S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/27/2016 - 05:58

ఉహన్ (చైనా), ఏప్రిల్ 26: చైనాలోని ఉహన్‌లో బుధవారం నుంచి ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, ‘తెలుగు తేజం’ పివి.సింధు సహా భారత్‌కు చెందిన పలువురు షట్లర్లు టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడలకు అర్హత పోటీల గడువు ముగియడానికి ముందు జరుగుతున్న చివరి ఈవెంట్ ఇదే.

04/27/2016 - 05:57

మాంచెస్టర్, ఏప్రిల్ 26: బ్రిటిష్ ప్రొఫెషనల్ బాక్సర్ అమీర్ ఖాన్‌తో స్వదేశంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నానని భారత స్టార్ విజేందర్ సింగ్ ప్రకటించాడు. గతంలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అమీర్ ఖాన్ త్వరలో భారత్‌లో విజేందర్‌తో తలపడాలని ఉందని వెల్లడించిన విషయం విదితమే. దీంతో అమీర్ సవాలును స్వీకరించి అతనితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని విజేందర్ స్పష్టం చేశాడు.

04/27/2016 - 05:56

వెల్లింగ్టన్, ఏప్రిల్ 26: ఈ ఏడాది చివర భారత్‌లో జరిపే పర్యటన సందర్భంగా గులాబీ రంగు బంతితో డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడే విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పరిశీలిస్తోంది. గత ఏడాది అడిలైడ్‌లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డే/నైట్ టెస్టు మ్యాచ్ జరిగిన విషయం విదితమే. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ ఇదే.

04/26/2016 - 00:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వ్యవహార శైలిపై సుప్రీం కోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ క్రికెట్‌లో గుత్త్ధాపత్యాన్ని చెలాయిస్తున్నారంటూ ఆగ్రహించింది. క్రికెట్‌ను చెప్పుచేతల్లో ఉంచుకొని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. బిసిసిఐ పాటిస్తున్న ద్వంద్వ వైఖరి కారణంగానే చాలా మంది యువకులకు సరైన అవకాశాలు దక్కడం లేదని వ్యాఖ్యానించింది.

04/26/2016 - 00:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారత రోయర్ దత్తు బాబన్ భొకానల్ ఈఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం దక్షిణ కొరియాలోని చుంగ్ జూలో జరిగిన ఆసియా/ ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ రెగెట్టాలో పురుషు సింగిల్స్ స్కల్స్ ఈవెంట్‌లో పోటీపడిన అతను రజత పతకాన్ని సాధించాడు. రెండు కిలోమీటర్ల దూరాన్ని 25 ఏళ్ల దత్తు 7 నిమిషాల 7.63 సెకన్లలో పూర్తి చేశాడు.

04/26/2016 - 00:45

హైదరాబాద్, ఏప్రిల్ 25: హోం గ్రౌండ్‌లో మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించనున్నాడు. సన్‌రైజర్స్‌కు నాయకత్వం వహిస్తున్న అతను అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించి, జట్టుకు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు.

04/26/2016 - 00:43

చండీగఢ్, ఏప్రిల్ 25: ఐపిఎల్‌లో సోమవారం డిఫెండింగ్ చాంపియన్ ముంబయిని ఇండియన్స్‌తో తలపడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పరుగుల వేటలో విఫలమైంది. 190 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బ్యాటింగ్‌కు ఉపక్రమించిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 164 పరుగులు చేయగలిగింది. పార్థీవ్ పాటిల్ 81, అంబటి రాయుడు 65 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో ముంబయి 6 వికెట్లకు 189 పరుగులు చేయగలిగింది.

04/26/2016 - 00:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్‌తో భారత్‌లోనే ఫైట్‌లో పాల్గొనాలని ఉందని బ్రిటిష్ బాక్సింగ్ స్టార్ అమీర్ ఖాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. అల్వెరెజ్‌తో మే 7న లాస్ వెగాస్‌లో జరిగే ఫైట్‌కు శాస్‌ఫ్రాన్సిస్కోలో శిక్షణ తీసుకుంటున్న అతను వీడియో కాలింగ్ ద్వారా భారత మీడియాతో మాట్లాడుతూ విజేందర్‌ను సమర్థుడైన బాక్సర్‌గా ప్రశంసించాడు.

04/26/2016 - 00:39

కరాచీ, ఏప్రిల్ 25: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్‌పై వేటు ఖాయమైంది. పాకిస్తాన్ కప్ జాతీయ వనే్డ టోర్నమెంట్‌లో ఖైబర్ ఫక్తున్కవా జట్టుకు యూనిస్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈటోర్నీలో భాగంగా ఒక గ్రూప్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అంపైర్ తీసుకున్న నిర్ణయంపై యూనిస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేగాక, మ్యాచ్ రిఫరీ తీరును కూడా నిరసించాడు.

04/26/2016 - 00:39

పుణె, ఏప్రిల్ 25: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టెఫెన్ ఫ్లెమింగ్ కోచ్‌గా, పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ పుణె రైజింగ్ సూపర్‌జెయింట్స్ అద్భుతాలేవీ సృష్టించడం లేదు. ఈసారి ఐపిఎల్‌లో కొత్తగా అడుగుపెట్టినప్పటికీ, కెప్టెన్, కోచ్‌తోపాటు చాలా మంది ఆటగాళ్లు కూడా పాతకాపులే.

Pages