S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/03/2016 - 12:27

వెస్టిండీస్ జట్టు అంటే క్రిస్ గేల్ ఒక్కడే కాదని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు. శనివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ విండీస్‌లో గొప్ప ఆటగాళ్లు చాలా మందే ఉన్నారని చెప్పాడు. ఈ టోర్నమెంట్‌కు రాక ముందే తనకు విండీస్ సత్తా ఏమిటో తెలుసునని వ్యాఖ్యానించాడు. భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో విండీస్ విజయం సాధించిన తీరే ఆ జట్టు బలాన్ని తెలియ చేస్తున్నదని చెప్పాడు.

04/03/2016 - 12:25

కోల్‌కతా, ఏప్రిల్ 2: గత మూడు టి-20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకొని హ్యాట్రిక్ నమోదు చేసిన ఆస్ట్రేలియా మరోసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. అయితే, ఆ జట్టుకు వెస్టిండీస్ నుంచి సవాళ్లు ఎదురుకానున్నాయి. 2009లో మొదలైన మహిళల టి-20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. అయితే, ఆతర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం మొదలైంది.

04/03/2016 - 12:23

మియామీ, ఏప్రిల్ 2: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్, ‘జెయింట్ కిల్లర్’ కెయ్ నిషికొరి మధ్య జరిగే టైటిల్ పోరులో ఎవరు గెలుస్తాన్నది ఆసక్తికరంగా మారింది. గణాంకాలనుగానీ, ఫామ్‌నుగానీ పరిగణలోకి తీసుకుంటే జొకొవిచ్ టైటిల్ సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, నిషికొరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా చెలరేగడం, నిషికొరి అలవాటు.

04/03/2016 - 12:22

వెల్లింగ్టన్, ఏప్రిల్ 2: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా నుంచి న్యూజిలాండ్‌కు తరలి వెళ్లిన గ్రాంట్ ఇలియట్ వనే్డ ఇంటర్నేషనల్స్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, టి-20 ఫార్మెట్‌లో కొనసాగనున్నట్టు ఈ న్యూజిలాండ్ క్రికెటర్ ప్రకటించాడు. 37 ఏళ్ల ఇలియట్ భారత్‌లో జరుగుతున్న టి-20 వరల్డ్ కప్‌లోనూ పాల్గొన్నాడు. అయితే, కివీస్ సెమీ ఫైనల్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది.

04/03/2016 - 12:21

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: సిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. సెమీ ఫైనల్‌లో మూడో సీడ్ లీ జురుయ్‌తో తలపడిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా 20-22, 21-17, 19-21 తేడాతో ఓటమిపాలైంది.

04/03/2016 - 12:19

కరాచీ, ఏప్రిల్ 2: ఆసియా కప్, టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాకిస్తాన్ జట్టు దారుణంగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని 82 ఏళ్ల షహర్యార్ స్పష్టం చేశాడు.

04/02/2016 - 04:26

ముంబయి, ఏప్రిల్ 1: ప్రతి సారీ మీడియా వాళ్లు తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించడంతో విసిగిపోయిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం రాత్రి మీడియా సమావేశంలో అ ప్రశ్నకు విచిత్ర రీతిలో తనదైన శైలిలో స్పందించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ధోనీ దాడికి బలయింది ఒక ఆస్ట్రేలియా జర్నలిస్టు కావడం కాకతాళీయం.

04/02/2016 - 04:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: మన దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీలు నిర్వహించేందుకు గల అవకాశాలపై స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో శుక్రవారం చర్చలు జరిపాడు. అంతేకాకుండా న్యూఢిల్లీలో జూన్ 11వ తేదీన జరిగే డబ్ల్యుబిఓ ఆసియా టైటిల్ ఫైట్‌లో తన పోరాటాన్ని వీక్షించేందుకు రావలసిందిగా కేజ్రీవాల్‌ను విజేందర్ సాదరంగా ఆహ్వానించాడు.

04/02/2016 - 04:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రపంచ టి-20 టోర్నమెంట్‌లో మహేంద్ర సింగ్ ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్‌గా రాణించిన తీరును గమనించినట్లయితే అతను భారత జట్టు కెప్టెన్‌గా తన కెరీర్‌ను మరి కొనే్నళ్లు కొనసాగించగలడనిపిస్తోందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయ పడ్డాడు. ‘టి-20లో అతను ఫామ్‌లో ఉన్నాడనే నేను అనుకుంటున్నాను. అంటే ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్‌గా అని అర్థం.

04/02/2016 - 04:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్ర్తీ కాంట్రాక్టు ముగిసిందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ప్రకటించాడు. అయితే అతని కాంట్రాక్టును పొడిగించాలా? లేదా?

Pages