S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/29/2016 - 02:30

పారిస్, మే 28: తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన ‘క్లే కోర్టు హీరో’ రాఫెల్ నాదల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. పురుషుల సింగిల్స్ మొదటి రెండు రౌండ్లలో అతను చేతి మణికట్టు గాయంతోనే మ్యాచ్‌లు ఆడాడు. చేతికి ఇంజక్షన్ చేయించుకొని మరీ అతను పదోసారి రొలాండ్ గారోస్‌లో టైటిల్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ముందంజ వేశాడు.

05/28/2016 - 05:12

న్యూఢిల్లీ, మే 27: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్‌కు చేరువైంది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

05/28/2016 - 05:04

అస్తానా (కజకిస్థాన్), మే 27: ఎఐబిఎ మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్ సోనియా లాథర్ రజత పతకాన్ని గెలుచుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన 57 కిలోల ఫైనల్ బౌట్‌లో ఆమె ఇటలీకి చెందిన టాప్ సీడ్ బాక్సర్ అలెస్సియా మెసియానో చేతిలో పరాజయం పాలవడంతో రజత పతకంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఈ చాంపియన్‌షిప్స్‌లో మెడల్ రౌండ్స్‌కు చేరుకున్న భారత బాక్సర్ లాథర్ ఒక్కరే.

05/28/2016 - 05:01

ముంబయి, మే 27: టీమిండియాకు గత 18 నెలల నుంచి సహాయ కోచ్‌గా సేవలు అందిస్తున్న మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బంగర్ త్వరలో జింబాబ్వేలో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా నియమితుడయ్యాడు.

05/28/2016 - 05:00

హాంకాంగ్, మే 27: హాంకాంగ్‌లో జరుగుతున్న పిఎస్‌ఎ హెచ్‌కెఎఫ్‌సి ఇంటర్నేషనల్ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి జోత్స్న చిన్నప్ప టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన జ్యోత్స్న శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్‌లో 8-11, 11-9, 12-10, 7-11, 11-9 తేడాతో హాంకాంగ్‌కు చెందిన డిఫెండింగ్ చాంపియన్ అనే్న అవును మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

05/28/2016 - 04:59

పారిస్, మే 27: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి 10వ సీడ్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా, 11వ సీడ్ క్రీడాకారిణి లూసీ సఫరోవా నిష్క్రమించారు.

05/27/2016 - 03:16

న్యూఢిల్లీ, మే 26: ఈసారి ఐపిఎల్‌లో తొలిసారి అడుగుపెట్టిన జట్టు గుజరాత్ లయన్స్. ప్లే ఆఫ్ దశకు చేరుతుందని ఎవరూ ఊహించని జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ చేరాయి. పాయింట్ల పట్టికలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానాన్ని ఆక్రమిస్తే, గుజరాత్ రెండో స్థానంలో ఉంది.

05/27/2016 - 03:14

సిడ్నీ, మే 26: ఆస్ట్రేలియా జాతీయ జట్టు కోచ్ పదవి కోసం తాను తొందరపడడం లేదని, ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా తనకు లేదని జస్టిన్ లాంగర్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు కూడా తలపడే ముక్కోణపు వనే్డ సిరీస్‌కు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. రెగ్యులర్ కోచ్ డారెన్ లీమన్ విశ్రాంతి తీసుకోవడంతో, అతని స్థానంలో జట్టుకు లాంగర్ కోచ్‌గా వ్యవహరిస్తాడు.

05/27/2016 - 03:13

మాస్కో, మే 26: నిషిద్ధ మాదక ద్రవ్యమైన మెల్డోనియంను వినియోగించి డోపింగ్ పరీక్షలో పట్టుబడిన టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాకు ఒలింపిక్స్‌లో పాల్గొనే రష్యా బృందంలో చోటు లభించింది. ఉత్ప్రేరకాన్ని వాడినట్టు స్వయంగా అంగీకరించిన షరపోవాపై అంతర్జాతీయ మహిళా టెన్నిస్ సమాఖ్య (డబ్ల్యుటిఎ) నాలుగేళ్ల నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.

05/27/2016 - 03:12

పారిస్, మే 26: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్ చేరాడు. గ్రాండ్ శ్లామ్స్‌లో మిగతా మూడు టోర్నీలు, ఆస్ట్రేలియా, వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లను కైవసం చేసుకున్న జొకోవిచ్‌ను ఫ్రెంచ్ ఓపెన్ చాలాకాలంగా ఊరిస్తునే ఉంది. 11 పర్యాయాలు విఫలమైన అతను 12వ సారి టైటిల్‌ను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

Pages