/2016 - 01:16

న్యూఢిల్లీ, జూన్ 28: దేశంలో పరుగును క్రీడగా అభివృద్ధి చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా వచ్చే నెల 17వ తేదీ నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నిర్వహించనున్న ‘గ్రేట్ ఇండియా రన్’లో బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ (50) పాల్గొననున్నాడు.

06/29/2016 - 01:15

కోల్‌కతా, జూన్ 28: భారత క్రికెట్ జట్టులో తన బాధ్యత ముగిసిందని, ఇప్పుడు తప్పుకోవలసిన సమయం వచ్చిందని టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తీ స్పష్టం చేశాడు. భారత జట్టు కొత్త కోచ్ పదవికోసం రవిశాస్ర్తీ ఇటీవల ప్రయత్నించినప్పటికీ అనిల్ కుంబ్లేకు ఆ పదవి దక్కడం తెలిసిందే. ‘నాకు సంబంధించినంతవరకు ఆ చాప్టర్ ముగిసింది. తప్పుకోవలసిన సమయం వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నా.

06/28/2016 - 01:51

లాహోర్, జూన్ 27: తుంటి మీద కొడితే నోటి పళ్లు రాలాయని సామెత పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ విషయంలో నిజమైంది. అర్జెంటీనా సాకర్ హీరో లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడానికి, అఫ్రిదీ కెరీర్‌కు ఎలాంటి సంబంధం లేదు. మెస్సీ క్రికెటర్ కాడు. పాకిస్తానీ అంతకంటే కాడు. కానీ, మెస్సీ రిటైరయ్యాడన్న వార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో ‘అఫ్రిదీ..

06/28/2016 - 01:49

ఈస్ట్ రూథర్‌ఫర్డ్ (అమెరికా), జూన్ 27: అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కోపా అమెరికా ఫైనల్‌లో చిలీని ఢీకొన్న అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో విఫలమై, 2-4 తేడాతో ఓటమిపాలైంది. తన ప్రయత్నంలో విఫలమైన మెస్సీ నిరాశకు గురయ్యాడు. ఇదే తనకు చివరి మ్యాచ్ అని ప్రకటించాడు.

06/28/2016 - 01:47

ఈస్ట్ రూథర్‌ఫర్డ్ (అమెరికా), జూన్ 27: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్ చిలీ నిలబెట్టుకుంది. నిర్ణీత సమయంలో, ఆతర్వాత ఎక్‌స్ట్రా టైమ్‌లో గోల్స్ నమోదు కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. స్టార్ ఆటగాడు, కెప్టెన్ లియోనెల్ మెస్సీ అనూహ్యంగా విఫలం కావడం అర్జెంటీనాను దెబ్బతీసింది. చిలీ నాలుగు గోల్స్ చేయగా, అర్జెంటీనా రెండు గోల్స్‌కే పరిమితమై పరాజయాన్ని ఎదుర్కొంది.

06/28/2016 - 01:41

లండన్, జూన్ 27: వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్ శ్లామ్‌లో హ్యాట్రిక్ టైటిళ్లను కైవసం చేసుకునే దిశగా ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ తొలి అడుగు వేశాడు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో అతను జేమ్స్ వార్డ్‌ను 6-0, 7-6, 6-4 తేడాతో ఓడించాడు. 2011లో మొదటిసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన అతను తిరిగి 2014, 2015 సంవత్సరాల్లో విజేతగా నిలిచాడు.

06/28/2016 - 01:39

బార్బడాస్, జూన్ 27: ముక్కోణపు వనే్డ ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఈ జట్టు 58 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. బ్యాటింగ్ స్టార్ మిచెల్ మార్ష్ అనూహ్యంగా బౌలింగ్‌లో రాణించి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ అర్ధ శతకం సాధించడంతో ప్రత్యర్థి ముందు 271 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచగలిగింది.

06/27/2016 - 07:36

లండన్, జూన్ 26: టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న నొవాక్ జొకోవిచ్, సెరెనా విలియమ్స్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగనున్నారు. ఇద్దరూ తమతమ టైటిళ్లను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఎంచుకున్నారు.

06/27/2016 - 07:30

లెన్స్ (ఫ్రాన్స్), జూన్ 26: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రికార్డో కరేస్మా చేసిన గోల్ పోర్చుగల్‌కు క్రొయేషియాపై 1-0 తేడాతో విజయాన్ని సాధించిపెట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచి పోర్చుగీస్ ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో ఎక్కువ సేపు ఉంచుకున్నప్పటికీ క్రొయేషియా రక్షణ వలయాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు.

Pages