S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/19/2016 - 07:03

హైదరాబాద్: ఆసియా బాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో గురువారం భారత్ 3-2 తేడాతో చైనా జట్టును ఓడించింది. టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు చైనాను ఓడించడం ఇదే తొలిసారి. కిదాంబి శ్రీకాంత్, అజయ్ జయరామ్, హెచ్‌ఎస్.ప్రణయ్ తమతమ సింగిల్స్ మ్యాచ్‌లలో జయకేతనం ఎగురవేసి భారత జట్టుకు ఈ విజయాన్ని అందించారు. ఈ టోర్నమెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి.

02/19/2016 - 07:01

పాట్నా: ప్రో-కబడ్డీ లీగ్ (పికెఎల్) మూడో సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ జట్టు మళ్లీ అద్భుత విజయంతో పుంజుకుంది. గురువారం పాట్నాలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 35-21 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను మట్టికరిపించి ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వర్థమాన ఆటగాడు కె.సెల్వమణితో కలసి ఫైవ్-స్టార్ రైడర్ కషిలింగ్ అడకే దబాంగ్ ఢిల్లీ జట్టును విజయపథంలో నడిపాడు.

02/19/2016 - 07:01

డెల్రే బీచ్ (అమెరికా): అమెరికాలో జరుగుతున్న డెల్రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి జెరేమీ చార్డీ (ఫ్రాన్స్) క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో అన్‌సీడెడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన నాలుగో సీడ్ ఎరిక్ బటొరాక్, స్కాట్ లిప్‌స్కీ జోడీని వరుస సెట్ల తేడాతో మట్టికరిపించారు.

02/19/2016 - 07:00

న్యూఢిల్లీ: కెరీర్‌లో తొలిసారి జట్టుగా కలసి ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి, వర్థమాన ఆటగాడు యుకీ బాంబ్రీతో పాటు డిఫెండింగ్ చాంపియన్లు సాకేత్ మైనేని-సనమ్ సింగ్ ఢిల్లీ ఓపెన్ ఎటిపి టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

02/18/2016 - 08:36

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని తాను మళ్లీ టెన్నిస్ ఆడుతున్నానని వచ్చిన వార్తలను భారత వెటరన్ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి తోసిపుచ్చాడు. తన కోసమే తాను మళ్లీ కోర్టులోకి దిగినట్టు చెప్పాడు. భారత టాప్ ర్యాంకర్ యుకీ భంబ్రీతో కలిసి ఢిల్లీ ఓపెన్‌లో భూపతి పోటీపడుతున్నాడు.

02/18/2016 - 08:35

షిల్లాంగ్, ఫిబ్రవరి 17: గౌహతి, షిల్లాంగ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచడం ఒక ఎత్తయితే, మన దేశంలో పాకిస్తాన్ అథ్లెట్లకు, క్రీడాకారుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదన్న వాస్తవం ప్రపంచానికి తెలియడం మరో ఎత్తు. దీనిని శుభ పరిణామంగానే చెప్పుకోవాలి.

02/18/2016 - 08:31

న్యూఢిల్లీ: దక్షిణ ఆసియా క్రీడలు (శాగ్)లో ఎన్నడూ లేని విధంగా మూడు వందలకుపైగా పతకాలను సాధించిన భారత బృందాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. 22 క్రీడలకు సంబంధించిన 226 ఈవెంట్స్‌లో పోటీలు జరగ్గా 2,672 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీపడ్డారు. భారత్ 188 స్వర్ణం, 90 రజతం, 30 కాంస్యాలతో మొత్తం 308 పతకాలను కైవసం చేసుకొని అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

02/18/2016 - 08:28

పనాజీ: గోవాలోని అర్పోరాలో ఈనెల 19, 20 తేదీల్లో జరిగే ఇండియా బైక్ వీక్ (ఐబిడబ్ల్యు) షోలో ఇంగ్లీష్ ప్రొఫెషనల్ మోటార్ సైకిల్ రైడర్ డౌగీ లాంప్కిన్ స్టార్ అట్రాక్షన్‌గా మారనున్నాడు. ఐబిడబ్ల్యులో భాగంగా గోవాలో మోటో ట్రయల్ షోను నిర్వహిస్తామని సెవెన్టీ ఇఎంజి వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్టిన్ డా కోస్టా తెలిపాడు.

02/18/2016 - 08:27

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. బుధవారం జరిగిన పోటీల్లో సింగపూర్‌పై 5-0 తేడాతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన భారత్ మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్‌లు ఆడింది. తొలి సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-16, 12-21, 21-13 తేడాతో జి లియాంగ్ డెరెక్‌ను ఓడించాడు.

02/17/2016 - 08:04

గౌహతి: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన భారత్ పతకాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. మొత్తం 308 పతకాలను కైవసం చేసుకొని తనకు తిరుగులేదని నిరూపించింది. వీటిలో 188 స్వర్ణం, 90 రజతం, 30 కాంస్య పతకాలు ఉన్నాయి. శ్రీలంక 25 స్వర్ణం, 63 రజతం, 98 కాంస్యాలతో మొత్తం 186 పతకాలు గెల్చుకున్న శ్రీలంకకు రెండో స్థానం దక్కింది.

Pages