S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/13/2015 - 04:32

పారిస్, డిసెంబర్ 12: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నుంచి సస్పెన్షన్‌కు గురైన యూఫా ఫుట్‌బాల్ అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీకి కష్టాలు తప్పేటట్టు కనిపించడం లేదు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైందని, సస్పెన్షన్‌ను దీర్ఘకాలం కొనసాగించే అవకాశాలున్నాయని ఫిఫా వర్గాలు అంటున్నాయి.

12/13/2015 - 04:30

ముంబయి, డిసెంబర్ 12: రాజ్‌కోట్ స్థానిక ఆటగాడు రవీంద్ర జడేజాకే ఇంటెక్స్ ఓటు వేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చాలాకాలం తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చిన జడేజా చక్కటి ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నాడు. పైగా స్థానికుడు కావడంతో అతనికే రాజ్‌కోట్ తొలి అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది.

12/13/2015 - 04:30

లండన్, డిసెంబర్ 12: భారత గ్రాండ్ మాస్టర్, మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఇక్కడ జరుగుతున్న లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్‌లో మూడో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. మాక్సిమ్ వచియా లాగ్రేవ్ (ఫ్రాన్స్)ను ఢీకొన్న అతను తన బలగాలను సక్రమంగా కదిలించలేకపోయాడు. ప్రత్యర్థి వ్యూహాత్మకంగా విరుచుకుపడగా, కనీసం రక్షణాత్మకంగా కూడా ఎత్తులు వేయలేక ఓటమిని కొనితెచ్చుకున్నాడు.

12/13/2015 - 04:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: భారత డిస్కస్ డ్రోయర్ వికాస్ గౌడకు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత లభించింది. వాస్తవానికి డిస్కస్‌ను 66 మీటర్ల దూరం విసిరిన వారికే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాహణ కమిటీ తొలుత ప్రకటించింది. అయితే, ఇటీవల ఆ నిబంధనను మార్చి, 65 మీటర్లకు ఖరారు చేసింది.

12/13/2015 - 04:29

ముంబయి, డిసెంబర్ 12: వచ్చే ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు మన దేశంలో జరిగే టి-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ ప్రపంచ యాత్ర ఆదివారం ప్రారంభమవుతుంది. ఈ ట్రోఫీని ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రదర్శనకు ఉంచుతామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

12/13/2015 - 04:28

శ్రీలంకతో మొదటి టెస్టు
డ్యునెడిన్, డిసెంబర్ 12: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టుపై న్యూజిలాండ్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 431 పరుగుల భారీ స్కోరు చేసిన ఈ జట్టు ఆతర్వాత శ్రీలంకను 294 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను
ఆరంభించి, ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 171
పరుగులు సాధించింది. మ్యాచ్ మూడోరోజు, శనివారం

12/13/2015 - 04:28

15న ఐపిఎల్ క్రీడాకారులకు డ్రాఫ్ట్

12/13/2015 - 04:27

హోబర్ట్, డిసెంబర్ 12: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని మూడో రోజునే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 212 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. చాలాకాలం తర్వాత మళ్లీ టెస్టు జట్టులో స్థానం సంపాదించిన జేమ్స్ పాటిన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ విజయభేరి మోగించింది. ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయిన విండీస్ ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది.

12/12/2015 - 06:53

ముంబయి, డిసెంబర్ 11: వచ్చే ఏడాది జరిగే ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్‌లకు ఒకే గ్రూపులో చోటు లభించింది. చాలా కాలం నుంచి పరస్పర పోటీకి దూరంగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య మార్చి 19వ తేదీన ధర్మశాలలో హై-ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఐసిసి శుక్రవారం ఆవిష్కరించింది.

12/12/2015 - 06:49

డునెడిన్, డిసెంబర్ 11: న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా డునెడిన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు కష్టాలకు ఎదురీదుతోంది. 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు మరో 22 పరుగులు సాధించి ఆలౌట్ అయింది.

Pages