S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/29/2016 - 08:44

కరాచీ: ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఎదురైన పరాజయాన్ని పాకిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆటగాళ్లు చెత్తగా ఆడి చిత్తుగా ఓడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరాచీసహా, దేశంలోని పలు నగరాలు, పట్టణాల కూడళ్లలో ఏర్పాటు చేసిన జెయింట్ స్క్రీన్లపై మ్యాచ్‌ని వీక్షించడానికి వచ్చిన అభిమానులతో పండుగ వాతావరణం కనిపించింది.

02/29/2016 - 08:43

కరాచీ: భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల్లో ముంచెత్తారు. అతని నుంచి ఏ విధంగా ఆడాలో నేర్చుకోవాలని కొందరు అంటే, అతను వ్యూహాత్మకంగా ఆడిన తీరు అద్భుతమని మరికొందరు పేర్కొన్నారు. మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరో అడుగు ముందుకేసి కోహ్లీకి సచిన్ తెండూల్కర్ మాదిరి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నాడు.

02/29/2016 - 08:43

మీర్పూర్: షేర్ ఎ బంగ్లా స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం అనుకూలంగా లేదని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విమర్శించాడు. హిట్టింగ్‌కు ఏమాత్రం పనికిరాదని విమర్శించాడు. టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు ముందు బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఈ పిచ్‌పై లభించలేదని అన్నాడు.

02/28/2016 - 07:14

ఢాకా: ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్ ఐదు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. పాక్‌ను కేవలం 83 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా తర్వాత ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడినప్పటికీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ బాధ్యతాయుమైన ఆటతో కోలుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్‌ను ఎంచుకొని పాక్‌ను ఇరకాటంలో పెట్టాడు.

02/28/2016 - 07:05

జైపూర్: భారత వాకర్లు రికార్డులు సృష్టించారు. ఇక్కడ జరిగిన జాతీయ చాంపియన్‌షిప్స్‌లో ఏకంగా ఏడు రికార్డులు నమోదయ్యాయి. 20 కిలో మీటర్ల రేస్‌లో వాకర్లు రియో ఒలింపిక్స్ కనీస అర్హత కంటే మెరుగైన టైమింగ్స్‌ను నమోదు చేశారు. కాగా, పురుషుల విభాగంలో ఉత్తరాఖండ్‌కు చెందిన గుర్మీత్ సింగ్ ఒక గంట, 21:24.57 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

02/28/2016 - 07:00

జూరిచ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమస్య (్ఫఫా) అధ్యక్షుడిగా గియానీ ఇన్‌ఫాంటినో ఎన్నికయ్యాడు. ఐరోపా ఖండానికి చెందిన అతను ఈ రేసులో గట్టిపోటీదారు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం ఖలీఫాను 27 ఓట్ల తేడాతో ఓడించాడు. సెప్ బ్లాటర్ వారసుడిగా, ఫిఫాకు 10వ అధ్యక్షుడిగా అవతరించాడు. బ్లాటర్ మాదిరే ఇన్‌ఫాంటినో కూడా స్విట్జర్లాండ్‌కు చెందిన వాడు కావడం వివేషం.

02/28/2016 - 06:57

జూరిచ్: ఫిఫాలో కొత్త శకం ఆరంభం కానుందని అధ్యక్షుడిగా ఎన్నికైన ఇన్‌ఫాంటినో వ్యాఖ్యానించాడు. ఫిఫాకు ఇటీవలే కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని, కష్టాలకు ఎదురీదుతున్నామని అంటూ, పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా సాకర్‌ను మిరంత అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని తెలిపాడు. ఫిఫా వ్యవహారాలన్నీ పారదర్శకంగా సాగుతాయని హామీ ఇచ్చాడు.

02/28/2016 - 06:55

ముంబయి: భారత బాలీవుడ్ నటుడు, ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్‌కు వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ తాను సంతకం చేసిన బ్యాట్‌ను బహూకరించాడు. బిగ్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్న గేల్ నుంచి బ్యాట్‌ను అందుకున్న విషయాన్ని అమితాబ్ ట్వీట్ చేశాడు. గేల్‌కు తాను అభిమానిని అంటూ, అతనికి తన గురించి తెలియడం, బ్యాట్‌ను పంపడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. గేల్ నుంచి ఇంతటి గుర్తింపును తాను ఊహించలేదని అన్నాడు.

02/27/2016 - 03:42

రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్

02/27/2016 - 03:36

దోహా, ఫిబ్రవరి 26: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)ల అప్రతిహత జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. గత 41 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న వీరు దోహాలో జరుగుతున్న కతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్నారు.

Pages