S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/22/2016 - 01:15

కోల్‌కతా, జూన్ 21: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్‌ను 2005లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి సిఫారసుచేసి చేతులు కాల్చుకున్నానని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంగీకరించాడు. ప్రస్తుతం టీమిండియాకు తదుపరి కోచ్‌ను నియమించే బాధ్యతను మరోసారి నెత్తికెత్తుకున్న గంగూలీ అలాంటి తప్పును మళ్లీ చేయబోనని స్పష్టం చేశాడు.

06/22/2016 - 01:13

టౌలౌస్, జూన్ 21: ఫ్రాన్స్‌లో జరుగుతున్న యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో గ్రూప్-బినుంచి వేల్స్, ఇంగ్లండ్‌లు ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి.

,
06/22/2016 - 01:11

హరారే, జూన్ 21: జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరుగనున్న నిర్ణాయక చివరి మ్యాచ్‌లో తలపడేందుకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది.

06/21/2016 - 07:02

హరారే, జూన్ 20: కెరీర్‌లో మొట్టమొదటి టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ బరీందర్ శరణ్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును సంపాదించుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా కూడా అతనికి తోడు కలవడంతో, రెండో టి-20లో జింబాబ్వేను వందకులోపే కట్టడి చేసిన టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేయలిగింది.

06/21/2016 - 06:59

బ్రిడ్జిటౌన్ (బార్బడాస్), జూన్ 20: ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్ధం కారణంగా రద్దయింది. ఇరు జట్లకు చెరి రెండు పాయింట్లు లభించాయి. అంతకు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు దిగి, ఒక ఓవర్‌లో ఎనిమిది పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది.

06/21/2016 - 06:59

న్యూఢిల్లీ, జూన్ 20: కొంతకాలం విశ్రాంతి తీసుకున్న భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ మళ్లీ జట్టులోకి వచ్చేశాడు. ఈనెల 27 నుంచి వలెన్షియాలో ప్రారంభం కానున్న ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టుకు అతను నాయకత్వం వహిస్తాడు. సర్దార్‌తోపాటు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన డ్రాగ్ ఫ్లికర్ రూపీందర్ పాల్ సింగ్, బరీందర్ లాక్ర కూడా తిరిగి జట్టుతో చేరారు.

06/21/2016 - 06:57

న్యూఢిల్లీ, జూన్ 20: టెన్నిస్ ఆడడంలోనే కాదు.. అందంగా చీర కట్టడంలోనూ హైదరాబాదీ సానియా మీర్జాను మించిన వారు లేరు. అంతర్జాతీయ ఎథ్నిక్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలో భారత జాతీయత ఉట్టిపడేలా అందంగా దుస్తులు ధరించే క్రీడాకారిణిగా సానియా 9.3 శాతం ఓట్లను సంపాదించుకుంది. మరో హైదరాబాదీ, బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ఈ జాబితాలో రెండో స్థానం దక్కింది.

06/21/2016 - 06:57

లండన్, జూన్ 20: బ్రిటన్ ఆటగాడు, ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే ఇక్కడ జరిగిన క్వీన్స్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో అతను మిలోస్ రవోనిక్‌ను 6-7, 6-4, 6-3 తేడాతో ఓడించి, రానున్న వింబుల్డన్‌లో తాను గట్టిపోటీదారుడినని నిరూపించుకున్నాడు.

06/21/2016 - 06:57

లిల్లీ (ఫ్రాన్స్), జూన్ 20: ఒక అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అల్బానియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆర్మాండో సాదికు సాధించిన గోల్‌తో ఈ జట్టు రుమేనియాపై 1-0 ఆధిక్యంతో విజయభేరి మోగించింది. ప్రత్యర్థిని చాలా తేలిగ్గా తీసుకున్న రుమేనియా సులభంగానే గోల్స్ సాధించవచ్చన్న ధీమాతో బరిలోకి దిగింది. అయితే, అల్బానియా రక్షణ వలయాన్ని ఛేదించడానికి తీవ్రంగా శ్రమించి విఫలమైంది.

06/20/2016 - 06:23

ఫాక్స్‌బరో (అమెరికా), జూన్ 19: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ తన కెరీర్‌లో ఒక కీలక మైలురాయిని చేరుకున్నాడు. వెనెజులాతో జరిగిన క్వార్టర్ మ్యాచ్‌లో అతను రికార్డు గోల్ చేశాడు. అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధికంగా 54 గోల్స్ సాధించిన గాబ్రియెల్ బటిస్టా రికార్డును అతను సమం చేశాడు.

Pages