S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/14/2016 - 05:38

రాంచీ, ఫిబ్రవరి 13: హ్యాట్రిక్ గురించి తనకు తెలియదని, తన దృష్టి మొత్తం ఆటపైనే కేంద్రీకరించడంతో తాను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని శ్రీలంక మీడియం పేసర్ తిసర పెరెరా ఇక్కడి నుంచి శనివారం విశాఖపట్నం బయలుదేరే ముందు పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. శుక్రవారం భారత్‌తో జరిగిన రెండో టి-20లో 19వ ఓవర్‌ను పెరెరా బౌల్ చేశాడు.

02/13/2016 - 16:17

ఢాకా:అండర్ -19 ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు మూడోస్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో నెగ్గడంతో అదైనా దక్కింది. రెండు సెమీస్ పోటీల్లో ఓడిన శ్రీలంక, బంగ్లాదేశ్ మూడోస్థానంకోసం ఇవాళ తలపడ్డాయి.

02/13/2016 - 03:51

రాంచీ, ఫిబ్రవరి 12: శ్రీలంక యువ జట్టుతో మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు పుణే జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత జట్టు రెండో మ్యాచ్‌లో జూలు విదిల్చి ఘీంకరించింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంత గడ్డ రాంచీలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 69 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించి ప్రతీకారం తీర్చుకుంది.

02/13/2016 - 03:50

కరాచీ, ఫిబ్రవరి 12: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తనపై ఐదేళ్లు నిషేధం విధించడంపై కళంకిత పాక్ ఆంపైర్ అసద్ రవూఫ్ ఎదురుదాడికి దిగాడు. తాను అవినీతికి పాల్పడినట్లు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని, అయినప్పటికీ బిసిసిఐ తనపై నిషేధం విధించిందని ఆయన చెప్పాడు. ‘నేను అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేవని ముంబయి కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది.

02/13/2016 - 03:49

ముంబయి, ఫిబ్రవరి 12: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నమెంట్‌లో పంజాబ్ వారియర్స్ జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో ఆ జట్టు 5-1 గోల్స్ తేడాతో దబాంగ్ ముంబయి జట్టును సొంత మైదానంలో మట్టికరిపించింది.

02/13/2016 - 03:48

ముంబయి, ఫిబ్రవరి 12: పాకిస్తాన్‌కు చెందిన కళంకిత అంపైర్ అసద్ రవూఫ్ (59)పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) వేటు వేసింది. అవినీతికి పాల్పడి క్రికెట్‌కు కళంకం తీసుకొచ్చాడన్న అభియోగాల్లో రవూఫ్ దోషిగా తేలడంతో అతనిపై బిసిసిఐ శుక్రవారం ఐదేళ్ల నిషేధం విధించింది.

02/13/2016 - 03:47

గౌహతి, ఫిబ్రవరి 12: దక్షిణాసియా క్రీడల్లో భారత్ బంగారు పతకాల పంట కొనసాగుతోంది. శుక్రవారం ఏడో రోజు కూడా అథ్లెటిక్స్, షూటింగ్‌విభాగాల్లో మన దేశానికి చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరచడంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే కాక ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉంది.

02/13/2016 - 03:45

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 12: కెరీర్‌లో ఆఖరి పోరాటం సాగిస్తున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ తన వందో టెస్టు మ్యాచ్‌లో విజృంభించడం ఖాయమని అందరూ భావిస్తుంటే అందుకు భిన్నమైన పరిస్థితి ఉత్పన్నమైంది.

02/12/2016 - 07:14

గౌహతి: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నది. గురువారం పోటీలు ముగిసే సమయానికి భారత్ 136 స్వర్ణం, 77 రజతం, 20 కాంస్యాలతో మొత్తం 233 పతకాలను కైవసం చేసుకొని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. శ్రీలంక 146 (24 స్వర్ణం, 48 రజతం, 74 కాంస్యం) పతకాలతో రెండో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ 7 స్వర్ణం, 22 రజతం, 41 కాంస్యాలతో మొత్తం 70 పతకాలను సంపాదించి తృతీయ స్థానంలో కొనసాగుతున్నది.

02/12/2016 - 06:05

రాంచీ: భారత పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విషమ పరీక్షను ఎదుర్కోనున్నాడు. శుక్రవారం శ్రీలంకతో జరిగే రెండో టి-20 మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా ఈ సిరీస్‌లో నిలబడుతుంది. లేకపోతే, పరువుతోపాటు సిరీస్‌ను కూడా కోల్పోతుంది. ఒకవైపు ఆసియా కప్, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టోర్నీలు వేగంగా సమీపిస్తున్నాయి.

Pages