S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/08/2016 - 05:05

ముంబయి: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) త్వరలోనే అత్యవసర సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)ను నిర్వహించనుందని సమాచారం. పిఎస్ రామన్ అధ్యక్షతన బిసిసిఐ లీగల్ ప్యానెల్ ఆదివారం ఇక్కడ సమావేశమై, సుప్రీం కోర్టు చేసిన పలు వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించింది.

02/08/2016 - 05:03

హోబర్ట్: కెప్టెన్ మిథాలీ రాజ్ సూపర్ ఇన్నింగ్స్ భారత్‌ను వైట్‌వాష్ ప్రమాదం నుంచి తప్పించింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆమె 89 పరుగులు చేసి, భారత్‌కు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది. అయితే, మొదటి రెండు వనే్డల్లో విజయాలను అందుకున్న ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

02/08/2016 - 05:02

పెర్త్: న్యూజిలాండ్‌తో సోమవారం జరిగే చివరి వనే్డ సిరీస్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించిన ఫాస్ట్ బౌలర్ జోల్ పారిస్ అన్నాడు. తుది జట్టులో స్థానం దక్కితే, రాణిస్తానన్న నమ్మకం తనకు ఉందన్నాడు. భారత్‌తో జరిగిన వనే్డ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతను న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక కాలేదు.

02/08/2016 - 05:01

ముంబయి: పటిష్టమైన బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో మధ్య ప్రదేశ్ (ఎంపి) చేతిలో ఏకంగా 355 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. అసాధ్యంగా కనిపిస్తున్న 788 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజైన ఆదివారం మూడు వికెట్లకు 113 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన బెంగాల్ 432 పరుగులకు ఆలౌటైంది.

02/07/2016 - 05:27

బెంగళూరు, ఫిబ్రవరి 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలంలో ఈసారి ఆస్ట్రేలియా సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు అత్యధికంగా 9.5 కోట్ల రూపాయలు లభించాయి. భారత ఆటగాడు యువరాజ్ సింగ్‌కు అత్యధిక మొత్తం లభిస్తుందని, అతనే ఈసారి ఐపిఎల్‌లో రికార్డు మొత్తాన్ని పొందుతాడని అందరూ ఊహించినప్పటికీ, అందుకు భిన్నంగా 34 ఏళ్ల వాట్సన్‌కు అత్యధిక ధర పలికింది.

02/07/2016 - 05:24

బెంగళూరు, ఫిబ్రవరి 6: షేన్ వాట్సన్, యువరాజ్ సింగ్‌తోపాటు మరికొంత మంది ఆటగాళ్ల బేస్ ప్రైస్ రెండు కోట్ల రూపాయలు. కానీ, వాట్సన్, యువీ మాదిరి వారు అత్యధిక మొత్తాలను సంపాదించుకోలేకపోయారు. వీరిద్దరితోపాటు ఆశిష్ నెహ్రా, మిచెల్ మార్ష్, సంజూ శాంసన్, ఇశాంత్ శర్మ, కెవిన్ పీటర్సన్, దినేష్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, ధవళ్ కులకర్ణి తదితరుల కనీస ధర రెండు కోట్ల రూపాయలే.

02/07/2016 - 05:23

బెంగళూరు, ఫిబ్రవరి 6: చాలా మంది స్టార్ క్రికెటర్లకు ఈసారి వేలంలో అవకాశమే దక్కలేదు. అలాంటి వారిలో ఆస్ట్రేలియా టి-20 కెప్టెన్ ఆరోన్ ఫించ్, న్యూజిలాండ్‌కు చెందిన హార్డ్ హిట్టర్ మార్టిన్ గుప్టిల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జి బెయిలీ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆటగాళ్లు మహేల జయవర్ధనే, మైఖేల్ హస్సీ, బ్రాడ్ హాడిన్ తదితరులు ఉన్నారు.

02/07/2016 - 05:22

బెంగళూరు: మోహిత్ శర్మ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. అతనికి వివాహం నిశ్చయం కావడానికి, ఐపిఎల్‌లో 6.5 కోట్ల రూపాయలు లభించడానికి సంబంధం ఏమైనా ఉందా? ఉందని అంటున్నది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ భాగస్వామి ప్రీతీ జింటా. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనందువల్లే మోహిత్‌కు ఐపిఎల్‌లో భారీ ధర పలికిందని చమత్కరించింది. మోహిత్ కంటే అతని భార్య అదృష్టవంతురాలని వ్యాఖ్యానించింది.

02/07/2016 - 05:21

షిల్లాంగ్, ఫిబ్రవరి 6: దక్షిణాఫ్రికా గేమ్స్ (శాగ్)లో భారత్ శుభారంభం చేసింది. మొదటి రోజునే 14 స్వర్ణాలు, ఐదు రజత పతకాలతో సత్తా చాటింది. పలు విభాగాల్లో పతకాలను ఇప్పటికే ఖాయం చేసుకోగా, మరికొన్ని అంశాల్లో విజయాల దిశగా పరుగులు తీస్తున్నది.

02/07/2016 - 05:19

బెంగళూరు, ఫిబ్రవరి 6: యువరాజ్ సింగ్‌కు ఈ వేలంలో నిరాశ తప్పలేదు. అందరి కంటే ఎక్కువ మొత్తం అతనికే లభిస్తుందని విశే్లషకులు అంచనా వేశారు. గత ఏడాది 16 కోట్ల రూపాయలను దక్కించుకొని, ఐపిఎల్‌లో రికార్డును సృష్టించిన అతను మరోసారి అదే స్థాయి మొత్తాన్ని ఆశించాడు. కానీ, అనూహ్యంగా అతను ఏడు కోట్ల రూపాయలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యువీని కొనుక్కొంది.

Pages