S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/26/2016 - 00:35

లియాన్, జూన్ 25: ఫ్రాన్స్ పేరు వింటేనే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అభిమానులు మండిపడుతున్నారు. 2009 నవంబర్ 18న జరిగిన మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు థియెరీ హెన్రీ రెండు పర్యాయాలు చేతిని అడ్డం పెట్టి బంతిని ఆపిన సంఘటనను వారు ఇప్పటికీ మరచిపోలేదు. ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-1 తేడాతో గెల్చుకుంది. నిజానికి హెన్రీ చేతిని అడ్డంపెట్టి రెండు గోల్స్‌ను ఆపడమే తమ జట్టు పరాజయానికి కారణమని ఐరిష్ అభిమానులు మండిపడుతున్నారు.

06/25/2016 - 17:52

దిల్లీ: రియో ఒలింపిక్స్‌కు భారత అథ్లెట్‌ ద్యుతిచంద్‌ అర్హత సాధించింది. 11.32 సెకండ్లలో 100మీటర్ల పరుగును పూర్తిచేసిన వారికి రియోలో అర్హత దక్కుతుంది. కజకిస్థాన్‌లో జరిగిన 26వ కోసనోవ్‌ మెమోరియల్‌ మీట్‌ పోటీల్లో మహిళల 100మీటర్ల విభాగంలో ద్యుతి విజయం సాధించడంతో పాటు రియో టికెట్‌ దక్కించుకుంది. శనివారం జరిగిన పోటీల్లో ద్యుతి ఈ పరుగును 11.30సెకండ్లలోనే పూర్తి చేసింది. అంతేగాక..

06/25/2016 - 08:33

బకూ (అజర్‌బైజాన్), జూన్ 24: భారత బాక్సర్ వికాస్ క్రిషన్ ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. అంతేగాక అతను రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) ఆధ్వరంలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నమెంట్ 75 కిలోల విభాగంలో పోటీపడిన అతను క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన లీ డోంగ్యున్‌ను 3-0 తేడాతో ఓడించాడు.

06/25/2016 - 08:31

ధర్మశాల, జూన్ 24: విదేశాల్లో మినీ ఐపిఎల్ టోర్నమెంట్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. టోర్నీ స్వరూపం ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, రెండు వారాల్లో దీనిని ముగించాలని బిసిసిఐ భావిస్తోంది. అమెరికాలో లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఈ టోర్నీని నిర్వహిస్తామని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపాడు.

06/25/2016 - 08:31

లండన్, జూన్ 24: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మెయిన్ డ్రా ఖరారైంది. ముందుగా ఊహించిన విధంగా ఫలితాలు వెల్లడైతే, సెమీ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్, కెరీర్‌లో అత్యధికంగా 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న రోజర్ ఫెదరర్ మధ్య మ్యాచ్ ఉంటుంది.

06/25/2016 - 08:30

న్యూఢిల్లీ, జూన్ 24: తాను ప్రచారాన్ని ఇష్టపడనని, తనకు అప్పగించిన బాధ్యతను ఎలాంటి హంగామా లేకుండా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా ఎంపికైన మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే అన్నాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ గతంలో కోచ్‌లుగా వ్యవహరించిన జాన్ రైట్, గారీ కిర్‌స్టెన్ కూడా ఈ విధంగా తెరవెనుకే ఉండేవారని, తనదీ అదే సిద్ధాంతమని పేర్కొన్నాడు.

06/24/2016 - 04:15

ధర్మశాల, జూన్ 23: టీమిండియా కోచ్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లేను కోచ్‌గా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నియమించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కుంబ్లేకు ఎంతో అనుభవం ఉందని, అందుకే అతనిని ఎంపిక చేశామని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఒక ప్రకటనలో తెలిపాడు. బోర్డు పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నాడు. అతను ఏడాది పాటు ఈ పదవిలో ఉంటాడని చెప్పాడు.

06/24/2016 - 02:04

లిల్లే (ఫ్రాన్స్), జూన్ 23: రాబీ బ్రాడీ అసాధారణ ప్రతిభ యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇటలీతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఈ జట్టు 1-0 ఆధిక్యంతో గెలిచింది. మ్యాచ్ ఆరంభం నుంచి దాదాపుగా చివరి వరకూ ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. ఒకానొక దశలో పెనాల్టీ షూటౌట్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

06/24/2016 - 02:02

న్యూఢిల్లీ, జూన్ 23: భారత వెటరన్ బాక్సర్, కెరీర్‌లో ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న 33 ఏళ్ల మేరీ కోమ్‌కు రియో ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఆమెను ఒలింపిక్స్‌కు పంపేందుకు భారత హాకీ అడ్‌హాక్ కమిటీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) నిరాకరించింది.

06/24/2016 - 02:00

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రానంత మాత్రాన తాను అంతర్జాతీయ బాక్సింగ్ నుంచి రిటైర్ కావాలని అనుకోవడం లేదని మేరీ కోమ్ స్పష్టం చేసింది. రియోకు వెళ్లే అవకాశం లేదన్న విషయాన్ని భారత బాక్సింగ్ అడ్‌హాక్ కమిటీ ద్వారా తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డానని పిటిఐతో మాట్లాడుతూ ఆమె చెప్పింది. రియోకు వెళ్లే అవకాశం రానందుకు నిరాశ చెందినప్పటికీ, కెరీర్‌ను ముగించాలన్న ఆలోచన తనకు లేదని తేల్చిచెప్పింది.

Pages