S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/26/2016 - 07:09

న్యూఢిల్లీ, మే 25: ఎలాంటి అంచనాలు లేకుండా ఈసారి ఐపిఎల్‌లో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి, రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ లయన్స్‌తో పోరును ఖరారు చేసుకుంది.

05/26/2016 - 07:07

పారిస్, మే 25: ఆరో ర్యాంక్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆమె జరినా దియాస్‌ను 7-6, 6-2 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌లో గట్టిపోటీనిచ్చిన దియాస్ రెండో రౌండ్‌లో దారుణంగా విఫలమై, ఓటమిపాలైంది.

05/26/2016 - 07:06

మెక్సికో సిటీ, మే 25: తనపై వేసిన సస్పెన్షన్ వేటును రద్దు చేయాలని కోరుతూ యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం (యుఫా) అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీ వేసిన కేసును కొట్టివేస్తూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) తీసుకున్న నిర్ణయం తమకు నిర్ణయం శిరోధార్యమని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో స్పష్టం చేశాడు.

05/26/2016 - 07:05

కరాచీ, మే 25: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో పాకిస్తాన్ క్రికెటర్లకు కూడా అవకాశం కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జహీర్ అబ్బాస్ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి సూచించాడు. ఈ విధంగా చేస్తే టోర్నీ ప్రాధాన్యం, ప్రమాణాలు మరింతగా పెరుగుతాయని వ్యాఖ్యానించాడు.

05/26/2016 - 07:05

లండన్, మే 25: భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జరిపిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈనెల 15న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు నెహ్రా మోకాలికి తీవ్ర గాయమైంది. మందులతో తగ్గే అవకాశం లేకపోవడంతో అతనికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తేల్చిచెప్పారు.

05/25/2016 - 06:36

బెంగళూరు, మే 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించాలన్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో అడుగు దూరంలో నిలిచింది. బెంగళూరులోని సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో టేబుల్ టాపర్ గుజరాత్ లయన్స్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

05/25/2016 - 06:34

ముంబయి, మే 24: అబుదాబిలో జరుగుతున్న ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్ దశలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై 2-3 తేడాతో విజయం సాధించిన థాయిలాండ్ గ్రూప్-బిలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది.

05/25/2016 - 06:34

పారిస్, మే 24: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో జర్మనీకి చెందిన మూడో సీడ్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో చాంపియన్‌షిప్ సాధించిన కెర్బర్‌పై బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అన్‌సీడెడ్ డచ్ క్రీడాకారిణి కికీ బెర్టెన్స్ (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 58వ స్థానం) సంచలన విజయం సాధించింది.

05/25/2016 - 06:33

న్యూఢిల్లీ, మే 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరుగనున్న ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు రేసులో నిలుస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

05/24/2016 - 04:58

నిన్నమొన్నటి వరకూ ఐపిఎల్ అంటే క్రిస్ గేల్ అనేవారు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఎవరంటే గేల్ పేరే చెప్పేవారు. కానీ, ఈసారి గేల్‌నేకాదు.. హార్డ్ హిట్టర్లుగా పేరు సంపాదించిన ఎబి డివిలియర్స్, బ్రెండన్ మెక్‌కలమ్, ఆరోన్ ఫించ్, డేవిడ్ మిల్లర్, డేవిడ్ వార్నర్ వంటి హేమాహేమీలను పక్కకు నెట్టిన కోహ్లీని సూపర్ హీరోగా ప్రస్తుతిస్తున్నారు.

Pages