S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/07/2016 - 05:57

న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలోని వివిధ క్రీడా సంఘాల్లో పాలన అస్తవ్యస్తంగా మారిందని భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ)లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

01/07/2016 - 05:56

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బవూమా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను సెంచరీ సాధించి, అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున శతకాన్ని చేసిన తొలి నల్లజాతీయుడిగా అతని పేరు చరిత్ర పుటల్లో చేరింది.

01/07/2016 - 05:55

ముంబయి, జనవరి 6: క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మైలురాయిని అధిగమించిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన కెసి గాంధీ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆటగాడు ప్రణవ్ ధన్‌వాదేకు ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఐదేళ్లపాటు అతనికి నెలకు 10,000 రూపాయలు చొప్పున స్కాలర్‌షిప్‌ను ఎంసిఎ అధ్యక్షుడు శరద్ పవార్ మంజూరు చేశారు.

01/07/2016 - 05:55

కరాచీ, జనవరి 6: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అనుసరిస్తున్న వైఖరి పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇంగ్లాండ్ టూర్‌లో బుకీలతో కుమ్మక్కయి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన అప్పటి కెప్టెన్ సల్మాన్ బట్, ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అమీర్‌లపై సస్పెన్షన్ వేటును విధించిన పిసిబి ఇప్పుడు వారి విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నది. అమీర్‌ను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవడానికి చాలా కష్టపడింది.

01/07/2016 - 05:54

జ్యూరిచ్, జనవరి 6: జెరోమ్ వేక్‌పై విధించిన 90 రోజుల సస్పెన్షన్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) మరో 45 రోజులు పొడిగించింది. ఫిఫా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అతనిపై అవినీతి ఆరోపణలున్నాయి. అధ్యక్షుడు సెప్ బ్లాటర్‌తోపాటు వేక్‌ను కూడా ఫిఫా సస్పెండ్ చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో మూడు నెలల పాటు అతనిని నిషేధిస్తున్నట్టు ఫిఫా ప్రకటించింది.

01/07/2016 - 05:53

కరాచీ, జనవరి 6: పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్ కష్టాల్లో చిక్కుకున్నాడు. సుయ్ నార్తన్ గ్యాస్ జట్టుకు దేశవాశీ పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న అతను ఇటీవలే సస్పెన్షన్ వేటు నుంచి తృటిలో బయటపడ్డాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే, ఒక ప్రైవేటు పార్టీకి హాజరై, డాన్స్ చేస్తూ పోలీసు రైడింగ్‌లో పట్టుబడ్డాడు. అయితే, పోలీసులు అతనిపై జాలి చూపించారు.

01/07/2016 - 05:53

న్యూఢిల్లీ, జనవరి 6: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రక్షాళనకు ఉద్దేశించి లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలకు బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) సానుకూలంగా స్పందించింది. వీటిని అమలు చేయాలని బిసిసిఐని డిమాండ్ చేసింది. తక్షణమే లోధా కమిటీ సూచనలను అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సిఎబి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

01/07/2016 - 05:52

సిడ్నీ, జనవరి 6: ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న చివరి, మూడో టెస్టు మ్యాచ్‌ని వర్షం వెంటాడుతునే ఉంది. వరుసగా రెండో రోజు ఆట వర్షం కారణంగా వృథా అయింది. మొదటి రోజు ఆటను నిర్ణీత సమయానికి ముందుగానే నిలిపివేయగా, రెండో రోజు ఆటలో కేవలం 11.2 ఓవర్ల ఆట సాధ్యమైన విషయం తెలసిందే. అప్పటికి విండీస్ ఏడు వికెట్లకు 248 పరుగులు చేసగా, దనీష్ రాందీన్ (30), కెమర్ రోచ్ (0) నాటౌట్‌గా ఉన్నారు.

01/06/2016 - 07:06

ముంబయి, జనవరి 5: మొత్తం 323 బంతులు.. 59 సిక్సర్లు.. 129 ఫోర్లు.. 1,009 పరుగులు.. ఇది ఒక ఇన్నింగ్స్‌కు సంబంధించిన వివరాలుకావు. ఒక టీనేజర్ సాధించిన పరుగులు. 15 ఏళ్ల ప్రణవ్ ధనవాదే నెలకొల్పిన అరుదైన రికార్డు. భండారీ కప్ అంతర్ పాఠశాల క్రికెట్ టోర్నమెంట్‌లో ఆర్య గురుకుల్‌తో జరిగిన మ్యాచ్‌లో కెసి గాంధీ హయ్యర్ సెకండరీ స్కూల్ తరఫున ఆడిన ప్రణవ్ పరుగుల వరద పారించాడు.

01/06/2016 - 07:04

ముంబయి, జనవరి 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) క్రమశిక్షణ కమిటీ ఈనెల 18కి వాయిదా వేసింది. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అజిత్ చండీలా, ముంబయి మాజీ క్రికెటర్ హికేన్ షాతోపాటు ఈ కేలో పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్‌పై తీసుకునే చర్యలను ఖరారు చేయాల్సి ఉండింది.

Pages