S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/11/2016 - 06:54

గుడివాడ, జనవరి 10: కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ జాతీయ గ్రామీణ క్రీడా పోటీల అండర్-16 అథ్లెటిక్స్ విభాగంలో వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పతకాల కోసం హోరాహోరీగా తలపడుతున్నారు.

01/11/2016 - 06:54

దుబాయ్, జనవరి 10: ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌ని గెలిస్తేనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతుంది. పాయింట్ల పట్టికలో ఆసీస్ మొత్తం 127 పాయింట్లు సంపాదించి అగ్రస్థానాన్ని ఆగ్రమించింది. భారత్ 114 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

01/11/2016 - 06:53

అక్లాండ్, జనవరి 10: శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండవ, చివరి టి-20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. కొలిన్ మున్రో మెరుపు ఇన్నింగ్స్ కివీస్‌కు మరో 60 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందించింది.

01/10/2016 - 05:00

బ్రిస్బేన్, జనవరి 9: ప్రపంచ మాజీ నంబర్ వన్ మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్‌లో పోటీపడుతున్న భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ ఓపెన్ ఇంటర్నేషనల్ డబ్ల్యుటిఎ ఫైనల్‌లో సానియా, హింగిస్ జోడీ 7-5, 6-1 తేడాతో ఏంజెలిక్ కెర్బర్, ఆండ్రియా పెట్కోవిచ్ జోడీపై సులభంగా గెలిచింది.

01/10/2016 - 04:57

పెర్త్, జనవరి 9: వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో ఆదివారం జరిగిన రెండో వామప్ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయభేరి మోగించింది. రోహిత్ శర్మ, మనీష్ పాండే అర్ధ శతకాలతో రాణించగా, 249 పరుగులు చేయగలిగిన భారత్ ఆతర్వాత వెస్టర్న్ ఆస్ట్రేలియాను 185 పరుగులకే ఆలౌట్ చేసి 64 పరుగుల తేడాతో గెలిచింది.

01/10/2016 - 04:57

షిల్లాంగ్, జనవరి 9: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భాగంగా బాడ్మింటన్ పోటీలపై ఉత్కంఠ నెలకొంది. ఈ పోటీలకు అస్సాం, మణిపూర్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. తొలుత షిల్లాంగ్‌కు కేటాయించిన బాడ్మింటన్ పోటీలను ఆతర్వాత గువహతికి తరలించడాన్ని మణిపూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

01/10/2016 - 04:56

గుడివాడ, జనవరి 9: జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణతో ప్రాంతీయ భావాలను పారదోలి దేశవ్యాప్తంగా ఉన్న 120కోట్ల మంది ప్రజల్లో జాతీయ భావాన్ని ప్రతిబింబిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు.

01/10/2016 - 04:55

మెల్బోర్న్, జనవరి 9: భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందని ఒక పత్రికకు రాసిన వ్యాసంలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ తక్కువగా ఉన్నారని పేర్కొన్నాడు. అదే విధంగా భారత జట్టులోని ఫాస్ట్ బౌలర్లు బంతి విపరీతంగా బౌన్స్ అయ్యే అవకాశం ఉన్న ఆసీస్ పిచ్‌లపై ఏవిధంగా రాణిస్తారన్నది అనుమానంగానే ఉందన్నాడు.

01/10/2016 - 04:55

వడోదర, జనవరి 9: ముస్తాక్ అలీ ట్రోఫీ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్వార్టర్ ఫైనల్ చేరింది. శనివారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఈ జట్టు గోవాను రెండు పరుగుల తేడాతో గోవాను ఓడించింది. ఢిల్లీ 19.2 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌట్‌కాగా, అనంతరం గోవా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 89 పరుగులు చే యగలిగింది. సౌరభ్ బండేకర్ అజేయంగా 31 ప రుగులు చేసినా గోవాను గెలిపించలేకపోయాడు.

01/09/2016 - 05:51

పెర్త్, జనవరి 8: పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు శుక్రవారం పెర్త్‌లోని డబ్ల్యుఎసిఎ (వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్) గ్రౌండ్‌లో జరిగిన తొలి ట్వంటీ-20 సన్నాహక మ్యాచ్‌లో శుభారంభం చేసింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టుతో జరిగిన ఈ డే/నైట్ మ్యాచ్‌లో ధోనీ సేన 74 పరుగులతో విజయం సాధించి తమ పర్యటనను ఘనంగా ఆరంభించింది.

Pages