S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/11/2016 - 03:13

కరాచీ: కళంకిత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌ను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో కలగలిపేందుకు నానా తంటాలు పడుతున్న పాకిస్తాన్ సెలెక్టర్లు అతడికి త్వరలో జరుగనున్న ఆసియా కప్, ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్లలో తలపడే తమ జట్టులో చోటు కల్పించారు. అయితే అనుభవజ్ఞుడైన ఓపెనర్ అహ్మద్ షెహజాద్‌తో పాటు సీనియర్ బౌలర్ ఉమర్ గుల్‌కు ఈ జట్టులో స్థానమివ్వకుండా పాక్ సెలెక్టర్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

02/11/2016 - 03:13

లక్నో: ఎనిమిదేళ్ల క్రితం షాంఘై (చైనా)లో జరిగిన ప్రత్యేక ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు విశేష ప్రశంసలు తీసుకురావడంతో పాటు ‘స్పెషల్ అథ్లెట్’గా ఖ్యాతి పొందిన హమీద్ ప్రస్తుతం కూలిపని చేస్తూ అత్యంత దైన్య స్థితిలో జీవన పోరాటాన్ని సాగిస్తున్నాడు.

02/10/2016 - 06:34

గౌహతి: ఇక్కడ జరుగుతున్న దక్షిణాసియా క్రీడోత్సవాల్లో(శాగ్) వరసగా నాలుగో రోజు కూడా భారత్ క్రీడాకారులు బంగారు పంట పండించారు. మంగళవారం స్విమ్మింగ్, ఆర్చరీ, ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాల్లో ప్రకటించిన బంగారు పతకాల్లో దాదాపుగా అన్ని పతకాలను భారత క్రీడాకారులే దక్కించుకొని పతకాల పట్టికలో తిరుగులేని ఆధిక్యతతో అగ్రస్థానంలో నిలిచారు. దీంతో భారత్‌కు లభించిన మొత్తం పతకాల సంఖ్య 119కి చేరుకుంది.

02/10/2016 - 06:32

చండీగఢ్, ఫిబ్రవరి 9: ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదవ ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో తలపడే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్‌ను సారథిగా నియమించినట్లు మంగళవారం ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఐపిఎల్ నాలుగో ఎడిషన్ నుంచి మిల్లర్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

02/10/2016 - 06:30

కరాచీ, ఫిబ్రవరి 9: భారత్‌లో వచ్చే నెల నుంచి జరిగే ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనాలా? లేదా? అనే విషయంపై ఇటీవల దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సమావేశంలో చర్చించామని పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపాడు.

02/10/2016 - 06:28

సిడ్నీ, ఫిబ్రవరి 9: వచ్చే నెల నుంచి భారత్‌లో జరిగే ఐసిసి ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఇప్పటివరకూ ఆసీస్ టి-20 జట్టుకు సారథ్యం వహించిన ఆరోన్ ఫించ్‌ను పక్కకు తప్పించి సెలెక్టర్లు మంగళవారం ఫించ్‌ను కెప్టెన్‌గా నియమించారు. అలాగే వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కు బదులుగా పీటర్ నెవిల్‌ను జట్టులోకి తీసుకున్నారు.

02/10/2016 - 06:23

మీర్పూర్: ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో మూడుసార్లు చాంపియన్‌షిప్ సాధించిన భారత జట్టు మరోసారి టైటిల్‌కు చేరువైంది. మీర్పూర్ (బంగ్లాదేశ్)లోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన సెమీఫైనల్‌లో అన్మోల్‌ప్రీత్ సింగ్, సర్‌ఫ్రాజ్ ఖాన్ అర్థ శతకాలతో రాణించడంతో భారత అండర్-19 జట్టు 97 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించి ఈ టోర్నీలో ఐదోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

02/10/2016 - 06:20

పుణే, ఫిబ్రవరి 9: శ్రీలంక యువ జట్టుతో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటవగా, శ్రీలంక జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు సాధించి విజయ లక్ష్యాన్ని అధిగమించింది.

02/09/2016 - 06:48

గౌహతి, ఫిబ్రవరి 8: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ పతకాల వేట కొనసాగుతున్నది. ఆర్చర్లు, రెజ్లర్లు, వెయిట్‌లిఫ్టర్లు అద్భుతంగా రాణించి, పతకాలను అందించారు. మొత్తం మీద సోమవారం పోటీలు ముగిసే సమయానికి భారత్ 70 పతకాలతో తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. వీటిలో 46 స్వర్ణం, 18 రజతం, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.

02/09/2016 - 06:46

మీర్పూర్, ఫిబ్రవరి 8: అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా భారత జట్టు మంగళవారం షేర్ ఎ బంగ్లా జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరిగే సెమీ ఫైనల్‌లో తలపడేందుకు అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాలను నమోదు చేసిన భారత్ అదే దూకుడును కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.

Pages