S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/07/2016 - 05:19

బెంగళూరు, ఫిబ్రవరి 6: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై విచారణ అనంతరం సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ ఇటీవల సమర్పించిన నివేదికలో చేసిన సిఫార్సులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) షెడ్యూల్‌తో ఎలాంటి సంబంధం లేదని టోర్నమెంట్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు.

02/06/2016 - 15:54

హైదరాబాద్-అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ పోటీల్లో భారతజట్టు సెమీస్‌కు చేరుకుంది. నమీబియాపై అద్భుత విజయం సాధించి సెమీస్‌కు దూసుకువెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంబించిన నమీబియా జట్టును 152 పరుగులకే ఆలౌట్ చేయడంతో 197 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.

02/06/2016 - 15:17

బెంగళూరు-్భరత్‌లో త్వరలో జరగనున్న ఐపిఎల్-9 సీజన్‌లో ఆడేందుకు తమకు నచ్చిన ఆటగాళ్లకోసం వివిధ ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొన్నాయి. బెంగళూరులో శనివారం ఉదయం ప్రారంభమైన వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్‌కు అందరికన్నా అధికంగా 9.5 కోట్లు ధర పలికింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆయనను ఎంపిక చేసుకుంది. కాగా భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు 7 కోట్ల ధర పలికింది. పది ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొన్నాయి.

02/06/2016 - 11:50

బెంగళూరు: ఐపిఎల్-9 కోసం బెంగళూరులో ఈ రోజు ఉదయం వేలం నిర్వహించగా భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను రూ.7 కోట్ల మొత్తంతో హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ షేర్న్ వాట్సన్‌ను రాయల్ ఛాలెంజర్స్ (బెంగళూరు) రూ.9.5 కోట్లకు వేలం పాడింది. ఆషిష్ నెహ్రాకు 5.5 కోట్లు, కెవిన్ పీటర్స్‌కు 3.5 కోట్లు వేలంలో ధర పలికింది.

02/06/2016 - 02:15

గౌహతి, ఫిబ్రవరి 5: దక్షిణాసియా క్రీడోత్సవాలు (శాగ్) శుక్రవారం ఇక్కడ అట్టహాసంగా మొదలైనాయి. కన్నుల పండువగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఈశాన్య రాష్ట్రాల భిన్న సంస్కృతుల మేళవింపుగా నిలిచింది. నగరంలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రీడోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో 12 రోజుల పాటు సాగే ఈ క్రీడలు అధికారికంగా ప్రారంభమయినట్లయింది.

02/06/2016 - 00:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: త్వరలో జరుగనున్న ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు ఐసిసి ప్రపంచ కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు భారత సెలెక్టర్లు శుక్రవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. యువకులు, అనుభవజ్ఞులను ఏర్చి కూర్చిన ఈ జట్టులో అన్‌క్యాప్డ్ యువ ఆల్‌రౌండర్ పవన్ నేగీ (23)తో పాటు గాయాలతో ఇబ్బందులు పడుతున్న పేసర్ మహమ్మద్ షమీ (25)కి చోటు కల్పించారు.

02/06/2016 - 00:25

హోబర్ట్, ఫిబ్రవరి 5: భారత మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక వనే్డ (డే/నైట్) సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు కాన్‌బెర్రాలో జరిగిన వనే్డలో భారత్‌ను 101 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా జట్టు తాజాగా శుక్రవారం హోబర్ట్‌లోని బెల్లిరీవ్ ఓవల్ మైదానంలో జరిగిన రెండో వనే్డలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

02/06/2016 - 00:24

రాజ్‌కోట్, ఫిబ్రవరి 5: భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాజ్‌కోట్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ రివా సోలంకిని జడేజా వివాహం చేసుకోబోతున్నాడు. రాజ్‌కోట్‌లోని కలవాద్ రోడ్డులో ఉన్న జడేజాకే చెందిన ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’ రెస్టారెంట్‌లో శుక్రవారం ఈ ఇద్దరి వివాహం నిశ్చితార్థం జరిగింది. కొద్ది మంది ఆహూతుల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.

02/06/2016 - 00:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత క్రికెట్‌లో సంస్కరణలపై లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంపై తప్పించుకోవడానికి కుంటిసాకులు వెతకడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అంటూ, అయితే ఈ సిపార్సుల లాభనష్టాలపై చర్చించే హక్కు బోర్డుకుందని స్పష్టం చేశారు.

02/06/2016 - 00:22

బెంగళూరు, ఫిబ్రవరి 5: ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ తొమ్మిదో ఎడిషన్‌కు సంబంధించి శనివారం బెంగళూరులో ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించనున్నారు. మొత్తం 351 మంది ఆటగాళ్లను ఈ వేలంలో అమ్మకానికి పెడతారు. వీరిలో 203 మంది భారత ఆటగాళ్లు, మరో 131 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

Pages