S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/16/2016 - 06:45

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 15: డిఫెండింగ్ చాంపియన్ గా ఐపిఎల్‌లో బరిలోకి దిగిన ముంబయ ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయ. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవి ల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 80 పరుగుల భారీ తే డాతో విజయభేరి మోగించింది.

05/16/2016 - 06:45

కున్షాన్ (చైనా), మే 15: థామస్ కప్ కోసం పురుషుల విభాగంలో జరిగే పోటీల్లో మొదటి రోజు భారత్‌కు చుక్కెదురైంది. థాయిలాండ్‌తో తలపడిన భారత్ 2-3 తేడాతో ఓడింది. సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ విజయాలను నమోదు చేయగా, అజయ్ జయరాం చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన అజయ్ జయరామ్ 16-21, 21-12, 14-21 తేడాతో తనోన్‌సాక్ సయెసమ్‌బూన్సుక్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.

05/16/2016 - 06:44

న్యూఢిల్లీ, మే 15: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) పాలక కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా భారత విశ్రాంతి న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ ఎంపికైనట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై తనకు ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లభించలేదని ముద్గల్ తెలిపారు.

05/15/2016 - 01:14

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ కలిపి మొత్తం 20 సిక్సర్లు బాదారు. ఇందులో కోహ్లీ 8 సిక్సర్లు కొట్టగా, డివిలియర్స్ 12 సిక్సర్లు సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్ జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది.

05/15/2016 - 01:12

బెంగళూరు: సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ. అతనికి ఈ సీజన్‌లో ఇది మూడో శతకం. ఐపిఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

05/15/2016 - 01:14

బెంగళూరు: ఐపిఎల్‌లో ఐదో వేగవంతమైన శతకాన్ని ఎబి డివిలియర్స్ నమోదు చేశాడు. అతను ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, 43 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. క్రిస్ గేల్ 30 బంతుల్లోనే చేసిన సెంచరీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. యూసుఫ్ పఠాన్ 37, డేవిడ్ మిల్లర్ 38, ఆడం గిల్‌క్రిస్ట్ 42 బంతుల్లో సెంచరీలు చేశారు.

05/15/2016 - 01:02

బెంగళూరు, మే 14: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో చెలరేగిపోయింది. కోహ్లీ, ఎబి డివిలియర్స్ సిక్సర్లతో హోరెత్తించారు. ఐపిఎల్ చరిత్రలోనే మొదటిసారి ఒక ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు నమోదుకాగా, బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 248 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన గుజరాత్ 104 పరుగులకు ఆలౌటైంది.

05/15/2016 - 00:51

కున్షాన్ (చైనా), మే 14: సైనా నెహ్వాల్ బృందం ఆదివారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న ఉబేర్ కప్ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌పై కనే్నసింది. అయితే, పురుషుల విభాగంలో థామస్ కప్ కోసం జరిగే పోరులో భారత్‌కు కష్టాలు తప్పేటట్టు కనిపించడం లేదు. ఉబేర్ కప్‌లో భారత మహిళల జట్టు మొట్టమొదటిసారి 2010లో క్వార్టర్ ఫైనల్ చేరింది.

05/15/2016 - 00:49

న్యూఢిల్లీ, మే 14: భారత్ నుంచి ఒలిపింక్స్‌కు రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో ఎవరు పోటీపడాలనే విషయంపై తలెత్తిన వివాదం ముదురుతోంది. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్‌పై జోక్యం చేసుకొని తనకు అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సుశీల్ కుమార్ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రీడా మంత్రిత్వ శాఖకు కూడా కాపీని పంపిన సుశీల్ తనకు ఒలింపిక్స్‌లో అవకాశం దక్కేలా చూడాలని కోడాడు.

05/15/2016 - 00:48

ముంబయి, మే 14: కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈనెల 22న సమావేశం కానుంది. శశాంక్ మనోహర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆతర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి స్వతంత్ర హోదాగల చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. మనోహర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి వచ్చే ఆదివారం బోర్డు సర్వసభ్య సమావేశం జరుగుతుంది.

Pages