S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/07/2016 - 05:20

ముంబయి: అవినీతికి ఏ విధంగానూ తావులేని రీతిలో టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక విభాగం (ఎసియు) చీఫ్ సర్ రూనీ ఫ్లానగన్ ధీమా వ్యక్తం చేశాడు.

03/07/2016 - 05:19

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్ మన దేశంలో అభివృద్ధి చెందాలంటే ముందుగా వారు ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉంటుందని భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయ

03/07/2016 - 05:15

బార్సిలోనా: స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో విజృంభణ స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగా మ్యాచ్‌లో సెల్టా విగోపై రియల్ మాడ్రిడ్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. రొనాల్డో హ్యాట్రిక్ సాయంతో మొత్తం నాలుగు గోల్స్ సాధించి రియల్ మాడ్రిడ్‌ను 7-1 తేడాతో గెలిపించాడు.

03/07/2016 - 05:14

ముంబయి: జై బిస్తా సెంచరీతో రాణించడంతో, రెస్ట్ఫా ఇండియాతో ఆదివారం ప్రారంభమైన ఐదు రోజుల ఇరానీ కప్ ట్రోఫీ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబయి తన తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 359 పరుగులు సాధించింది. ఓపెనర్ అఖిల్ హెవాద్కర్‌తో కలిసి బిస్తా తొలి వికెట్‌కు 193 పరుగులు జోడించాడు. 90 బంతులు ఎదుర్కొన్న అతను 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 104 పరుగులు చేశాడు.

03/07/2016 - 05:13

కరాచీ: భారత్‌లో జరిగే టి-20 క్రికెట్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు వెళ్లొద్దంటూ మహిళా జట్టుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) హుకుం జారీ చేసింది. పురుషులతోపాటు మహిళల విభాగంలోనూ టి-20 వరల్డ్ కప్ భారత్‌లో జరుగుతుంది. సనా మీర్ నాయకత్వంలోని పాక్ మహిళల క్రికెట్ జట్టు ఈ టోర్నీకి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నది. అయితే, ఈ జట్టును భారత్‌కు పంపరాదని పిసిబి హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది.

03/06/2016 - 17:49

ఢాకా: ఆదివారం ఆసియా కప్ టోర్నీ ఫైనల్ టి20 మ్యాచ్ జరగనున్న ఢాకా స్టేడియంపై నల్లటి మేఘాలు ఆవరించాయి. ఇప్పటికే రెండు జట్లు స్టేడియంకు చేరుకున్నాయి. భారీ గాలులు వీస్తున్నాయి. వానపడితే తడవకుండా పిచ్‌ను కవర్ చేశారు.

03/06/2016 - 07:34

మీర్పూర్: ఆసియా కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగే ఫైనల్‌కు ప్రత్యేకత ఏమీ లేదని భారత జట్టు డైరెక్టర్ రవి శాస్ర్తీ స్పష్టం చేశాడు. టోర్నీలో జరిగిన మిగతా మ్యాచ్‌ల మాదిరిగానే దీనిని కూడా చూస్తామని అన్నాడు. శనివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ ఏ మ్యాచ్‌ని ఏ విధంగా ఆడాలో టీమిండియా ఆటగాళ్లకు తెలుసునని వ్యాఖ్యానించాడు.

03/06/2016 - 07:34

ముంబయి: ఇటీవలే రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకున్న ముంబయి, రెస్ట్ఫా ఇండియా జట్ల మధ్య ఆధిపత్య పోరాటం సాగనుంది. ఆదివారం నుంచి ఐదు రోజులు జరిగే ఇరానీ ట్రోఫీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ముంబయి జట్టుకు ఆదిత్య తారే, రెస్ట్ఫా ఇండియాకు నమన్ ఓఝా నాయకత్వం వహిస్తున్నారు.

03/06/2016 - 07:32

ధర్మశాల: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని యాంటీ టెర్రరిస్టు ఫ్రంట్ (ఎటిఎఫ్) హెచ్చరించింది. టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈనెల 19న చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, భారత్ తలపడనున్నాయి. అయితే, సరిహద్దులో ఉగ్రవాద కార్యకపాలను సాగిస్తూ, ఎంతో మంది సైనికుల మృతికి కారణమైన పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

03/06/2016 - 07:32

దర్బన్: డేవిడ్ మిల్లర్ అజేయ అర్ధ శతకంతో రాణించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో గెలుపొంది శుభారంభం చేసింది. మిల్లర్ 35 బంతుల్లోనే 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫఫ్ డు ప్లెసిస్ (40) కూడా బాధ్యతాయుతమైన ఆటతో సౌతాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది.

Pages