S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/17/2019 - 06:23

ఇండోర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. మూడోరోజు శనివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 213 పరుగులకే ఆలౌట్ కావడంతో కోహ్లీసేన ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలిచింది. అంతకుముందు భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌ను 493 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఈరోజు ఉదయం రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది.

11/17/2019 - 00:03

బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో శనివారం ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని పోలీసులు, పహారా సిబ్బందిని దాటుకొని చొక్కా లేకుండా ఒక్కసారిగా మైదానంలో కోహ్లీ వైపు దూసుకొచ్చాడు. అయతే కోహ్లీ అతడి భుజాన్ని తట్టడంతో భద్రతా సిబ్బంది అతడిని మైదానం నుంచి పక్కకు తీసుకెళ్లారు. కాగా, ఉత్తరాఖండ్‌కు చెందిన సూరజ్ బిస్త్‌గా పోలీసులు తెలిపారు.

11/17/2019 - 00:01

*చిత్రం... లండన్‌లోని ఓ2లో శుక్రవారం జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్స్ సింగిల్స్ టెన్నిస్ మ్యాచ్ ఫైనల్‌లో రష్యాకు చెందిన డేనియల్ మెద్వెదేవ్‌ను ఓడించిన అనంతరం జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్.

11/16/2019 - 23:58

పెర్త్, నవంబర్ 16: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండ్రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు డ్రా చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 386 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు రెండో రోజు ముగిసే స మయానికి 7 వికెట్లను కోల్పోయి 246 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది.

11/15/2019 - 04:47

ఇండోర్: స్వదేశంలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత బౌలింగ్ విభాగం అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 150 పరుగులకే కుప్పకూల్చి పులిపై స్వారీ చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మోమినుల్ హక్ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. 5వ ఓవర్ దాకా పరుగులు తీసేందుకు కష్టపడ్డ బంగ్లా ఓపెనర్లు ఆ తర్వాత నియంత్రణ కోల్పోయారు.

11/15/2019 - 04:43

బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్: షద్మాన్ ఇస్లాం (సీ) సాహా (బీ) ఇషాంత్ 6, ఇమ్రూల్ కైస్ (సీ) రహానే (బీ) ఉమేశ్ 6, మోమినుల్ హక్ (బీ) అశ్విన్ 37, మహ్మద్ మిథున్ (ఎల్బీడబ్ల్యూ) (బీ) షమీ 13, ముష్ఫీకర్ రహీం (బీ) షమీ 43, మహ్మదుల్లా (బీ) అశ్విన్ 10, లిటన్ దాస్ (సీ) కోహ్లీ (బీ) ఇషాంత్ 21, మెహిడీ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బీ) షమీ 0, తైజుల్ ఇస్లాం (రనౌట్, రవీంద్ర జడేజా/సాహా) 1, అబూ జాయేద్ (నాటౌట్) 7, ఎబదత్ హుస్సేన్ (

11/15/2019 - 04:39

దేశ మొదటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ జయంతి, చిల్ట్రన్స్ డేను పురస్కరించుకొని రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ) మైదానంలో గురువారం విద్యార్థులకు ఆటోగ్రాఫ్ ఇచ్చి సరదాగా వారితో ఫొటోలకు ఫోజులిచ్చిన టీమిండియా వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.

11/15/2019 - 04:37

బుకిత్ జలీల్ మైదానంలో గురువారం ఖాతర్ 2022 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయంగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై గెలిచిన ఆనందంలో మలేసియా ఆటగాళ్లు. పక్కనే నిరాశతో వెళ్తున్న థాయ్‌లాండ్ ఆటగాడు.

11/15/2019 - 04:34

చండీగఢ్, నవంబర్ 14: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గురువారం మహారాష్ట్ర జట్టుతో తలప డిన హైదరాబాద్ ఓటమి పాలైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 163 పరుగులు చేసింది. భవనక సందీప్ (55, నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించగా, హిమాలయ్ అగర్వాల్ (34), తన్మయ్ అగర్వాల్ (28) మాత్రమే ఫర్వాలేదని పించారు.

11/13/2019 - 23:20

ఇండోర్: ‘పసికూన’ ముద్ర వేయించుకున్న బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఇక్కడ ప్రా రంభం కానున్న మొదటి టెస్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా అన్ని విధాలా సిద్ధమైంది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, ప్రత్యర్థిని తక్కువ అంచనావేసి, ఆదమరిస్తే టీమిండియాకు ప్రమాదం తప్పదనేది వాస్తవం.

Pages