S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/11/2016 - 06:50

లాస్ వెగాస్, ఏప్రిల్ 10: ఫిలిప్పీన్స్ బాక్సింగ్ వీరుడు మానీ పాక్వియావో తన చివరి ఫైట్‌లో గెలిచాడు. ప్రత్యర్థి టిమ్ బ్రాడ్లీపై విజయంతో ప్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 21 సంవత్సరాల కెరీర్ ఈ ఫైట్‌తో ముగిసిందని అతను ప్రకటించాడు. ఎంజిఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనాలో జరిగిన ఈ ఫైట్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుందన్న అభిమానుల అంచనాలను నిజం చేస్తూ ఇద్దరు బాక్సర్లు చక్కటి ప్రతిభ కనబరిచారు.

04/11/2016 - 06:50

షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 10: మలేసియా ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రచానొక్ ఇంతనాన్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె తాయ్ జూ ఇంగ్‌ను 21-14, 21-15 తేడాతో నేరు సెట్లలో సులభంగా ఓడించింది. ఇటీవలే థాయిలాండ్ ఓపెన్, ఇండియన్ ఓపెన్ టోర్నీల్లో విజేతగా నిలిచిన ఇంతనాన్ మరోసారి సత్తా చాటింది. కెరీర్‌లో 13వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

04/11/2016 - 06:48

మొహాలీ, ఏప్రిల్ 10: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కొత్తగా రంగ ప్రవేశం చేసిన గుజరాత్ లయన్స్‌తో సోమవారం జరిగే తొలి పరీక్షకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సిద్ధమవుతున్నది. గత ఏడాది దారుణంగా విఫలమైన పంజాబ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. వేధిస్తున్న పాత జ్ఞాపకాల నుంచి బయటపడి, తొలి మ్యాచ్‌లో గెలవడం ద్వారా శుభారంభం చేయాలని పంజాబ్ భావిస్తున్నది. ఈసారి వేలంలో పంజాబ్ చెప్పుకోదగ్గ ఆటగాళ్లను తీసుకోలేదు.

04/11/2016 - 06:45

ముంబయి, ఏప్రిల్ 10: మహారాష్టల్రో నెలకొన్న నీటి ఎద్దడి, కరవు పరిస్థితులకు ఐపిఎల్ మ్యాచ్‌ల తరలింపు పరిష్కారం కాబోదని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు నాయకత్వం వహిస్తున్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. ఆదివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ మహారాష్టల్రోని కరువు పరిస్థితి పట్ల ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారని అన్నాడు.

04/10/2016 - 07:12

ముంబయి, ఏప్రిల్ 9: తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో కొత్త జట్టుకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని సాధించి బోణీ చేశాడు. అతని నాయకత్వంలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తొమ్మిది వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను చిత్తుచేసింది.

04/10/2016 - 06:17

షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 9: మలేసియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్, ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఆమె ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జూ ఇంగ్ (చైనీస్ తైపీ) చేతిలో 19-21, 13-21 తేడాతో ఓటమిపాలైంది.

04/10/2016 - 06:10

కోల్‌కతా, ఏప్రిల్ 9: స్పిన్నర్ రితిక్ చటర్జీ క్రికెట్ చరిత్ర లోనే అరుదైన ఫీట్‌ను ప్రదర్శించాడు. మొహమ్మదాన్ స్పో ర్టింగ్‌తో జరిగిన రెండు రోజుల ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భవానీ పూర్ క్లబ్ తరఫున ఆడిన అతను 2.2 ఓవర్లు బౌల్ చేసి ఒ క్క పరుగు కూడా ఇవ్వకుండా ఆరు వికెట్లు పడగొట్టాడు. అయతే, ఫస్ట్‌క్లాస్ డివిజన్‌లో శ్యామ్ సుందర్ ఘోష్ రికా ర్డును అతను సమం చేయలేకపోయాడు.

04/10/2016 - 06:10

రియో డి జెనీరో, ఏప్రిల్ 9: స్టార్ ఆటగాడు నేమార్ అవసరం తమకు ఉందని, అందుకే అతనిని అందుబాటులో ఉంచాలని బ్రెజిల్ చేసిన విజ్ఞప్తికి బార్సిలోనా సానుకూలంగా స్పందించింది. కోపా అమెరికా కాంటెనారియో, రియో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాలు లేవన్న వార్తలు వెలుడ్డాయి. దీనిపై బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య స్పందిస్తూ నేమార్ అవసరం తమకు ఉందని, అందుకే అతనిని అందుబాటులో ఉంచాలని బార్సిలోనాకు లేఖ రాసింది.

04/10/2016 - 06:09

కోల్‌కతా, ఏప్రిల్ 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొనేందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ సిద్ధంగా ఉంది. రెండు జట్లలోనూ చాలా మంది హేమాహేమీలు ఉన్నప్పటికీ, అందరి కళ్లూ కార్లొస్ బ్రాత్‌వెయిట్‌పైనే కేంద్రీకృతమయ్యాయి. అతను ఏ విధంగా రాణిస్తాడన్నది ఉత్కంఠ రేపుతోంది.

04/10/2016 - 06:09

నవీ ముంబయి, ఏప్రిల్ 9: ఐపిల్ మ్యాచ్‌లు మరో ప్రాంతానికి తరలిపోతే ఎంత నష్టం వస్తుంది? కోట్ల రూపాయల్లోనే గండి పడుతుందని, ఈ మొత్తం కనీసం వంద కోట్ల రూపాయలు ఉంటుందని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ఒకవేళ మ్యాచ్‌లు మరో ప్రాంతానికి తరలి వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంఘ్రతి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేయా, ఠాకూర్ మాత్రం భారీ నష్టం తప్పదని హెచ్చరించాడు.

Pages