S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/07/2016 - 06:41

కరాచీ, మే 6: పాకిస్తాన్ క్రికెట్ జట్టు నూతన కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ మికీ ఆర్థర్ (47) నియమితుడయ్యాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కోచ్ పదవికి వకార్ యూనిస్ రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో వకార్ స్థానంలో శుక్రవారం ఆర్థర్‌ను పాక్ జట్టు కొత్త కోచ్‌గా నియమించారు.

05/07/2016 - 06:40

జర్మనీ, మే 6: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యాన జర్మనీలోని సహ్ల్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత షూటర్లు మొత్తం పది పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. వీటిలో మూడు పసిడి పతకాలు, నాలుగు రజత పతకాలు, మరో మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.

05/07/2016 - 06:39

ముంబయి, మే 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ ఈ నెల 8వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో విశాఖపట్నంలో ఆడే తొలి మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయ.

05/06/2016 - 01:25

న్యూఢిల్లీ, మే 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు ఎట్టకేలకు మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో గురువారం ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఆతిథ్య ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది.

05/06/2016 - 01:23

న్యూఢిల్లీ, మే 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒక మ్యాచ్ నుంచి నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న తొమ్మిదో ఎడిషన్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ జట్టు తదుపరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటుకు పాల్పడితే కోహ్లీపై ఈ వేటు తప్పకపోవచ్చు.

05/06/2016 - 01:21

న్యూఢిల్లీ, మే 5: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడలకు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, జ్వాలా గుత్తా సహా ఏడుగురు భారత షట్లర్లు బెర్తులను ఖరారు చేసుకున్నారు. ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) గురువారం తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేయడంతో వీరికి అధికారికంగా ఒలింపిక్ బెర్తులు ఖరారయ్యాయి.

05/06/2016 - 01:17

హైదరాబాద్, మే 5: అయిదు రోజుల విశ్రాంతి తర్వాత నూతనోత్సాహంతో తొణికిసలాడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం సొంతగడ్డపై బలమైన గుజరాత్ లయన్స్‌ను ఢీకొనడానికి సిద్ధమవుతోందని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురువారం చెప్పాడు.

05/06/2016 - 01:15

మాడ్రిడ్, మే 5: స్పెయిన్‌లో జరుగుతున్న మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆరో సీడ్ క్రీడాకారిణి సిమోనా హాలెప్‌తో పాటు అన్‌సీడెడ్ క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవా సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వీరు తమతమ ప్రత్యర్థులపై చెమటోడ్చి విజయం సాధించారు.

05/06/2016 - 01:14

చెన్నై, మే 5: భారత స్క్వాష్ స్టార్ జోత్స్న చిన్నప్ప గురువారం తాజాగా విడుదలైన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 13వ ర్యాంకుకు చేరుకుంది. దీంతో ఆమె గత ఏడాది డిసెంబర్‌లో కోల్పోయిన ర్యాంకును మళ్లీ కైవసం చేసుకున్నట్లయింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత స్థానంలో నిలిచిన భారత క్రీడాకారిణి చిన్నప్పే.

05/05/2016 - 07:26

మాడ్రిడ్, మే 4: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో పెట్రా క్విటోవా ముందంజ వేసింది. రెండో రౌండ్‌లో ఆమె ఎలెనా వెస్నినాను 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసి మూడో రౌండ్కు దూసుకెళ్లింది. సిమోనా హాలెప్ 6-1, 6-1 స్కోరుతో కరిన్ నాప్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేయగా, తిమియా బసిన్‌స్కీ 6-4, 5-7, 6-4 స్కోరుతో ఎకతరిన మకరోవాపై గెలుపొందింది.

Pages