S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/20/2016 - 06:23

ఫాక్స్‌బరో (అమెరికా), జూన్ 19: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ తన కెరీర్‌లో ఒక కీలక మైలురాయిని చేరుకున్నాడు. వెనెజులాతో జరిగిన క్వార్టర్ మ్యాచ్‌లో అతను రికార్డు గోల్ చేశాడు. అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధికంగా 54 గోల్స్ సాధించిన గాబ్రియెల్ బటిస్టా రికార్డును అతను సమం చేశాడు.

06/20/2016 - 06:18

వియన్నా, జూన్ 19: రియో ఒలింపిక్స్‌లో తాము ప్రాతినిథ్యం వహించే అవకాశాలకు గండిపడిందని, ఇక ఎలాంటి ఆశలు లేవని రష్యా క్రీడా శాఖ మంత్రి విటాలీ ముట్కో ప్రకటించాడు. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన కారణంగా రష్యాను సస్పెండ్ చేసిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) దానిని కొనసాగించాలని తీర్మానించిన విషయం తెలిసిందే. సమాఖ్య నిర్ణయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) ఖరారు చేసింది.

06/20/2016 - 06:17

హరారే, జూన్ 19: భారత క్రికెటర్ ఒకరు అత్యాచారం ఆరోపణపై అరెస్టయ్యాడని జింబాబ్వే మీడియాలో జోరుగా ప్రచారం జరగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే, క్రికెటర్ ఎవరూ అరెస్టు కాలేదని టీమిండియా మేనేజ్‌మెంట్ తేల్చిచెప్పింది.

06/20/2016 - 06:17

సాంటా క్లారా (అమెరికా), జూన్ 19: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్‌లో ఎడ్యుయార్డో వర్గాస్ చెలరేగిపోయి నాలుగు గోల్స్ చేయడంతో మెక్సికోపై చిలీ 7-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన చిలీ ఏకంగా వరుస గోల్స్‌తో విజృంభించగా, మెక్సికో ప్రేక్షక పాత్రను పోషించింది.

06/20/2016 - 06:16

హరారే, జూన్ 19: జింబాబ్వేతో జరిగిన మొదటి టి-20 ఇంటర్నేషనల్‌లో అనూహ్యంగా రెండు పరుగుల తేడాతో ఓడిన టీమిండియా సోమవారం నాటి రెండో మ్యాచ్‌లో ఎదురుదాడికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ని గెల్చుకోవడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవడానికి ధోనీ సేన చెమటోడ్చనుంది.

06/19/2016 - 07:34

లండన్, జూన్ 18: వివాదాస్పదంగా మారిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్‌లో ఓడిన భారత్ రజత పతకంతో సంతృప్తి చెందింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ టైటిల్ పోరులో భారత ఆటగాళ్లు అసాధారణ స్థాయిలో రాణించారు. గోల్స్ చేసే అవకాశాలను చేజార్చుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా దూకుడుకు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగారు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.

06/19/2016 - 07:28

హరారే, జూన్ 18: భారత్ చేతిలో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను కోల్పోయిన జింబాబ్వే ఎదురుదాడి చేసి, టి-20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. రెండు పరుగుల తేడాతో విజయం సాధించి ధోనీ సేనకు షాకిచ్చింది. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 168 పరుగులు చేయగలిగింది.

06/19/2016 - 07:25

లండన్, జూన్ 18: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్ సందర్భంగా వివాదం తలెత్తింది. డానియెల్ బీయెల్ కొట్టిన బంతిని భారత గోల్‌కీపర్ శ్రీజేష్ సమర్థంగా అడ్డుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా ఆటగాళ్లు రీ ప్లేకు డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

06/19/2016 - 07:24

సీటిల్ (అమెరికా), జూన్ 18: కోపా అమెరికా సాకర్ టోర్నీలో అమెరికా జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈక్వెడార్‌తో జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో ఆ జట్టు 2-1 తేడాతో విజయభేరి మోగించింది. మ్యాచ్ 22వ నిమిషంలో అమెరికాకు క్లింట్ డెంప్సీ ద్వారా తొలి గోల్ లభించింది. ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు.

06/19/2016 - 07:22

నైస్ (ఫ్రాన్స్), జూన్ 18: యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్పెయిన్ ప్రీ క్వార్టర్స్‌లో స్థానం సంపాదించింది. టర్కీతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 3-0 తేడాతో విజయం సాధించి, ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్ 34వ నిమిషంలో అల్వరో మోరాటా స్పెయిన్‌కు తొలిగోల్‌ను అందించాడు. మరో మూడు నిమిషాల్లోనే థామస్ ఏవలిటో చేసిన గోల్‌తో స్పెయిన్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

Pages