S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/26/2016 - 06:55

న్యూఢిల్లీ: భారత డబుల్స్ షట్లర్లు అవసరానికి మించి ఎక్కువ సమయాన్ని ప్రాక్టీస్‌లోనే వృథా చేస్తున్నారని డెర్మార్క్‌కు చెందిన బాడ్మింటన్ డబుల్స్ స్టార్ కామిల్లా రైటర్ జుల్ అభిప్రాయపడింది. గురువారం ఆమె పిటిఐతో మాట్లాడుతూ, భారత్‌లో డబుల్స్ స్పెషలిస్టులు చాలా మంది ఉన్నారని, కానీ, వారికి సరైన మార్గదర్శకం లేకపోవడంతో అంతర్జాతీయ టోర్నీల్లో రాణించలేకపోతున్నారని అన్నది.

02/25/2016 - 08:02

రాంచీ: మహిళల క్రికెట్‌లో శ్రీలంకను రెండో టి-20 మ్యాచ్‌లో ఢీకొన్న భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనితో చివరిదైన మూడో మ్యాచ్‌కి ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయింది. బుధవారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసింది.

02/25/2016 - 08:01

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి, రెండో టెస్టులోనూ విజయభేరి మోగించిన ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. గెలవడానికి 201 పరుగులు చేయాల్సి ఉండగా, ఒక వికెట్ నష్టానికి 70 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన బుధవారం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.

02/25/2016 - 08:01

పుణె: రంజీ ట్రోఫీ ఫైనల్ మొదటి రోజు సౌరాష్టప్రై ముంబయి జట్టు పట్టు బిగించింది. టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. చెలరేగిపోయిన ముంబయి సీనియర్ పేసర్ ధవళ్ కులకర్ణి 30 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి, సౌరాష్టన్రు దారుణంగా దెబ్బతీశాడు.

02/25/2016 - 08:00

క్రైస్ట్‌చర్చి: తాను పొరపాటు చేశానని, ఒక జట్టుకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించడం తప్పేనని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అంగీకరించాడు. తనను క్షమించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి విజ్ఞప్తి చేశాడు.

02/25/2016 - 07:59

క్రైస్ట్‌చర్చి: అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైర్ కావాలన్న తన నిర్ణయం సరైనదేనని న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండ్ మెక్‌కలమ్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో బుధవారం ముగిసిన రెండవ, చివరి టెస్టులో కివీస్ ఓటమిపాలుకాగా, చివరిసారి మైదానంలో కనిపించిన మెక్‌మిలన్ ముందు నడవగా, సహచరులంతా అతనిని అనుసరించారు.

02/24/2016 - 07:32

మీర్పూర్: ఆసియా కప్ చాంపియన్‌షిప్ బుధవారం నుంచి మొదలుకానుండగా, తొలి మొదటి మ్యాచ్‌కి భారత్, బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీ ఒకవేళ మైదానంలోకి దిగలేకపోతే, అతని స్థానంలో జట్టుకు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వం వహించే అవకాశం ఉంది.

02/24/2016 - 07:31

కరాచీ: భారత్‌లో జరిగే టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే జట్టును పాకిస్తాన్ సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. బాబర్ ఆజమ్, రుమాన్ రరుూస్ గాయాలతో బాధపడుతున్న కారణంగా ఓపెనర్ షర్జీల్ ఖాన్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సమీ జట్టులోకి వచ్చారు. అందరూ ముందుగా ఊహించిన విధంగానే, సెలక్టర్లు ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా టి-20 జట్టును ఎంపిక చేశారు. జట్టుకు షహీద్ అఫ్రిదీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

02/24/2016 - 07:30

మీర్పూర్: టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు ముందు జట్టు బలాబలాల విశే్లషణకు సిసలైన వేదికగా ఆసియా చాంపియన్‌షిప్ ఉపయోగపడుతుందని భారత టెస్టు జట్టు కెప్టెన్, సూపర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ టోర్నీని ఒక గొప్ప ప్యాకేజీగా అభివర్ణించాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి మేటి జట్లను ఎదుర్కోవడం వల్ల టి-20 వరల్డ్ కప్ పోటీలకు అవసరమైన ప్రాక్టీస్ లభిస్తుందని అన్నాడు.

02/24/2016 - 07:29

మీర్పూర్: ఆసియా కప్ టోర్నీలో ప్రతి మ్యాచ్‌నీ జాగ్రత్తగా ఆడాలని టీమిండియా ఆటగాళ్లకు జట్టు డైరెక్టర్ రవి శాస్ర్తీ సూచించాడు. విజయంతో టోర్నీని మొదలు పెడితే ఉత్సాహంగా ముందుకు వెళ్లగలుగుతామని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. ఆరంభంలో వెనుకబడి, ఆతర్వాత అత్యంత కీలకంగా మారే మ్యాచ్‌ల్లో గెలవడం ద్వారా ముందుకు దూసుకురావడం అనే ధోరణి పోవాలని అన్నాడు.

Pages