S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/29/2016 - 08:36

మెల్బోర్న్, జనవరి 28: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో విజయపరంపరలను కొనసాగిస్తూ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఆమె నాలుగో సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కాను 6-0, 6-4 తేడాతో చిత్తుచేసింది.

01/29/2016 - 08:34

మీర్పూర్, జనవరి 28: అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో గురువారం ఐర్లాండ్‌ను ఢీకొన్న భారత్ 79 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ అర్ధ శతకాలతో రాణించడంతో, ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 268 పరుగుల చేయగలిగింది. సర్ఫరాజ్ 70 బంతులు ఎదుర్కొని 74, సుందర్ 71 బంతుల్లో 62 చొప్పున పరుగలు చేశారు.

01/29/2016 - 08:34

మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియా చేతిలో వనే్డ సిరీస్‌ను కోల్పోయిన భారత క్రికెట్ జట్టు టి-20 సిరీస్‌పై కనే్నసింది. మొదటి మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో విజయం సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. శుక్రవారం జరిగే రెండో టి-20లోనూ గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

01/29/2016 - 08:33

న్యూఢిల్లీ, జనవరి 28: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ)లో చోటు చేసకున్న అవకతవకలు, ఆర్థిక కుంభకోణాలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్)తో దర్యాప్తు చేయించాలని బిజెపి నుంచి సస్పెండైన పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ డిమాండ్ చేశాడు. గురువారం అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిడిసిఎ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించాడు.

01/28/2016 - 08:18

మెల్బోర్న్, జనవరి 27: స్విట్జర్లాండ్‌కు చెందిన మాజీ ప్రపంచ నంబర్ వన్ మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో వీరవిహారం చేస్తున్న భారత టెన్నిస్ బ్యూటీ, హైదరాబాదీ సానియా మీర్జా ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌లో స్థానం సంపాదించింది. ‘సాంటినా’గా పేరొందిన ఈ జోడీ బుధవారం నాటి సెమీ ఫైనల్‌లో జూలియా జార్జెస్, కరోలినా ప్లిస్కోవా జోడీని 6-1, 6-0 తేడాతో చిత్తుచేసింది.

01/28/2016 - 08:15

కాన్పూర్, జనవరి 27: దేవధర్ క్రికెట్ టోర్నమెం ట్‌లో భారత్ ’ఎ’ ఫైనల్ చేరింది. బుధవారం జరిగి న మ్యాచ్‌లో ఈ జట్టు విజయ్ హజారే ట్రోఫీ చాం పియన్ గుజరాత్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిం ది. పార్థీవ్ పటేల్ శతకం వృథాకాగా, గుజరాత్ అ నూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 49.2 ఓవర్లలో 272 ప రుగులు చేసి ఆలౌటైంది. పార్థీవ్ పటేల్ అద్భుత ఇ న్నింగ్స్ ఆడాడు.

01/28/2016 - 08:13

మెల్బోర్న్, జనవరి 27: ఇటీవల వెల్లువెత్తిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ప్రపంచ టెన్నిస్ అధికారులు నిర్ణయించారు. ఎటిపి, డబ్ల్యుటిఎ, ఐటిఎఫ్‌తోపాటు నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల కీలక అధికారులు బుధవారం ఇక్కడ సమావేశమై మ్యాచ్ ఫిక్సింగ్‌పై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఉందని, దర్యాప్తు జరిపించిన తర్వాత దోషులపై కఠినంగా వ్యవహరించాలని తీర్మానించారు.

01/28/2016 - 08:12

న్యూఢిల్లీ, జనవరి 27: రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు భారత ఏస్ షూటర్ హీనా సిద్ధు క్వాలిఫై అయంది. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సంపాదించేందుకు భారత షూటర్లు చివరి ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం నుంచి ఇక్కడ ప్రారంభమైన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీల్లో రాణించిన వారు రియోకు క్వాలిఫై అవుతారు. పురుషులు, మహిళల ట్రాప్, స్కీట్ విభాగాల్లో నాలుగేసి స్థానాలు రియోకు అందుబాటులో ఉంటాయి.

01/28/2016 - 08:12

జీబ్రాల్టర్, జనవరి 27: ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఇక్కడ ఆరంభమైన జీబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్ మాస్టర్స్ విభాగం తొలి రౌండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. 23 సంవత్సరాల తర్వాత మొదటిసా ఒక ఓపెన్ ఈవెంట్‌లో పాల్గొంటున్న అతను హంగెరీకి చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ జిడొనియా లజార్నే చేతిలో ఓటమిపాలయ్యాడు.

01/27/2016 - 05:31

మెల్బోర్న్, జనవరి 26: ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ చేతిలో రష్యాబ్యూటీ మరియా షరపోవా మరోసారి పరాజయాన్ని ఎదుర్కొంది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సెరెనా క్వార్టర్ ఫైనల్స్‌లో షరపోవాను 6-4, 6-1 తేడాతో చిత్తుచేసింది. సెరెనాకు షరపోవాపై ఇది వరుసగా 18వ విజయం కావడం గమనార్హం.

Pages