S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/06/2016 - 07:30

మీర్పూర్: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు వామప్ టోర్నీ ఆసియా కప్ టి-20 టోర్నీలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఆదివారం నాటి ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. ఏ రకంగా చూసినా ఫేవరిట్‌గా టీమిండియానే పేర్కోవాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బంగ్లాదేశ్ విజేతగా నిలవడం అసాధ్యం.

03/05/2016 - 06:51

న్యూఢిల్లీ: ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్)-2016 టోర్నమెంట్‌లో టైటిల్ కోసం పాట్నా పైరేట్స్, యు ముంబా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్స్‌లో ఈ రెండు జట్లు తమతమ ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ జట్టు 40-21 పాయింట్ల తేడాతో పునేరీ పల్టన్ జట్టును మట్టికరిపించింది.

03/05/2016 - 06:47

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా భారత్‌లో పాకిస్తాన్ జట్టుకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం స్పష్టం చేసింది. భారత్‌లో ఆడటంపై తమకు భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని, కనుక ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగాలనుకుంటున్నామని పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) బెదిరిస్తున్న నేపథ్యంలో బిసిసిఐ ఈ హామీని ఇచ్చింది.

03/05/2016 - 06:46

ముల్హెమ్ ఆన్ డెర్ రర్ (జర్మనీ): జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రియో ఒలింపిక్ బెర్తు కోసం కాలంతో పోటీపడి పరుగులు తీస్తున్న కామనె్వల్త్ క్రీడల చాంపియన్ పారుపల్లి కశ్యప్‌కు మరోసారి గాయమవడంతో అతను ఈ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది.

03/05/2016 - 06:45

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఈ నెల 19వ తేదీన ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌కు ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు పారా మిలటరీ బలగాలను పంపిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

03/05/2016 - 06:44

మీర్పూర్: ప్రస్తుత భారత జట్టు సమతూకంతో కూడుకుని ఉందని, ప్రపంచంలో ఎక్కడైనా, ఏ జట్టునైనా ఓడించే సత్తా కలిగి ఉందని టీమిండియా కెప్టెన్ అభిప్రాయ పడుతున్నాడు. ‘ఈ ఏడాది టి-20 మ్యాచ్‌లలో తాము ఆడుతున్న ఈ జట్టును చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఫార్మెట్‌లో ఆడగల జట్టుగా ఎవరికైనా కనిపిస్తుంది. 50 ఓవర్ల ఫార్మెట్ గురించి నేను మాట్లాడడం లేదు.

03/04/2016 - 07:23

మీర్పూర్: ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపి యన్‌షిప్‌లో గురువారం ఏమాత్రం ప్రాధాన్యతలేని మ్యా చ్‌లో టీమిండియా అలవోకగా విజయాన్ని నమోదు చే సింది. క్రికెట్ పసికూన జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో తలపడిన భారత్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిం చింది. బెంచ్ బలాన్ని బేరీజు వేసుకోవడానికి ఈ మ్యాచ్ లో హర్భజన్ సింగ్, పవన్ నేగీ, భువనేశ్వర్ కుమార్‌లకు స్థానం కల్పించారు.

03/04/2016 - 07:21

ఢిల్లీ: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్స్ పోరాటాలు శుక్రవారం జరుగుతాయి. ఇందిరిగా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే తొలి సెమీ ఫైనల్‌లో పాట్నా పైరేట్స్, పునేరీ పల్టన్ జట్లు ఢీ కొంటాయి. రెండో సెమీ ఫైనల్ యుముంబా, బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ రెండు సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ చేరుకోగా, ఓడిన జట్ల మధ్య 3, 4 స్థానాల కోసం క్లాసిఫికేషన్ మ్యాచ్ శనివారం జరుగుతుంది.

03/04/2016 - 07:20

న్యూఢిల్లీ: లోధా కమిటీ సమర్పించిన నివేదికలోని పలు అంశాలు ఆచరణలో కష్టమని, వాటిని అమలు చేయడం అసాధ్యమని పేర్కొంటూ బిసిసిఐ సుప్రీం కోర్టులో గురువారం దాఖలు చేసిన కౌంటర్‌లో స్పష్టం చేసింది. బోర్డు, దాని సభ్య సంఘాల కార్యవర్గాల్లో మంత్రులకు స్థానం ఉండకూడదని, అంతేగాక, కార్యవర్గ సభ్యులకు గరిష్ట వయోపరిమితిని విధించాలని లోధా కమిటీ చేసిన సిఫార్సులపై బిసిసిఐ అసంతృప్తి వ్యక్తం చేసింది.

03/04/2016 - 07:18

వెల్లింగ్టన్: సుమారు ఒకటిన్నర సంవత్సరాలు కేన్సర్‌తో పోరాడిన న్యూజిలాండ్ క్రికెట్ హీరో మార్టిన్ క్రో గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులను దుఃఖ సాగరంలో ముంచిన 53 ఏళ్ల కివీస్ మాజీ కెప్టెన్ తన ఇన్నింగ్స్‌ను ముగించాడు.

Pages