S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/02/2016 - 07:23

ముంబయ: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా మంగళ వారం జరిగిన మ్యాజ్‌లో బెంగళూ రు బుల్స్‌ను బెంగాల్ వారియర్స్ జట్టు 26-22 తేడాతో ఓడించింది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాళ్లు నీలేష్ షిండే 7 పాయంట్లతో రాణించగా, జాన్ కున్ లీ 6 పాయంట్లు సాధించి, జట్టు విజయంలో తన పాత్ర పోషించాడు. మహేష్ గౌడ్ 5 పాయంట్లు చేశాడు.

03/02/2016 - 07:22

కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్లకు సంపూర్ణ రక్షణ కల్పిస్తా మని, ఈ విషయంలో ఎలాంటి భయాందోళనకు తావులేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) హామీ ఇచ్చిందని స మాచారం. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వర్గా లు వెల్లడించాయ. హిమాచల్ ప్రదేశ్‌లో భద్రత కల్పించలేమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తున్నది.

03/02/2016 - 07:21

జూరిచ్: ముడుపుల ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ పోటీలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన గియానీ ఇన్ఫాంటినో స్పష్టతనిచ్చారు. 2018లో కతార్, 2020లో రష్యా దేశాల్లోనే వరల్డ్ కప్ పోటీలు జరుగుతాయని తేల్చిచెప్పాడు.

03/01/2016 - 08:21

మీర్పూర్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన పసికూన జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)పై పాకిస్తాన్ ప్రతాపం చూసింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచి ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. 130 పరుగుల లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ ఛే దించింది. షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్ అజేయ అర్ధ శతకాలతో రాణించి, పాక్‌ను గెలిపించారు.

03/01/2016 - 08:19

ముంబయ: ప్రో కబడ్డీ చాంపియ న్‌షిప్‌లో సోమవారం పునేరీ పల్టన్‌ను ఢీకొన్న యుముంబా జట్టు మూడు పాయంట్ల తేడాతో వి జయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠభరి తంగా సాగిన ఈ మ్యాజ్‌లో ఒక్కోసారి ఒక్కో మ లుపు తిరుగుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిం ది. యుముంబా 30-27 పాయంట్ల తేడాతో గెలిచి, మద్దతునివ్వడానికి భారీగా తరలి వచ్చిన అభిమా నులను సంతోషపరచింది. ఈ జట్టులో అనూప్ కుమార్ 8 పాయంట్లు సాధించాడు.

03/01/2016 - 08:18

ముల్హెమ్ ఆన్ డెర్ రర్ (జర్మనీ): స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఫిట్నెస్ కారణంగా వైదొలగ్గా, మంగళవారం నుంచి ప్రారంభం కాన్న జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నీలో భారత అభిమానులంతా పివి సింధు, కిడాంబి శ్రీకాంత్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. సైనాను కాలి గాయం తీవ్రంగా వేధిస్తున్నది. ఆల్ ఇంగ్లాండ్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఆమె జర్మనీ ఓపెన్‌కు హాజరుకాలేదు.

03/01/2016 - 08:16

మీర్పూర్: ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను ఢీ కొంటున్న భారత్‌ను ఫిట్నెస్ సమస్య వేధిస్తున్నది. అన్ని విధాలా ప్రత్యర్థి కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ పూర్తి ఫిట్నెస్‌తో లేకపోవడంతో సమస్యలు తప్పకపోవచ్చు.

03/01/2016 - 08:14

డెహ్రాడూన్: భారత మాజీ డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లర్ ఖలీ తానంటే ఏమీటో నిరూపించుకున్నాడు. బ్రోడీ స్టీల్‌ను చిత్తుచేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. గత వారం స్టీల్‌తో జరిగిన పోరులో గాయమైంది. అతని తలకు, మెడకు దెబ్బలు తగిలాయి. తాను కోలుకొని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే స్టీల్ పనిపడతానని ఖలీ ప్రకటించాడు. ఆ మాటను నిలబెట్టుకున్నాడు.

02/29/2016 - 08:47

జూరిచ్: తన భుజాల పైనుంచి కొండంత భారం దిగిపోయిందని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ వ్యాఖ్యానించాడు. కొత్త అధ్యక్షుడిగా గియానీ ఇన్‌ఫాంటినో ఎన్నిక కావడంపై ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, తన స్థానంలో ఫిఫాను ముందుకు తీసుకెళ్లే సత్తా అతనికి ఉందని ప్రశంసించాడు. 1975 నుంచి ఫిఫాతో బ్లాటర్‌కు అనుబంధం ఉంది.

02/29/2016 - 08:45

స్టెలెన్‌బొచ్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా టూర్‌లో భారత మహిళల జట్టు తొలి పరాజయాన్ని చవిచూసింది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌ని 0-3 తేడాతో చేజార్చుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత మహిళలే దాడులకు ఉపక్రమించారు. అయితే, జర్మనీ క్రీడాకారిణులు లిడియా హాస్, పియాసోఫీ ఓల్డ్‌హాఫర్, జూలియా ముల్లర్ తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో జర్మనీ విజయం సాధించింది.

Pages