S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/21/2016 - 08:13

రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) మొదటి సెమీ ఫైనల్‌లో జెపీ పంజాబ్ వారియల్స్ జట్టు 3-1 తేడాతో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించి ఫైనల్ చేరింది. మ్యాచ్ ఆరో నిమిషంలోనే ఢిల్లీకి రూపీందర్ పాల్ సింగ్ గోల్‌ను సాధించిపెట్టాడు. అయితే, ఆ ఆధిక్యాన్ని ఢిల్లీ నిలబెట్టుకోలేకపోయింది. 19వ నిమిషంలో అర్మాన్ ఖురేషీ ద్వారా పంజాబ్ ఈక్వెలైజర్‌ను సాధించింది. అనంతరం ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి.

02/21/2016 - 08:12

కేప్‌టౌన్: చివరి బంతి వరకూ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మొదటి టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ చివరి క్షణాల్లో అద్భుత బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి, చివరి బంతిలో దక్షిణాఫ్రికాను విజయపథంలో నడిపించాడు.

02/20/2016 - 03:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: లోధా కమిటీ ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో చేసిన సూచనలను అమలు చేసే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం చోటు చేసుకున్న నేపథ్యంలో, భారత క్రికెట్ ప్రక్షాళనపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది.

02/20/2016 - 03:42

ముంబయి, ఫిబ్రవరి 19: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లో కేవలం మూడు దేశాల పెత్తనం కొనసాగరాదని, అన్ని సభ్య దేశాలకు సమాన ప్రాతినిథ్యం, వాటా లభించాలని శశాంక్ మనోహర్ చేసిన ప్రకటనపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)లోని ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, మనోహర్‌కు తిరుగులేని బలమున్న కారణంగా అతను అనుసరిస్తున్న విధానాలపై చర్య అవసరమని అభిప్రాయపడింది.

02/20/2016 - 03:41

ముంబయి, ఫిబ్రవరి 19: తన అన్న అజిత్ తనకు స్ఫూర్తినిచ్చాడని, అతని కారణంగానే తాను క్రికెట్‌లోకి అడుగుపెట్టగలిగానని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ అన్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ వెస్టిండీస్‌తో చివరి టెస్టు ఆడిన తర్వాత కూడా తాను అవుటైన విధానంపై అజిత్‌తో చర్చించానని చెప్పాడు. ‘అదే నా చివరి టెస్టు. మళ్లీమళ్లీ టెస్టు మ్యాచ్‌లు ఆడేది లేదని నాకు తెలుసు.

02/20/2016 - 03:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: రిటైర్మెంట్‌పై తనకు ఇప్పుడే ఎలాంటి ఆలోచన లేదని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అతను విలేఖరులతో మాట్లాడుతూ రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని, ప్రస్తుతం తన దృష్టి ఆసియా చాంపియన్‌షిప్, టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలపైనే కేంద్రీకృతమైందని తెలిపాడు.

02/20/2016 - 03:40

హైదరాబాద్, ఫిబ్రవరి 19: భారత పురుషుల జట్టు ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ సుమీ ఫైనల్ చేరింది. మలేసియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో 3-2 తేడాతో విజయం సాధించింది. మొదటి సింగిల్స్ మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-15 తేడాతో మలేసియాకు చెందిన జుల్ఫద్లి జుల్క్ఫ్లిని ఓడించాడు.

02/20/2016 - 03:38

రాంచీ, ఫిబ్రవరి 19: మహిళల క్రికెట్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం నాటి చివరి, మూడో వనే్డలో ఈ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. మీడియం పేసర్ దీప్తీ శర్మ ఆరు వికెట్లు పడగొట్టగా, వేదా కృష్ణమూర్తి అర్ధ శతకాన్ని సాధించి, భారత్‌కు విజయాన్ని అందించింది.

02/20/2016 - 03:38

క్రైస్ట్‌చర్చి, ఫిబ్రవరి 19: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ కెరీర్‌లో ఆఖరి పోరాటానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకూ 97 టెస్టులు ఆడిన అతను శనివారం న్యూజిలండ్‌తో ప్రారంభంకానున్న రెండవ, చివరి టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ అతర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనున్నట్టు అతను ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.

02/20/2016 - 03:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: లోధా కమిటీ చేసిన అత్యంత కీలక సిఫార్సులో ఇదొకటి. బిసిసిఐ కార్యకలాపాల్లో ఎక్కువ శాతం ప్రజలకు సంబంధించిన అంశాలతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి ఏం జరుగుతున్నదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని లోధా కమిటీ వ్యాఖ్యానించింది. తమిళనాడులో ఒక స్వచ్ఛంద సంస్థగా నమోదైనందున బోర్డు పాలనా వ్యవహారాలను గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదని బిసిసిఐ చాలాకాలంగా వాదిస్తున్నది.

Pages