S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/23/2016 - 13:59

దిల్లీ: భారత బాక్సర్‌ మేరీకోమ్‌ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. రియోలో పోటీచేసేందుకు మేరీకోమ్‌కు వైల్డ్‌కార్డు ఇవ్వాలని భారత ఒలింపిక్‌ సంఘంతో పాటు ఐబా అడ్‌హాక్‌ కమిటీ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం(ఐఓసీ) నిరాకరించింది. ఐఓసీ నిబంధనల ప్రకారం చివరి రెండు ఒలింపిక్స్‌లో ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది బాక్సర్లు పోటీపడిన దేశానికి వైల్డ్‌కార్డు ఇవ్వకూడదు.

06/23/2016 - 08:31

హరారే, జూన్ 22: జింబాబ్వేతో జరిగిన చివరి, మూడో టి-20ని అతి కష్టం మీద గెల్చుకున్న టీమిండియా ఈ సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 138 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి చివరి వరకూ ప్రయత్నించిన జింబాబ్వే మూడు పరుగుల తేడాతో ఓడింది.

06/23/2016 - 08:29

నాటింగ్‌హామ్, జూన్ 22: టెయిలెండర్ లియామ్ ప్లంకెట్ చివరి బంతిని సిక్స్‌గా మార్చడంతో శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వనే్డ ఇంటర్నేషనల్ టైగా ముగిసింది. 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఒకానొక దశలో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 82 పరుగులకు చేరుకునే సమయానికి మొత్తం ఆరు వికెట్లు కూలాయి.

06/23/2016 - 08:28

బ్రిడ్జిటౌన్, జూన్ 22: వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న ఆస్ట్రేలియా ముక్కోణపు వనే్డ క్రికెట్ సిరీస్‌లో ఫైనల్ చేరింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు సాధించింది.

06/23/2016 - 08:27

మనాస్ (బ్రెజిల్), జూన్ 22: బ్రెజిల్ అధికారుల అత్యుత్సాహం ఒక చిరుత పులిని బలిగొంది. స్థానిక జూలో ఒలింపిక్స్ రిలేను నిర్వహించడం, అందు కోసం జుమా అనే చిరుతను తీసుకొచ్చి ఫొటో సెషన్‌ను నిర్వహించడం, చివరికి దానిని కాల్చిచంపడం సంచలనం రేపగా, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు మాసంలో జరిగే ఒలింపిక్స్‌కు బ్రెజిల్ ఒలింపిక్ నిర్వాహణ కమిటీ పలు కార్యక్రమాలను చేపట్టింది.

06/23/2016 - 08:27

హూస్టన్, (అమెరికా), జూన్ 22: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అమెరికాతో జరిగిన సెమీ ఫైనల్‌ను ఈ జట్టు 4-0 తేడాతో గెల్చుకుంది. అర్జెంటీనాకు ప్రాతినిథ్యం వహిస్తూ కెరీర్‌లో 55వ గోల్‌ను నమోదు చేసిన సూపర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ సరికొత్త రికార్డు సృష్టించాడు.

06/22/2016 - 16:35

హరారే: భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జింబాబ్వే కెప్టెన్‌ క్రీమర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. సిరీస్‌లో నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్‌ను గెలిచిన జట్టు విజేతగా నిలవనుండటంతో సొంతగడ్డపై సత్తాచాటాలని జింబాబ్వే ఉవ్విళ్లూరుతుండగా.. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌ టీ20 సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తోంది.

06/22/2016 - 01:18

బాకు (అజర్‌బైజాన్), జూన్ 21: అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) ఆధ్వర్యాన అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో కామనె్వల్త్ క్రీడల పసిడి పతక విజేత మనోజ్ కుమార్‌తో పాటు భారత్‌కు చెందిన మరో బాక్సర్ సుమిత్ సంగ్వాన్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

06/22/2016 - 01:18

కోల్‌కతా, జూన్ 21: దీర్ఘ కాలం నుంచి ఖాళీగా ఉన్న టీమిండియా ప్రధాన కోచ్ పదవిని భర్తీ చేసేందుకు అభ్యర్థి కోసం చాలా కాలం నుంచి జరుగుతున్న అనే్వషణ తుది దశకు చేరుకుంది. ఈ పదవికి తగిన అభ్యర్థిని సిఫారసు చేసేందుకు బిసిసిఐ ఏర్పాటు చేసిన క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) మంగళవారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు అనిల్ కుంబ్లే, రవిశాస్ర్తీ సహా పలువురు ఇతర అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు.

06/22/2016 - 01:16

కోల్‌కతా, జూన్ 1: దేశంలో తొలిసారిగా ఇక్కడి ఈడెన్‌గార్డెన్‌లో ఫ్లడ్‌లైట్ల మద్య నిర్వహించిన పింక్‌బాల్ నాలుగు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 296 పరుగుల తేడాతో భవానీపూర్ క్లబ్ జట్టును ఓడించి విజయం సాధించింది.

Pages