S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/04/2016 - 07:23

ఆక్లాండ్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకు బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వనే్డలో చేదు అనుభవం ఎదురైంది. స్టీవెన్ స్మిత్ నాయకత్వంలోని ఆ జట్టు ఏకంగా 159 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

02/04/2016 - 07:22

ఇటానగర్: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్) క్రీడాజ్యోతి రిలే బుధవారం ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జెపి రాజ్‌కొవ జెండాను ఊపి, రిలేను మొదలుపెట్టాడు. రాజ్ భవన్ హెలిపాడ్ వద్ద క్రీడాజ్యోతి ప్రయాణం ఆరంభంకాగా, సుమారు 2,000 మంది విద్యార్థులు, పలువురు అథ్లెట్లు, అభిమానులు హాజరై వీడ్కోలు పలికారు.

02/04/2016 - 07:20

ముంబయి: ఇండియన్ హాకీ లీగ్ (ఐహెచ్‌ఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ముంబయి సంచలనం సృష్టించింది. వరుస విజయాలతో దూసుకెళుతున్న రాంచీ రేస్‌ను 7-5 తేడాతో ఓడించి, వరుసగా నాలుగు పరాజయాల తర్వాత తొలి ఓటమిని నమోదు చేసింది. మ్యాచ్ 11వ నిమిషంలో ముంబయికి దివాకర్ రామ్ తొలి గోల్‌ను అందించగా, మరో ఏడు నిమిషాల్లోనే రాంచీకి కెప్టెన్ ఆష్లే జాక్సన్ ఈక్వెలైజర్‌ను అందించాడు.

02/04/2016 - 07:20

న్యూఢిల్లీ: తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ దానిని ప్రదర్శించే అలవాటు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ధోనీపై వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవాలు సహజమని చెప్పాడు. తాను కూడా ఎన్నోసార్లు విమర్శలకు గురయ్యానని తెలిపాడు.

02/03/2016 - 06:08

చిట్టగాంగ్, ఫిబ్రవరి 2: అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ వివాదం తలెత్తింది. బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ ఒకవేళ క్రీజ్ నుంచి బయటకు వస్తే, సదరు బౌలర్ బంతితో వికెట్లను కొట్టడాన్ని ‘మన్కడింగ్’ అంటారు. భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ తొలిసారి ఈ విధానాన్ని అనుసరించాడు.

02/03/2016 - 05:28

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గాయాలతో బాధపడుతూ దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో ఆడాలా అంటూ భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారులపై స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శాగ్ నుంచి తనను మినహాయించాలని కోరుతూ బాయ్‌తోపాటు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు కూడా తాను లేఖలు రాశానని మంగళవారం పిటిఐతో మాట్లాడుతూ కశ్యప్ చెప్పాడు. కానీ, ఎవరూ సానుకూలంగా స్పందించలేదని వాపోయాడు.

02/03/2016 - 05:27

జంషెడ్పూర్, ఫిబ్రవరి 2: భారత క్రికెటర్లు ఒకరి తర్వాత మరొకరిగా ఓ ఇంటవారవుతున్నారు. ఇటీవలే హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ పెళ్లిళ్లు చేసుకోగా, ఆ జాబితాలో ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ కూడా చేరాడు. స్థానిక కోర్టులో తన చిన్ననాటి స్నేహితురాలు రాగిణిని అతను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ గురువారం ఇక్కడి చర్చిలో వారి మత విశ్వాసాల ప్రకారం పెళ్లి జరుగుతుందని సమాచారం.

02/03/2016 - 05:24

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 2: ప్రో కబడ్డీ లీగ్ నాలుగవ రోజు జరిగిన పోటీలో తెలుగు టైటాన్స్ జట్టు ఓటమి చవిచూసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన తెలుగు టైటాన్స్ జట్టు ఈ మ్యాచ్‌లో ఒక్కసారిగా సంయమనం కోల్పోయి 17-25 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో చిత్తు అయింది. దీంతో విశాఖలో జరిగిన పోటీల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో మిశ్రమ ఫలితాలు సాధించింది.

02/03/2016 - 05:22

లండన్, ఫిబ్రవరి 2: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓడిన బ్రిటన్ స్టార్, రెండో ర్యాంకర్ ఆండీ ముర్రేకు లండన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పలువురు అధికారులు పుష్పగుచ్ఛాలను అందించి అతనికి స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల వేలాదిమంది మంది అభిమానులు అతని కోసం నిరీక్షించారు.

02/02/2016 - 02:22

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వరుస విజయాలు ఎంతో ఆనందాన్నిస్తున్నాయని, వీటి వల్ల బాధ్యత మరింతగా పెరుగుతున్నదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెప్పింది.

Pages