S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/27/2016 - 07:29

గ్లెండేల్ (అమెరికా), జూన్ 26: కోపా అమెరికా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో కొలంబియా మూడో స్థానాన్ని ఆక్రమించింది. సెమీ ఫైనల్స్‌లో ఓడిన అమెరికా, కొలంబియా జట్ల మధ్య జరిగిన ఈ పోరు అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అటాకింగ్‌ను మరచిపోయిన ఇరు జట్లు డిఫెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో మ్యాచ్ ఆసక్తిని రేపలేకపోయింది. 31వ నిమిషంలో కార్లొస్ బక్కా కీలక గోల్ చేసి, కొలంబియాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు.

06/27/2016 - 07:29

చెన్నై, జూన్ 26: తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) అధ్యక్షుడిగా బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, ఐసిసి మాజీ చైర్మన్ శ్రీనివాసన్ మరోసారి ఎన్నికయ్యాడు. ఆదివారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో శ్రీనివాసన్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2002 నుంచి అతను అదే పదవికి ఎన్నిక కావడం గమనార్హం.
రియోకు మరో ముగ్గురు అథ్లెట్లు క్వాలిఫై

06/27/2016 - 07:28

ముంబయ, జూన్ 26: ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివా రం చివరి వరకూ తీవ్ర ఉత్కంఠను సృష్టించిన మ్యాచ్‌లో బెంగాల్ వారియ ర్స్‌పై బెంగళూరు బుల్స్ జట్టు 24-23 తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్న చందంగా పోటీ పడడంతో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. చివరికి ఒక పాయంట్ తేడాతో బెంగాల్‌ను బెంగళూరు ఓడించింది. రోహిత్ కుమార్ ఏడు పాయంట్లు చేసి, బెంగళూరు విజయం లో కీలక పాత్ర పోషించాడు.

06/26/2016 - 06:26

న్యూఢిల్లీ, జూన్ 25: వివాదాస్పద స్ప్రింటర్ దుతీ చాంద్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం అల్మాటీ (కజకస్థాన్)లో జరిగిన మీట్‌లో 20 ఏళ్ల దుతీ 100 మీటర్ల దూరాన్ని 11.30 సెకన్లలో పూర్తి చేసి, కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. అంతేగాక ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది.

06/26/2016 - 00:45

పారిస్, జూన్ 25: ఒకే ఏడాది నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించడం అసాధ్యమేమీ కాదని ఇటీవలే జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి, వింబుల్డన్ టోర్నీకి సిద్ధమవుతున్న ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ఆండీ ముర్రేను 3-6, 6-1, 6-2 తేడాతో ఓడించిన అతను కెరీర్ గ్రాండ్ శ్లామ్‌ను పూర్తి చేసిన విషయం తెలిసిందే.

06/26/2016 - 00:43

న్యూఢిల్లీ, జూన్ 25: అట్లాంటా ఒలింపిక్స్ సమయంలో సెంటినియల్ పార్క్‌లో బాంబు పేలిన సంఘటన తనకు జీవితాంతం గుర్తిండి పోతుందని భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాంర్ పేస్ పేర్కొన్నాడు. స్పోర్ట్స్ జర్నలిస్టులు దిగ్విజయ్ సింగ్ దేవ్, అమిత్ బోస్‌తో కలిసి రాసిన తాజా పుస్తకం ‘మై ఒలింపిక్ జర్నీ’లో పేస్ 1996 అట్లాంటా ఒలింపిక్స్ అనుభవాలను ప్రస్తావించాడు.

06/26/2016 - 00:41

బ్రిడ్జిటౌన్, జూన్ 25: ముక్కోణపు వనే్డ సిరీస్‌లో చివరి ప్రిలిమినరీ మ్యాచ్‌ని గెల్చుకున్న వెస్టిండీస్ ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికాను ఢీకొన్న ఈ జట్టు డారెన్ బ్రేవో అద్భుత శతకంతో రాణించడంతో 49.5 ఓవర్లలో 285 పరుగులు చేయగలిగింది. అనంతరం దక్షిణాఫ్రికాను కేవలం 185 పరుగులకే కట్టడి చేసి, 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.

06/26/2016 - 00:40

న్యూఢిల్లీ, జూన్ 25: పాఠశాలలో చదువుతున్న రోజుల్లో హోం వర్క్ చేయడం ఎప్పుడూ తనకు భారంగానే తోచేదని, అది ఎన్నటికీ పూర్తయ్యేది కాదని భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన అతను చిన్నారులతో కలిసి కొంత సేపు సరదాగా గడిపాడు. తన చిన్నతనంలో జరిగిన పలు సంఘటనలను గుర్తుచేసుకున్నాడు. తీరిక సమయాల్లో ఎక్కువగా క్రికెట్ ఆడేవాడినని చెప్పాడు.

06/26/2016 - 00:38

లాయర్, జూన్ 25: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో పోలాండ్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. శనివారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో పెనాల్టీ షూటౌట్ అనివార్యంకాగా, స్విట్జర్లాండ్‌పై పోలాండ్ 5-4 తేడా తో విజయం సాధించింది. అంతకు ముందు ఇరు జట్లు చెరొక గోల్ చేశాయ.

06/26/2016 - 00:37

బర్మింగ్‌హామ్, జూన్ 25: ఓపెనర్లు అలెక్స్ హాలెస్, జాసన్ రాయ్ అజేయ శతకాలతో రాణించి, రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించగా, శ్రీలంకతో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో గెల్చుకుంది. మొదటి వనే్డ టైగా ముగియగా, రెండో వనే్డలో తొలుత బ్యాటింగ్ చేసిన 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 254 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 34.1 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా ఛేదించింది.

Pages