S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/11/2016 - 08:00

చివరి మ్యాచ్‌లో ఓడిన సౌతాఫ్రికా

03/11/2016 - 07:59

నాగపూర్, మార్చి 10: టి-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ గ్రూప్ ‘బి’ మొదటి రౌండ్‌లో స్కాట్‌లాండ్‌ను ఢీకొన్న జింబాబ్వే 11 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. సీన్ వియల్స్ 36 బంతుల్లో, ఆరు ఫోర్లతో 53 పరుగులు సాధించాడు. స్కాట్‌లాండ్ బౌలర్లలో అలిస్టర్ ఇవాన్స్, మార్క్ వాట్, సఫియాన్ షరీఫ్ తలా రెండేసి వికెట్లు కూల్చారు.

03/11/2016 - 07:59

న్యూఢిల్లీ, మార్చి 10: టి-20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లందరికీ టోకుగా డోప్ పరీక్షలను నిర్వహించనున్నారు. అయితే, నిషిద్ధ మెల్డోనియం ఔషధాన్ని వినియోగించి డోప్ పరీక్షలో దొరికిపోయానంటూ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా చేసిన సంచలన ప్రకటనతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్వహించే డోప్ పరీక్షకు ఎలాంటి సంబంధం లేదని టోర్నమెంట్ డైరెక్టర్ ఎంవి శ్రీ్ధర్ స్పష్టం చేశాడు.

03/11/2016 - 07:59

ముంబయిని ఓడించి ఇరానీ కప్ కైవసం

03/11/2016 - 07:58

బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్, మలేసియా స్టార్ ఆటగాడు. లీ చాంగ్ వెయ్‌కి భారత యువ షట్లర్ సాయి ప్రణీత్ షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో అతను 24-22, 22-20 తేడాతో చాంగ్ వెయ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. అతను రాజీవ్ ఊసెఫ్‌పై 21-17, 21-12 స్కోరుతో గెలుపొందాడు.

03/11/2016 - 07:58

బర్మింగ్‌హామ్, మార్చి 10: గాయాల కారణంగా పలు టోర్నీలకు గైర్హాజరైన ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మొదటి రౌండ్‌లో మిచెలె లీని 21-17, 21-12 తేడాతో ఓడిం చింది. రెండో రౌండ్‌లో బుసానన్ ఆన్‌బుంరంగ్‌ను 21-16, 21-9 తేడాతో చిత్తుచేసి ముందంజ వేసింది.
సింధు అవుట్

03/10/2016 - 06:46

కోల్‌కతా: వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత క్రికెట్ జట్టు టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగే వామప్ మ్యాచ్‌కి సిద్ధమైంది. అన్ని విభాగాల్లోనూ పట్టిష్టంగా ఉన్న కారణంగా, బెంచ్ బలాన్ని బేరీజు వేసుకోవడానికి ఈ మ్యాచ్‌ని ఒక వేదికగా స్వీకరించాలని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే అతను కొన్ని ప్రయోగాలు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.

03/10/2016 - 06:44

కోల్‌కతా: ఉత్కంఠ రేపుతున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన టి-20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్ కోల్‌కతాలోనీ ఈడెన్ గార్డెన్స్‌కు మారింది. ధర్మశాలలో మ్యాచ్ జరిగే భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ చేతులెత్తేయగా, అవసరమైతే పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

03/10/2016 - 06:43

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ వైఖరి వల్లే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో ఈనెల 19న జరగాల్సిన టి-20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్‌పై చివరి వరకూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తాడు. ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నీ షెడ్యూల్ ఏడాది క్రితమే ఖరారైందని, ఆరు నెలల ముందు వేదికలను కూడా ప్రకటించామని విలేఖరులతో మాట్లాడిన అతను గుర్తుచేశాడు.

03/10/2016 - 06:41

న్యూఢిల్లీ: ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ కోల్‌కతాకు మారడాన్ని పిసిబి స్వాగతించింది. ఈ మార్పుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అయతే, జట్టును భారత్‌కు పంపేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు బుధవారానికే ఇక్కడికి చేరుకోవాలి. 17న ధర్మశాలకు బయలుదేరాలి.

Pages