S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/27/2016 - 05:33

న్యూఢిల్లీ, మార్చి 26: మహిళల టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఆస్ట్రేలియా మరో 40 బంతులు మిగిలి ఉండగానే, ఏడు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 91 పరుగులు సాధించింది. క్లారే షిల్లింగ్‌టన్ 22, సెసలియా జాయిస్ 23, కిమ్ గార్త్ 27 పరుగులతో రాణించారు.

03/27/2016 - 05:28

మొహాలీ, మార్చి 26: బ్యాటింగ్ విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుందని, వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో తమ బ్యాట్స్‌వి మెన్ రాణిస్తారన్న నమ్మకం తనకు ఉందని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నది. మహిళల టి-20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరాలంటే, విండీస్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాలి. ఆ మ్యా చ్‌ని చేజార్చుకుంటే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమిస్తుంది.

03/27/2016 - 05:32

మియామీ, మార్చి 26: మియామీ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ విక్టోరియా అజరెన్కా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇటీవల జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఆమె రెండో రౌండ్‌లో 6-2, 6-4 తేడాతో మోనికా పగ్‌పై విజయం సాధించింది.

03/26/2016 - 04:22

మొహాలీ, మార్చి 25: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరాలన్న ఆశలను ఆస్ట్రేలియా సజీవంగా నిలబెట్టుకుంది. మొహాలీలోని ఐఎస్.బింద్రా స్టేడియంలో శుక్రవారం గ్రూప్-2లో జఠిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది.

03/26/2016 - 04:21

నాగ్‌పూర్, మార్చి 25: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న వెస్టిండీస్ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించిన ఆ జట్టు తాజాగా శుక్రవారం నాగ్‌పూర్‌లో ఉత్కంఠ భరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించి ‘హ్యాట్రిక్’తో సత్తా చాటుకోవడంతో సెమీఫైనల్ బెర్తు ఖరారైంది.

03/26/2016 - 04:20

మియామీ, మార్చి 25: టెన్నిస్ రంగం పెద్దగా డోపింగ్ సమస్యను ఎదుర్కోవడం లేదని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ అభిప్రాయ పడరతూ, అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రగ్ పరీక్షల ప్రోటోకాల్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు.

03/26/2016 - 04:20

గోరఖ్‌పూర్, మార్చి 25: ఐసిసి ప్రపంచ టి-20 టోర్నమెంట్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించిన చివరి ఓవర్ ఓ భారత అభిమాని ప్రాణాలను బలిగొంది. అనూహ్య పరిణామాలతో నిండిన ఆ ఓవర్‌లో అందరూ ఓడిపోతుందని భావించిన భారత్ చివరికి ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

03/26/2016 - 04:19

మియామీ, మార్చి 25: అమెరికాలో జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ బ్యూటీ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) శుభారంభాన్ని సాధించారు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో లారా అరువాబరెనా (స్పెయిన్), రలుకా ఒలారు (రొమేనియా) జోడీని మట్టి కరిపించారు.

03/26/2016 - 04:18

మొహాలీ, మార్చి 25: ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత క్రికెట్ నుంచి రిటైర్ కావడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ షహీద్ అఫ్రిదీ శుక్రవారం స్పష్టం చేశాడు.

03/26/2016 - 04:17

ఆక్లాండ్, మార్చి 25: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుక్రవారం భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. జ్వాలా గుత్త, అశ్వనీ పొన్నప్ప సహా భారత జంటలన్నీ తమతమ ప్రత్యర్థుల చేతిలో వరుస గేముల తేడాతో ఓటముల పాలవడమే ఇందుకు కారణం. దీంతో ఈ టోర్నీలో భారత్ పోరు ముగిసింది.

Pages