S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/10/2016 - 04:55

వడోదర, జనవరి 9: ముస్తాక్ అలీ ట్రోఫీ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్వార్టర్ ఫైనల్ చేరింది. శనివారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఈ జట్టు గోవాను రెండు పరుగుల తేడాతో గోవాను ఓడించింది. ఢిల్లీ 19.2 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌట్‌కాగా, అనంతరం గోవా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 89 పరుగులు చే యగలిగింది. సౌరభ్ బండేకర్ అజేయంగా 31 ప రుగులు చేసినా గోవాను గెలిపించలేకపోయాడు.

01/09/2016 - 05:51

పెర్త్, జనవరి 8: పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు శుక్రవారం పెర్త్‌లోని డబ్ల్యుఎసిఎ (వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్) గ్రౌండ్‌లో జరిగిన తొలి ట్వంటీ-20 సన్నాహక మ్యాచ్‌లో శుభారంభం చేసింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టుతో జరిగిన ఈ డే/నైట్ మ్యాచ్‌లో ధోనీ సేన 74 పరుగులతో విజయం సాధించి తమ పర్యటనను ఘనంగా ఆరంభించింది.

01/09/2016 - 05:48

న్యూఢిల్లీ, జనవరి 8: ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ 14వ ఎడిషన్ టోర్నమెంట్ శనివారం నుంచి ఇక్కడి లుడ్లో క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రారంభం కానుంది. ఈసారి రికార్డు స్థాయిలో దేశ, విదేశాలకు చెందిన 1,400 మందికి పైగా ఆటగాళ్లు ఈ ఈవెంట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 35 లక్షల రూపాయల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఆటగాళ్లంతా మూడు కేటగిరీల్లో తలపడతారు.

01/09/2016 - 07:45

అనంతపురం, జనవరి 8: భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి అరెస్టు నాన్-బెయలబుల్ వారెంట్ జారీ చేస్తూ అనంతపురం జిల్లా అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి గీతావాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

01/09/2016 - 05:46

బ్రిస్బేన్, జనవరి 8: అద్భుత విజయాలతో గత సీజన్‌ను ఘనంగా ముగించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) నూతన సంవత్సరంలోనూ తమ అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ సెమీఫైనల్ పోరులో శుక్రవారం వీరిద్దరూ వరుసగా 25వ విజయాన్ని అందుకుని ఫైనల్‌కు దూసుకెళ్లారు.

01/09/2016 - 05:45

నల్లజర్ల, జనవరి 8: జాతీయస్థాయి క్రీడలను 2018లో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్ కప్ క్రీడాపోటీలను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

01/09/2016 - 05:44

చెన్నై, జనవరి 8: చెన్నైలో జరుగుతున్న ఎయిర్‌సెల్ ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో హ్యాట్రిక్ టైటిల్‌పై కనే్నసిన స్విట్జర్లాండ్ క్రీడాకారుడు స్టానిస్లాస్ వావ్రింకా మరోసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు.

01/08/2016 - 13:50

అనంతపురం : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి అనంతపురం కోర్టు నాన్‌బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2013లో బిజినెస్ టుడే మ్యాగజైన్‌లో విష్ణుమూర్తి అవతారంలో ధోని పాదరక్షలు పట్టుకున్న చిత్రం ప్రచురితమైంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

01/08/2016 - 08:20

సిడ్నీ, జనవరి 7: రెండు రోజులకుపైగా ఆట వర్షం కారణంగా రద్దుకాగా, డ్రా అనివార్యంగా మారిన చివరిదైన మూడో టెస్టు చివరి రోజున ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మెరుపు శతకాన్ని నమోదు చేశాడు. మొదటి రోజు ఆట చివరిలో వర్షం కురవగా, రెండో రోజు ఆటలో కేవలం 11.2 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆటను అర్ధాంతరంగా నిలిపివేసే సమయానికి వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 247 పరుగులు చేసింది.

01/08/2016 - 08:18

న్యూఢిల్లీ, జనవరి 7: స్వీడన్‌లోని సావ్జోలో జరుగుతున్న స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రీలో భారత ఏస్ షూటర్ అపూర్వీ చండీలా వరుసగా రెండో రోజు రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, మహిళల 10 మీటర్ల ట్రై-సిరీస్ ఈవెంట్‌లో 23 ఏళ్ల అపూర్వీ 208.9 పాయింట్లు సంపాదించి స్వర్ణ పతకాన్ని అందుకుంది.

Pages