S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/10/2016 - 00:50

మొహాలీ, మే 9: పాయింట్ల పట్టికలో చివరి నుంచి మొదటి రెండు స్థానాల్లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ చివరి క్షణం వరకూ ఉత్కంఠను రేపింది. హోరాహోరీగా సాగిన పోరులో బెంగళూరు ఒక పరుగు తేడాతో పంజాబ్‌ను ఓడించి ఊపిరి పీల్చుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని సాధించేందుకు మురళీ విజయ్ (89) చివరిలో మార్కస్ స్టొయినిస్ (34 నాటౌట్) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

05/10/2016 - 00:49

న్యూఢిల్లీ, మే 9: రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని భారత బాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్పెషలిస్ట్‌లు సుమీత్ రెడ్డి, మను అత్రి అన్నారు. భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి బాడ్మింటన్ జోడీగా చరిత్ర సృష్టించిన వీరు సోమవారం పిటిఐతో మాట్లాడుతూ ప్రాక్టీస్, ఫిట్నెస్ అనే రెండు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని అన్నారు.

05/10/2016 - 00:46

రియో డి జెనీరో, మే 9: ఒక అమెచ్యూర్ మ్యాచ్ ఆడిన కొద్ది సేపటికే బ్రెజిల్ ఫుట్‌బాలర్ బెర్నార్డో రిబెరో అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రెజిల్ దేశవాళీ పోటీల్లో ఫ్రిబర్గెన్స్ తరఫున రిక్రియో నగరంలో జరిగిన ఒక మ్యాచ్‌లో రిబెరో పాల్గొన్నాడు.

05/10/2016 - 00:41

లండన్, మే 9: ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను తామే గెల్చుకుంటామని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. మూడు టెస్టులు, ఐదు వనే్డలు, ఒక టి-20 మ్యాచ్‌లు ఆడేందుకు ఇంగ్లాండ్ వచ్చిన శ్రీలంకను ఎదుర్కోవడానికి సహచరులతో కలిసి ఆండర్సన్ నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. 2014లో లంక జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు రెండు టెస్టులు ఆడింది.

05/10/2016 - 00:39

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 9: పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో, తొలిసారి ఐపిఎల్‌లోకి అడుగు పెట్టిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే ఇంటి దారి పట్టక తప్పదు. ఈ మ్యాచ్ ఒక్కటే కాదు.. ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు పుణె జట్టుకు కీలకమే.

05/09/2016 - 00:06

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 8: శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రతిభ, ఆశిష్ నెహ్రా, ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్ నైపుణ్యం ముంబయిపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 85 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందించింది. ధావన్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ విజృంభణకు యువరాజ్ సింగ్ సమయోచిత బ్యాటింగ్ తోడు కావడంతో, తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది.

05/09/2016 - 00:01

మొహాలీ, మే 8: అన్ని రంగాల్లోనూ పటిష్టంగా ఉండడంలోనేకాదు.. అన్ని రంగాల్లోనూ విఫలమయ్యే విషయంలోనూ రెండు జట్లు సమవుజ్జీలుగా నిలుస్తాయని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లను చూస్తే స్పష్టమవుతుంది. పాయింట్ల పట్టికలో కింద నుంచి మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన ఈ జట్లు తప్పక గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గెలిచిన జట్టుకు ఆశలు కొంచమైనా సజీవంగా నిలుస్తాయి.

05/09/2016 - 00:01

కోల్‌కతా, మే 8: దినేష్ కార్తీక్ బాధ్యతాయుతంగా ఆడగా మిగతా ఆటగాళ్లు కూడా సహకరించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గుజరాత్ లయన్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే చేరుకుంది.

05/09/2016 - 00:00

మాడ్రిడ్, మే 8: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ మహిళల టైటిల్ సిమోనా హాలెప్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె డొమినికా సిబుల్‌కొవాను 6-2, 6-4 తేడాతో సునాయాసంగా ఓడించింది. మొదటి రౌండ్‌లో మసాకీ డోయ్‌పై గెలిచిన ఆమె ఆతర్వాత వెనుతిరిగి చూడలేదు. రెండో రౌండ్‌లో కరిన్ నాప్‌ను, మూడో రౌండ్‌లో తిమియా బసిన్‌జిక్‌స్కీని ఇంటిదారి పట్టింది.

05/08/2016 - 23:59

కరాచీ, మే 8: కోచ్ పదవికి కొంత మంది మాజీ క్రికెటర్లు ముందుకు రాకపోవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా పేర్లను ప్రస్తావించకపోయినా, పరోక్షంగా మోసిన్ ఖాన్, అకీబ్ జావేద్‌పై అతను విమర్శలు గుప్పించాడు.

Pages