S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/08/2016 - 07:30

న్యూఢిల్లీ: ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య టి-20 వరల్డ్ కప్ మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశాడు. ధర్మశాల లేదా న్యూఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్‌లను మరో కేంద్రానికి మార్చే ఆలోచన ఐసిసికి లేదని తేల్చిచెప్పాడు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని అన్నాడు.

03/08/2016 - 07:30

లండన్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత బాడ్మింటన్ స్టార్ సైనా సిద్ధమైంది. ఫిట్నెస్ సమస్యతో ఇటీవల కాలంలో పలు టోర్నీలకు దూరమైన సైనా క్వాలిఫయర్స్‌తో మంగళవారం నుంచి ఆరంభం కానున్న ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో పాల్గొననుంది. ప్రస్తుతం తనకు ఎలాంటి సమస్యలు లేవని సైనా తెలిపింది.

03/08/2016 - 07:28

నాగపూర్: టి-20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ప్రపంచ నంబర్ వన్ జట్టుగా బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్ మొత్తం 127 పాయింట్లతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా చెరి 118 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.

03/08/2016 - 07:28

ధర్మశాల: ధర్మశాలలో ఈనెల 19న జరిగే మ్యాచ్ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన పాకిస్తాన్ భద్రతా బృందం సోమవారం వాఘా సరిహద్దు మీదుగా అమృత్‌సర్‌కు వచ్చి, అక్కడి నుంచి ధర్మశాల చేరుకుంది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ లాహోర్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెక్యూరిటీ ఆఫిసర్ విశ్రాంతి కల్నల్ అజాం ఖాన్ ఈ బృందంలో ఉన్నారు.

03/07/2016 - 05:22

మీర్పూర్: వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కావడంతో 15 ఓవర్లకు కుదించిన ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొన్న భారత్ సునాయాస విజయాన్ని సాధించి సత్తా చాటింది. చాలకాలంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతువన్న శిఖర్ ధావన్ అర్ధ శతకంతో రాణించగా, విరాట్ కోహ్లీ అతనికి చక్కటి సహకారాన్ని అందించాడు.

03/07/2016 - 05:20

ముంబయి: అవినీతికి ఏ విధంగానూ తావులేని రీతిలో టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక విభాగం (ఎసియు) చీఫ్ సర్ రూనీ ఫ్లానగన్ ధీమా వ్యక్తం చేశాడు.

03/07/2016 - 05:19

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్ మన దేశంలో అభివృద్ధి చెందాలంటే ముందుగా వారు ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉంటుందని భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయ

03/07/2016 - 05:15

బార్సిలోనా: స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో విజృంభణ స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగా మ్యాచ్‌లో సెల్టా విగోపై రియల్ మాడ్రిడ్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. రొనాల్డో హ్యాట్రిక్ సాయంతో మొత్తం నాలుగు గోల్స్ సాధించి రియల్ మాడ్రిడ్‌ను 7-1 తేడాతో గెలిపించాడు.

03/07/2016 - 05:14

ముంబయి: జై బిస్తా సెంచరీతో రాణించడంతో, రెస్ట్ఫా ఇండియాతో ఆదివారం ప్రారంభమైన ఐదు రోజుల ఇరానీ కప్ ట్రోఫీ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబయి తన తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 359 పరుగులు సాధించింది. ఓపెనర్ అఖిల్ హెవాద్కర్‌తో కలిసి బిస్తా తొలి వికెట్‌కు 193 పరుగులు జోడించాడు. 90 బంతులు ఎదుర్కొన్న అతను 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 104 పరుగులు చేశాడు.

03/07/2016 - 05:13

కరాచీ: భారత్‌లో జరిగే టి-20 క్రికెట్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు వెళ్లొద్దంటూ మహిళా జట్టుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) హుకుం జారీ చేసింది. పురుషులతోపాటు మహిళల విభాగంలోనూ టి-20 వరల్డ్ కప్ భారత్‌లో జరుగుతుంది. సనా మీర్ నాయకత్వంలోని పాక్ మహిళల క్రికెట్ జట్టు ఈ టోర్నీకి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నది. అయితే, ఈ జట్టును భారత్‌కు పంపరాదని పిసిబి హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది.

Pages