S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/14/2016 - 05:46

బెంగళూరు, ఏప్రిల్ 13: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యువ బ్యాట్స్‌మన్ సర్ఫ్‌రాజ్ ఖాన్ ఒకేసారి సూపర్ స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇండియన్ ప్రీమియల్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 10 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 35 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

04/13/2016 - 07:56

బెంగళూరు, ఏప్రిల్ 12: తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ని 45 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఎబి డివిలియర్స్ కేవలం 42 బంతుల్లోనే 82 పరుగులు చేసి బెంగళూరు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

04/13/2016 - 07:54

కోల్‌కతా, ఏప్రిల్ 12: తొమ్మిదో ఐపిఎల్ తొలి మ్యాచ్‌లోనే రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమైంది. నైట్ రైడర్స్ తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది.

04/13/2016 - 07:53

కొలంబో, ఏప్రిల్ 12: ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఏఏ టోర్నీల్లో ఆడాలో, వేటికి గైర్హాజరు కావాలో తానే సొంతంగా నిర్ణయించుకుంటున్నాడని ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగపై శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ఆగ్రహంతో ఉంది. అందుకే ముంబయి ఇండియన్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో అతను ఆడాల్సి ఉన్నప్పటికీ, ఇంత వరకూ నో ఆబ్జెక్షన్ సర్ట్ఫికెట్ (ఎన్‌ఒసి)ని జారీ చేయలేదు.

04/13/2016 - 07:53

కొలంబో, ఏప్రిల్ 12: శ్రీలంక సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య మళ్లీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్‌గా అరవింద డి సిల్వ వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది జయసూర్య సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన వెంటనే ఆ స్థానాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) అధికారులు డి సిల్వతో భర్తీ చేశారు.

04/13/2016 - 07:52

సింగపూర్, ఏప్రిల్ 12: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించింది.

04/12/2016 - 05:39

మొహాలీ, ఏప్రిల్ 11: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు హోం గ్రౌండ్‌లోనే చుక్కెదురైంది. తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా సోమవారం గుజరాత్ లయన్స్‌ను ఢీకొన్న పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో చిత్తయింది. తొలిసారి ఐపిఎల్‌లోకి అడుగుపెట్టిన గుజరాత్ తొలి మ్యాచ్‌లోనే విజయంతో బోణీ చేసింది. ఆరోన్ ఫించ్ 74 పరుగులు ఈ జట్టు విజయానికి దోహదపడ్డాయి.

04/12/2016 - 05:09

బెంగళూరు, ఏప్రిల్ 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోని బలమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందినప్పటికీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి టైటిల్‌పై గురిపెట్టింది. భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో బెంగళూరు తొమ్మిదో ఐపిఎల్‌లో తొమి మ్యాచ్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం ఆడనుంది.

04/12/2016 - 05:07

సింగపూర్, ఏప్రిల్ 11: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫిట్నెస్‌పై అనుమానాలకు తెరపడడం లేదు. మంగళవారం నుంచి సింగపూర్ సూపర్ సిరీస్ ఆరంభం కానుండగా, గతంలో ఒకసారి ఇక్కడ టైటిల్ సాధించిన సైనా మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేయాలన్న ఉత్సాహంతో ఉంది. 2010 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె తాయ్ జూ ఇంగ్‌ను 21-18, 21-15 తేడాతో ఓడించి టైటిల్ సాధించింది.

04/12/2016 - 05:02

మెల్బోర్న్, ఏప్రిల్ 11: ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ చైనా మహిళల క్రికెటర్లకు సహాయసహకారాలు అందించనుంది. సింగపూర్‌లో జన్మించిన మెగ్ తన సోదరి అన్నా లానింగ్ మాదిరిగానే క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకుంది. ఆస్ట్రేలియా మహిళా జట్టులో స్థానం సంపాదించింది. అత్యుత్తమ ప్రతిభతో ఆ జట్టు కెపెన్‌గా పగ్గాలు చేపట్టింది.

Pages