S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/01/2016 - 05:29

తిరువనంతపురం, డిసెంబర్ 31: భారత జట్టు శాఫ్ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఈ జట్టు మాల్దీవ్స్‌ను 3-2 తేడాతో ఓడించింది. జేజె లాల్పెక్లువా అత్యంత కీలకమైన రెండు గోల్స్ చేసి భారత్‌ను గెలిపించాడు. మ్యాచ్ 25వ నిమిషంలో కెప్టెన్ సునీల్ చత్రీ ద్వారా భారత్‌కు తొలి గోల్ లభించింది. 34వ నిమిషంలో జేజె చేసిన గోల్‌తో భారత్ 2-0 ఆధిక్యాన్ని అందుకుంది.

01/01/2016 - 05:28

మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై గెలుపు

01/01/2016 - 05:27

మాడ్రిడ్, డిసెంబర్ 31: అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ బార్సిలోనా తరఫున 500వ మ్యాచ్ ఆడిన క్రీడాకారుడిగా అరుదైన గుర్తింపు సంపాదించాడు. లా లిగాలో భాగంగా రియల్ బెటిస్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా 4-0 తేడాతో విజయభేరి మోగించగా మెస్సీ ఒక గోల్ చేశాడు. సౌరెజ్ రెండు గోల్స్‌తో రాణించాడు. మ్యాచ్ 29వ నిమిషంలో బెటిస్ ఆటగాడు వెస్టర్మన్ ఓన్ గోల్ చేయడంతో బార్సిలోనా గోల్స్ ఖాతా ఆరంభమైంది.

01/01/2016 - 05:26

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఈ ఏడాది చివరి ప్రపంచ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. నాలుగు దశాబ్దాల తర్వాత భారత బౌలర్‌కు తొలిసారి టెస్టు బౌలింగ్ విభాగంలో నంబర్ వన్ స్థానం లభించడం విశేషం. తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ను కూడా ఇబ్బంది పెడుతున్న రవిచంద్ర న్ అశ్విన్ నంబర్ వన్‌గా నిలవగా, బ్యాటింగ్ విభాగంలో టాప్ పొజిషన్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఆక్రమించాడు.

01/01/2016 - 05:25

దుబాయ్, డిసెంబర్ 31: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ టెస్టు బ్యాటింగ్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. అతు 899 పాయింట్లు సంపాదించగా, ఫిబ్రవరిలో బ్రెండన్ మెక్‌కలమ్ రిటైర్‌కానుండగా, అతని స్థానంలో న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్న కేన్ విలియమ్‌సన్ 889 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ 888 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

01/01/2016 - 05:25

మాడ్రిడ్, డిసెంబర్ 31: రియల్ బెటిస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు బార్సిలోనా ఆటగాళ్లు ఈఏడాది తాము సాధించిన ట్రోఫీలతో ఫొటోలు దిగారు. 2015లో ఈ జట్టు స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాతోపాటు కోపా డెల్ రే, యూఫా చాంపియన్స్ లీగ్, యూఫా సూపర్ కప్, అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) క్లబ్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ టైటిళ్లను సాధించింది.

01/01/2016 - 05:30

మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణి అవార్డును పొందిన మిథాలీ రాజ్. హైదరాబాద్‌కు చెందిన మిథాలీ భారత్ తరఫున పలు రికార్డులను నెలకొల్పింది. అత్యుత్తమ క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించింది.

01/01/2016 - 05:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బిసిసిఐ అవార్డు లభించింది. ఈఏటి మేటి క్రికెటర్‌గా అతు అవార్డును సొంతం చేసుకున్నాడు. జనవరి 5న ముంబైలో జరిగే కార్యక్రమంలో అతను అవార్డును స్వీకరిస్తాడు. మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మిథాలీ రాజ్‌కు లభించింది.

12/31/2015 - 16:20

న్యూఢిల్లీ:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. ఈ ఏడాది విశేషంగా రాణించిన కోహ్లికి పురుషుల కేటగిరీలో ఈ అవార్డు దక్కగా.. మహిళా కేటగిరీలో ఇచ్చే బెస్ట్ వుమెన్స్ అవార్డును మిథాలీ రాజ్ గెలుచుకుంది. 2015లో మెన్స్, వుమెన్స్ క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా బీసీసీఐ తమ వార్షిక అవార్డులను ప్రకటించింది.

12/31/2015 - 06:38

దర్బన్, డిసెంబర్ 30: మోయిన్ అలీ స్పిన్ బౌలింగ్ ప్రతిభ దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ ముగిసిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్‌కు 241 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందించింది. విజయానికి రెండో ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయాల్సి ఉండగా, మంగళవారం ఆఠ ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన బుధవారం ఉదయం ఆటను కొనసాగించి 174 పరుగులకు ఆలౌటైంది.

Pages